E-Paper
Advertisement

Avian Influenza:- అమెరికాను వణికిస్తున్న బర్డ్ ఫ్లూ.. మరో మహమ్మారి రూపంలో..

Avian Influenza:- అమెరికాను వణికిస్తున్న బర్డ్ ఫ్లూ.. మరో మహమ్మారి రూపంలో..
Advertisement

Avian Influenza:- కోవిడ్ అనేది వచ్చిన తర్వాత అసలు వైరస్ అనేది భయంకరమైనది అని, అది మనుషుల ప్రాణాలకు ఎంత ముప్పు కలిగిస్తుందని చాలామందికి తెలిసింది. అందుకే అప్పటినుండి ఆరోగ్యం విషయంలో చాలామంది మరికొన్ని ఎక్కువ జాగ్రత్తలే తీసుకుంటున్నారు. అయినా కూడా పలు రకాల వ్యాధులు మళ్లీ మనుషులను కలవరపెడుతున్నాయి. అందులో ఒకటి ఏవియన్ ఇన్‌ఫ్లూయెన్జా. ప్రస్తుతం ఇది యూఎస్ ప్రజలను వణికిస్తోంది.

మామూలుగా వచ్చే ఫ్లూ కూడా మనిషిని శారీరికంగా చాలా బలహీనంగా మారుస్తుంది. అలాంటివి అమెరికాలో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని కారణంగా మార్కెట్లో గుడ్ల రేట్లు ఆకాశాన్ని తాకాయి. అంతే కాకుండా ఇది మరో మహమ్మారిగా మారుతుందని అమెరికా మీడియా అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఇంతకు ముందు వచ్చిన బర్డ్ ఫ్లూతో పోలిస్తే ఇప్పటి ఏవియన్ ఫ్లూ (హెచ్5ఎన్1) కొంచెం భిన్నం అని శాస్త్రవేత్తలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అందుకే అదే కోణంలో పరిశోధనలు మొదలుపెట్టారు.

Advertisement

అమెరికాలో వాతావరణ మార్పులు వైల్డ్ బర్డ్స్‌పై చూపిస్తున్న ప్రభావం వల్ల ఈసారి వచ్చిన ఏవియన్ ఫ్లూ అనేది మరింత ఎక్కువగా మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిసి ముందుకెళ్తేనే దీని వ్యాప్తిని అరికట్టవచ్చని అన్నారు. ఫుడ్ సెక్యూరిటీ, ఎకానమీపై హెచ్5ఎన్1 తీవ్ర ప్రభావం చూపిస్తుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని వారే స్వయంగా ప్రజలకు ప్రకటించారు కూడా.

ఏవియన్ ఇన్‌ఫ్లూయెన్జాను శాస్త్రవేత్తలు ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా చూస్తున్నా కూడా ఈసారి అటాక్ అయిన ఇన్‌ఫ్లూయెన్జా మాత్రం చాలా భిన్నంగా ఉందని బయటపెట్టారు. ఇదివరకు వ్యాప్తి చెందిన ఏవియన్ ఇన్‌ఫ్లూయెన్జా అంత హానికరమైనది కాదని అన్నారు. ఇప్పుడు వచ్చిన ఈ ఫ్లూ చాలా భయంకరంగా ఉందని, ఇది మునుపెన్నడూ చూడని ప్రాణ నష్టాన్ని కూడా కలిగిస్తుందని తెలిపారు. ఒక్కొక్కరికి ప్రయత్నిస్తే దీని వ్యాప్తిని అరికట్టడం కష్టమని, దేశంలో ఉన్న వ్యవసాయి రంగం, ప్రభుత్వాలు, ఏజెన్సీలు.. ఇలా అన్ని కలిస్తేనే దీని వ్యాప్తిని అడ్డుకునే అవకాశం ఉందని పిలుపునిచ్చారు.

Advertisement

2014 నుండి 2023 మధ్యలో ఏవియన్ ఇన్‌ఫ్లూయెన్జా ఏయే దేశాల్లో వ్యాప్తి చెందింది అనే సమాచారాన్ని తీసుకున్న శాస్త్రవేత్తలు.. దాన్నిబట్టి పరిశోధనలు చేస్తున్నారు. ముందుగా అమెరికా బర్డ్ ఫ్లూకు సంబంధించిన మొదటి కేసు 2021 చివర్లో రిపోర్ట్ అయ్యింది. 2022 అక్టోబర్ వరకు దాదాపు 31 వైల్డ్ బర్డ్స్ అనేవి దీని వల్ల మరణించాయి. ఇప్పటివరకు అమెరికా, కెనడా దేశాల్లో కలిపి ఏకంగా 33,504 వైల్డ్ బర్డ్స్ మృత్యువాత పడ్డాయి. వైల్డ్ బర్డ్స్‌తో పాటు డొమెస్టిక్ కోళ్లు, పక్షులు కూడా దీని వల్ల ఎఫెక్ట్ అయ్యి మరణిస్తున్నాయి. అందుకే ప్రభుత్వం వీలైనంత త్వరగా స్పందించాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు.

Related News

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!

ఈ బడ్జెట్‌లో ఇంతకంటే.. బెస్ట్ టీవీ దొరకదు బాస్!

Big Stories

Advertisement
×