E-Paper
Advertisement

16GB Gaming Phone: మంచి గేమింగ్ ఫోన్ కొవాలా? కొత్త 16GB ర్యామ్‌గల గేమింగ్ ఫోన్‌‌పై డిస్కౌంట్ ఆఫర్

16GB Gaming Phone: మంచి గేమింగ్ ఫోన్ కొవాలా? కొత్త 16GB ర్యామ్‌గల గేమింగ్ ఫోన్‌‌పై డిస్కౌంట్ ఆఫర్

16GB Gaming Phone ASUS| పవర్‌ఫుల్ ఫీచర్స్ ఉన్న గేమింగ్ స్మార్ట్‌ఫోన్ చాలా ఖరీదు చేస్తుంది. కానీ ప్రస్తుతం ఒక మంచి గేమింగ్ ఫోన్ పై డిస్కౌంగ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఏసస్ తన ప్రీమియం గేమింగ్ ఫోన్‌ విజయ్ సేల్స్ ద్వారా భారీ డిస్కౌంట్‌తో అందిస్తోంది. ఏసస్ రోగ్ (ASUS ROG) ఫోన్ 8 ప్రో 5Gలో సీరియస్ మొబైల్ గేమర్ల కోసం ఫ్లాగ్‌షిప్ హార్డ్‌వేర్ ఉంది. 16GB ర్యామ్, బలమైన ప్రాసెసర్, అడ్వాన్స్‌డ్ కూలింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఏసస్ ROG ఫోన్ 8 ప్రో 5G ధర, డిస్కౌంట్ ఆఫర్లు

ఏసస్ ROG ఫోన్ 8 ప్రో 5G ప్రీమియం డిజైన్, పవర్‌ఫుల్ ఇంటర్నల్స్‌తో వస్తుంది. 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.94,999. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. గరిష్టంగా రూ.10,000 డిస్కౌంట్ వర్తిస్తుంది. బ్యాంక్ ఆఫర్ అప్లై చేస్తే ధర రూ.90,249కు తగ్గుతుంది. ఈ గేమింగ్ ఫోన్ పై ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. నెలకు రూ.3,958తో కొనుగోలు చేయవచ్చు.

డిస్‌ప్లే క్వాలిటీ, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్

ఏసస్ ROG ఫోన్ 8 ప్రో 5Gలో 6.78 అంగుళాల పెద్ద డిస్‌ప్లే ఉంది. శామ్‌సంగ్ AMOLED LTPO ప్యానెల్‌తో ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్ లభిస్తుంది. 165Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ గేమింగ్ విజువల్స్ అందిస్తుంది. స్క్రీన్ రిజల్యూషన్ 1080 x 2400 పిక్సెల్స్. షార్ప్ విజువల్స్, వైబ్రంట్ కలర్స్, ఎక్సలెంట్ బ్రైట్‌నెస్ లెవల్స్ ఇస్తుంది. హై రిఫ్రెష్ రేట్ గేమ్‌ప్లే రెస్పాన్స్, యానిమేషన్ స్మూత్‌నెస్‌ను మెరుగుపరుస్తుంది.

లాంగ్ గేమింగ్ సెషన్లకు అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్

ఏసస్ ఈ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌తో స్నాప్-ఆన్ ఏరోయాక్టివ్ కూలర్ ఎక్స్ ఇస్తోంది. ఇందులో బిల్ట్-ఇన్ థర్మోఇలెక్ట్రిక్ కూలింగ్ చిప్ ఉంది. హెవీ గేమింగ్ సమయంలో ఫోన్ ఉష్ణోగ్రత తగ్గిస్తుంది. కూలింగ్ ఫ్యాన్ టెంపరేచర్ 28 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గిస్తుంది. డెడికేటెడ్ గేమింగ్ బటన్స్ ఇన్-గేమ్ కంట్రోల్, పెర్ఫామెన్స్ మెరుగుపరుస్తాయి. ఓవర్‌హీటింగ్ లేకుండా లాంగ్ గేమింగ్ సాధ్యమవుతుంది.

పెర్ఫామెన్స్, ర్యా,మ్ సాఫ్ట్‌వేర్

ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 16GB LPDDR5X ర్యామ్‌తో మల్టీటాస్కింగ్‌తో ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఫాస్ట్ యూఎఫ్‌ఎస్ 4.0 ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఈ కాంబినేషన్ ఫ్లాగ్‌షిప్ లెవల్ స్పీడ్, స్టేబుల్ గేమింగ్ పెర్ఫామెన్స్ ఇస్తుంది.

బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ సపోర్ట్

ఏసస్ ROG ఫోన్ 8 ప్రో 5Gలో 5,500mAh భారీ బ్యాటరీ ఉంది. లాంగ్ గేమింగ్, స్ట్రీమింగ్ సెషన్లకు సులభంగా సపోర్ట్ చేస్తుంది. 65w ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంది. గేమింగ్ సెషన్ల మధ్య డౌన్‌టైమ్ తగ్గిస్తుంది.

Also Read: ప్రకృతి నాశనం.. మనుషుల కంటే ఎక్కువ నీరు తాగేస్తున్న ఏఐ టెక్నాలజీ

కెమెరా ఫీచర్లు, ఫోటోగ్రఫీ

రియర్(వెనుకవైపు) కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ సెన్సార్ ఉంది. 13MP అల్ట్రా-వైడ్ కెమెరాతో వైడ్ షాట్స్ తీయవచ్చు. 32MP మూడో రియర్ కెమెరా జూమ్, పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీని మెరుగుపరుస్తుంది. ఫ్రంట్‌లో 12MP సెన్సార్ సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు ఉపయోగపడుతుంది. డేలైట్, ఇండోర్ కండిషన్లలో కెమెరా సిస్టమ్ బాగా పనిచేస్తుంది.

కనెక్టివిటీ, సెక్యూరిటీ, డిజైన్

ఫోన్ 5G, 4G LTO కనెక్టివిటీ సపోర్ట్ చేస్తుంది. వై-ఫై, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 5.3, ఎన్‌ఎఫ్‌సీ, GPS ఉన్నాయి. గేమర్లకు 3.5MM హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది. యూఎస్‌బి టైప్-సీ పోర్ట్ ఛార్జింగ్, డేటా ట్రాన్స్‌ఫర్‌కు ఉపయోగపడుతుంది. సెక్యూరిటీకి ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ రికగ్నిషన్ ఉన్నాయి. ఫోన్ పొడవు 163.8MM, బరువు 225 గ్రాములు.

 

Related News

నథింగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు!

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

Big Stories

×