IND VS WI – SRH: వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య హైదరాబాద్ లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ పై ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ మ్యాచ్ లో దాదాపు 500 పరుగులు నమోదు అయ్యాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్… ఊచకోత కోసింది. టీమిండియా ఆటగాళ్లు కూడా మొదట మెరుపులు మెరిపించారు. మిడిల్ ఆర్డర్ లో ఎవరో ఒకరు నిలబడి ఉంటే కచ్చితంగా విండీస్ విధించిన 248 పరుగుల టార్గెట్ ను టీమిండియా ఊదిపారేసేది. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ పై ట్రోలింగ్ మొదలైంది.
ఉప్పల్ స్టేడియంలో భారీ స్కోరు నమోదు అయిన నేపథ్యంలోనే కావ్య పాప జట్టును ఆడుకుంటున్నారు. ఉప్పల్ స్టేడియంలో మొదటి నుంచి ఫ్లాట్ పిచ్ ఉంటుందని… అందుకే ప్రతి ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తారని కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి మ్యాచ్ లో కూడా 250కి పైగా సన్రైజర్స్ హైదరాబాద్ స్కోర్ చేసిందని ట్రోల్ చేస్తున్నారు. మేమే హీరోలమంటూ బిల్డప్ ఇచ్చేవారని, కానీ విండీస్ ప్లేయర్లు ఊచకోత కోసిన తర్వాత అసలు రంగు బయట పడిందని సెటైర్లు పేల్చుతున్నారు.
సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ వరుణ్ అరోన్ గతంలో కూడా ఉప్పల్ మైదానంపై కీలక వ్యాఖ్యలు చేసిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. ఫ్లాట్ మైదానాలలో హైదరాబాద్ స్టేడియం ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని బాంబు పేల్చాడు. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లేదా సెకండ్ చేసినా 200 పరుగులు సులభంగా చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. గత రెండు సంవత్సరాలలోనే ఈ మైదానంలో 27 సార్లు 200కు పైగా పరుగులు నమోదు అయినట్టు ఆయన నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయి.
ప్రతి మ్యాచ్ ఓ 17 సిక్సర్ల కంటే ఎక్కువగానే నమోదు అవుతున్నాయని చెబుతున్నారు. ఈ మైదానంలో 297 పరుగుల హైయెస్ట్ స్కోర్ నమోదు అయింది. అది కూడా సన్రైజర్స్ హైదరాబాద్ సాధించిన సంగతి తెలిసిందే. అందుకే హైదరాబాద్ అత్యంత భయంకరమైన జట్టుగా కనిపిస్తోందని ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు. మిగతా గ్రౌండ్ లలో హైదరాబాద్ ఆటగాళ్లు పెద్దగా రాణించారని… కేవలం హోమ్ గ్రౌండ్ లో మాత్రమే దుమ్ము లేపుతారని చురకలు అంటిస్తున్నారు.
సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ లో అదరగొడతారని గుర్తు చేస్తున్నారు. ఉప్పల్ మైదానంలో బాగా ఆడి… టీమిండియాలోకి వచ్చారని కొంతమంది పరువు తీస్తున్నారు. ఇది ఆటగాళ్లు ఇతర మైదానాలలో ప్రదర్శన ఇవ్వబోరని హేళన చేస్తున్నారు.