E-Paper
Advertisement

Novak Djokovic : ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత జకోవిచ్…నాదల్ రికార్డు సమం..

Novak Djokovic : ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత జకోవిచ్…నాదల్ రికార్డు సమం..
Advertisement

Novak Djokovic : సెర్బియా టెన్నిస్‌ స్టార్ నొవాక్ జకోవిచ్‌ చరిత్ర సృష్టించాడు. పదోసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. మొత్తంమీద తన ఖాతాలో 22వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ వేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్ సమరంలో 6-3, 7-6, 7-6 తేడాతో సిట్సిపాస్‌పై జకోవిచ్‌ విజయం సాధించి ఆస్ట్రేలియన్‌ ఓపెన్ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. ఈ టోర్నిలో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన జకోవిచ్‌ తొలి మ్యాచ్ నుంచి దూసుకుపోయాడు. అయితే ఫైనల్‌లో తొలి సెట్‌ను సులువుగానే సొంతం చేసుకొన్న జకోవిచ్.. రెండు, మూడు సెట్లలో మాత్రం సిట్సిపాస్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. దీంతో రెండు, మూడు సెట్లు టై బ్రేక్‌ కు వెళ్లాయి. టై బ్రేక్ లో జకోవిచ్‌ పైచేయి సాధించి టైటిల్‌ను దక్కించుకొన్నాడు.

కరోనా వ్యాక్సిన్‌ వేసుకోకపోవడంతో గతేడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడకుండా జకోవిచ్ వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఏడాది మాత్రం అద్భుత ఆటతీరును జకోవిచ్‌ ప్రదర్శించాడు. మరో స్టార్ ఆటగాడు నాదల్ గాయం కారణంగా ఆరంభంలోనే ఇంటిముఖం పట్టాడు. ఇది కూడా జకోవిచ్‌కు కలిసొచ్చింది. అయితే ఫైనల్‌లో సిట్సిపాస్‌ నుంచి గట్టి పోటీనే తట్టుకొని టైటిల్‌ను సొంతం చేసుకొన్నాడు సెర్బియా స్టార్.

Advertisement

10వ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్స్ గెలిచిన జకోవిచ్..7 వింబుల్డన్ ట్రోఫీలు సాధించాడు. అలాగే మూడుసార్లు యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచాడు. జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ మాత్రం రెండుసార్లే కైవసం చేసుకున్నాడు. ఇలా కెరీర్‌లో 22వ గ్రాండ్‌స్లామ్‌ను కైవసం చేసుకొని నాదల్‌ తో సమంగా నిలిచాడు.

Tags

Related News

ఒరేయ్ గంభీరా ? నా లాగా వికెట్లు తీసే మొన‌గాడ్నిచూపిస్తే, దేనికైనా రెడీ..!

వైభ‌వ్ వీడియోలు చూసి, వీక్నెస్ తెలుసుకున్నాం…ఆ బుడ్డోడి భ‌ర‌తం ప‌డ‌తాం

ఇషాన్ ను నెత్తిన పెట్టుకుని, గిల్ ను బీసీసీఐ హీనంగా చూస్తోంది..!

ధోని పెద్ద ఛీట‌ర్, 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ ఒక్క‌డి వ‌ల్లే రాలేదు..11 మంది క‌ష్ట‌ప‌డితేనే సాధ్య‌మైంది!

కావ్య పాప నిర్ణయమే ముంచేసింది…SRHపై శిఖర్ ధావన్ సీరియస్?

గ్రెగ్ చాపెల్ పెద్ద రాక్ష‌సుడు..ప్లేయ‌ర్ల మ‌ధ్య గొడ‌వ‌లు పెట్టి, టీమిండియాను నాశ‌నం చేశాడు

250 కాదు 170 దాట‌డం క‌ష్ట‌మే…మా బౌన్స‌ర్ల దెబ్బ‌కు టీమిండియా ప్యాంట్లు త‌డిచిపోతాయ్!

వైభ‌వ్ కు ఏది చేత‌కాదు…వాడికి ఓవ‌రాక్ష‌న్ ఎక్కువ, మ్యాట‌ర్ త‌క్కువ !

Big Stories

Advertisement
×