E-Paper
Advertisement

Vijay hazare trophy: రింకూ సింగ్ అద్భుత సెంచరీ.. సెలక్టర్ల నమ్మకాన్ని నిజం చేసినట్టేనా?

Vijay hazare trophy: రింకూ సింగ్ అద్భుత సెంచరీ.. సెలక్టర్ల నమ్మకాన్ని నిజం చేసినట్టేనా?
Advertisement

Vijay hazare trophy: టీమిండియా సెలెక్టర్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నాడు యువ ఆటగాడు రింకూ సింగ్. 2026 టి-20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కి తనని ఎంపిక చేయడం సరైనదేనని నిరూపిస్తున్నాడు. వన్డే టోర్ని విజయ్ హజారే ట్రోఫీలో ఇతడు కొనసాగిస్తున్న ఫామ్ ఇందుకు నిదర్శనం. విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఈ ఫినిషిర్.. ఈ ట్రోఫీ 2025 – 26 సీజన్ ని విజయంతో ఆరంభించాడు.

Also Read: India’s ODI Squad: న్యూజిలాండ్ తో వ‌న్డేలు.. టీమిండియా జ‌ట్టు ప్ర‌క‌ట‌న మ‌రింత ఆల‌స్యం.. అయ్య‌ర్ కు కెప్టెన్సీ !

Advertisement

ఎలైట్ గ్రూప్ – బి లో భాగంగా రాజ్కోట్ వేదికగా బుధవారం రోజు ఉత్తరప్రదేశ్ – హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో.. హైదరాబాద్ జట్టుపై ఉత్తరప్రదేశ్ 84 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రింకు సింగ్ 48 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఇక శుక్రవారం రోజు చండీగఢ్ తో జరుగుతున్న మ్యాచ్ లో కూడా 56 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.

 

రింకూ సింగ్ అద్భుత సెంచరీ:

Advertisement

శుక్రవారం రోజు రాజ్కోట్ వేదికగా చండీగఢ్ తో జరుగుతున్న రెండవ మ్యాచ్ లో టాస్ ఓడిపోయిన ఉత్తరప్రదేశ్ మొదట బ్యాటింగ్ కి దిగింది. అయితే ఓపెనర్ అభిషేక్ గోస్వామి {1} దారుణంగా విఫలమయ్యాడు. కానీ మరో ఓపెనర్ ఆర్యన్ జుయల్ 118 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేశాడు. అలాగే వన్ డౌన్ లో వచ్చిన దృవ్ జురెల్ కూడా 67 పరుగులు చేశాడు. ఇక ఐదవ స్థానంలో క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ రింకూ సింగ్ విధ్వంసకర సెంచరీతో చండీగఢ్ బౌలర్లపై విడుచుకుపడ్డాడు. కేవలం 56 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 60 బంతుల్లో 16 పరుగులతో చివరి వరకు నాటౌట్ గా నిలిచాడు. తన సెంచరీలో 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.

 

భారీ స్కోర్ నమోదు చేసిన ఉత్తరప్రదేశ్ జట్టు:

ఆర్యన్ జుయల్, రింకూ సింగ్ సెంచరీలతో చెలరేగడంతో ఉత్తర ప్రదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. ఇక చండీగఢ్ బౌలర్లలో తరణ్ ప్రీత్ సింగ్ 2, సందీప్ శర్మ, నిషుంక్ బిర్లా చెరో వికెట్ పడగొట్టారు. అయితే విజయ్ హజారే ట్రోఫీలో రింకు సింగ్ నిలకడగా రాణించడం అతనికి ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా.. మళ్లీ పొట్టి ఫార్మాట్ కి మారే ముందు మ్యాచ్ ఫిట్నెస్ ని నిలబెట్టుకోవడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

Also Read: Rohit sharma: రోహిత్ శర్మను ఆటపట్టించిన ఫ్యాన్.. వడాపావ్ అంటూ!

జట్టు మేనేజ్మెంట్ కి కూడా దేశవాళి క్రికెట్ లో ఇతడు ఇస్తున్న నిరంతర ప్రదర్శనలు భరోసా ఇచ్చే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా లోయర్ ఆర్డర్ లో ఒత్తిడితో కూడిన పరిస్థితులలో బ్యాటింగ్ చేయాల్సిన పాత్రకు రింకూ సింగ్ ఎంత సిద్ధంగా ఉన్నాడో ఈ ప్రదర్శనలు స్పష్టంగా చూపిస్తున్నాయి. భారత సెలక్టర్లు కూడా ఈ ఫామ్ అంతర్జాతీయ స్థాయిలో ఎలా కొనసాగుతుందన్న దానిపై నిశితంగా దృష్టి సారించనున్నారు.

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×