BigTV English

Virupaksha Twitter Review : థ్రిల్లింగ్ సీన్స్.. ట్విస్టులు అదుర్స్.. ట్విట్టర్ టాక్ ఇదే..!

Virupaksha Twitter Review : థ్రిల్లింగ్ సీన్స్.. ట్విస్టులు అదుర్స్.. ట్విట్టర్ టాక్ ఇదే..!

Virupaksha Twitter Review(Tollywood Updates): చాలాకాలం తర్వాత మెగా మేనల్లుడు ప్రేక్షకులు ముందుకొచ్చాడు. యాక్సిడెంట్ తర్వాత కోలుకుని మళ్లీ అదే ఎనర్జీతో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా సినిమా విరూపాక్ష. టీజర్లు, ట్రైలర్లు ఈ మూవీపై ఆసక్తిని పెంచేశాయి. సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హిట్ కోసం ఎదురుచూస్తున్న సాయిధరమ్ తేజ్ విరూపాక్షతో విజయాన్ని అందుకుంటాడనే అంచనాలు వచ్చేశాయి. మెగాఫ్యాన్స్ ఈ మూవీ కోసం చాలారోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి థియేటర్లలో సందడి చేస్తున్న విరూపాక్ష మూవీ ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? మొదటి షో చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు? ఆ విషయాలు తెలుసుకుందాం..?


విరూపాక్ష ఫస్ట్‌ షో అవగానే ప్రేక్షకులు ట్విట్టర్ లో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘విరూపాక్ష’ కథేంటి? ఎలా ఉంది? ఇలాంటి ఆసక్తికర అంశాలను సోషల్ మీడియా వేదికగా చర్చిస్తున్నారు. సినిమాకు ట్విట్టర్ లో పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. దర్శకుడు కార్తీక్‌ సినిమాను చాలా బాగా హ్యాండిల్‌ చేశాడని అంటున్నారు. స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా ఉందని ట్వీట్లు చేస్తున్నారు. సుకుమార్‌ స్క్రీన్‌ ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉందని కామెంట్‌ చేస్తున్నారు. ట్విస్టులు కూడా బాగున్నాయని చెబుతున్నారు.

సూర్యగా సాయి ధరమ్ తేజ్, నందినిగా సంయుక్త మీనన్ తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారని నెటిజన్లు అంటున్నారు. వారిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకున్నాయంటున్నారు. రుద్రవనంకు సంబంధించి సీన్స్ ఉత్కంఠ కలిగించాయంటున్నారు. అఘోరాగా అజయ్ అదరగొట్టాడని చెబుతున్నారు. ఆ ఊరిలో ప్రజలు అనుమానాస్పదంగా మృతి చెందడం, ఈ మిస్టరీ ఛేదించే పాత్రలో సాయిధరమ్ తేజ్ ఇరగదీశాడని ప్రశంసిస్తున్నారు. ఫస్టాఫ్ ఆసక్తిగొల్పే థ్రిల్లింగ్ సీన్స్ తో సాగిందని అంటున్నారు.


ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ట్విస్ట్ లు రివీల్ చేసిన విధానం ఆసక్తిని రేపిందంటున్నారు. సాయి ధరమ్ తేజ్ రుద్రవనం ప్రజలను కాపాడేందుకు ప్రయత్నించే సన్నివేశాలు ఉత్కంఠగా ఉంటాయని చెబుతున్నారు. ఆసక్తికర మలుపులు ట్విస్ట్ లు తర్వాత సినిమా ఉహించని విధంగా ముగుస్తుందనేది నెటిజన్ల మాట.

మొత్తంమీద విరూపాక్ష మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. కాంతార` ఫేమ్‌ అజనీష్‌ లోక్‌నాథ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అంటున్నారు. అమెరికా నుంచి విరూపాక్ష మూవీపై పాజిటివ్ టాకే వినిపిస్తోంది.

https://twitter.com/venkyreviews/status/1649225706193207299

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×