E-Paper
Advertisement

Mini Fridges: కదిలే ఫ్రిడ్జ్‌లు.. కారు, ఆఫీసు, సమ్మర్ వెకేషన్స్.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు!

Mini Fridges: కదిలే ఫ్రిడ్జ్‌లు.. కారు, ఆఫీసు, సమ్మర్ వెకేషన్స్.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు!
Advertisement

Mini Fridges: సమ్మర్ లో ఫ్రిడ్జ్ లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. దాహంతో అల్లాడే గొంతుకు చల్లటి నీటిని ఈ ఫ్రిడ్జ్ లు అందిస్తాయి. అయితే సాధారణంగా ఫ్రిడ్జ్ లు భారీగా ఉండి.. ఒక చోట నుంచి మరో చోటుకు తరలించేందుకు అవకాశం ఉండదు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మార్కెట్ లో మినీ ఫ్రిడ్జ్ లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఏ విధంగా ఉపయోగించాలి? బుల్లి ఫ్రిడ్జ్ ల వల్ల కలిగే లాభాలు? ఇప్పుడు పరిశీలిద్దాం.

మినీ ఫ్రిడ్జ్ సౌకర్యాలు..

సాధారణ ఫ్రిడ్జ్ లు భారీగా ఉండి.. వంట గదికి మాత్రమే పరిమితం అవుతాయి. కానీ పోర్టబుల్ ఫ్రిడ్జ్ లు ఇందుకు పూర్తి భిన్నం. సైజ్ తక్కువగా ఉండి.. ఎక్కడికైనా తరలించేందుకు వీలుగా ఉంటాయి. రాత్రి వేళల్లో నీళ్లు, కూల్ డ్రింక్స్ తాగేందుకు బెడ్ రూమ్ లో దీనిని పెట్టుకోవచ్చు. అలాగే ఆఫీసుకు తీసుకెళ్లి వాటర్ బాటిల్, లంచ్ బాక్స్ లు భద్రపరుచుకోవచ్చు. హాస్టల్లో ఉండే వారు తమ పాలు, పండ్లు, జ్యూస్ లు దాచుకోడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. మూవీ చూస్తున్నప్పుడు లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు చిల్డ్ డ్రింక్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్ దీని ద్వారా అందుబాటులో ఉంచుకోవచ్చు.

మినీ ఫ్రిడ్జ్ వల్ల ప్రయోజనాలు?

Advertisement

సాధారణ ఫ్రిడ్జ్ లతో పోలిస్తే మినీ ఫ్రిడ్జ్ ల ద్వారా కొన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి చాలా చిన్నవిగా ఉన్నందున టేబుల్ మీద, గది మూలల్లో సులభంగా సర్దుబాటు చేయవచ్చు. నార్మల్ ఫ్రిడ్జ్ లతో పోలిస్తే విద్యుత్ వినియోగం కూడా తక్కువే. బరువు తేలిగ్గా ఉండటం వల్ల ఇల్లు మారినప్పుడు దీనిని ఈజీగా తమ వెంట తీసుకెళ్లవచ్చు. తక్కువ బడ్జెట్ లో మంచి కూలింగ్ సౌకర్యం కోరుకునేవారికి మినీ ఫ్రిడ్జ్ లు బెస్ట్ ఆప్షన్స్ గా నిలుస్తున్నాయి. రెగ్యులర్ గా పిక్నిక్స్ కు వెళ్లేవారికి పోర్టబుల్ ఫ్రిడ్జ్ లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

Also Read: AI Smart ACs: AI టెక్నాలజీ, Wi-Fi కనెక్టివిటీ.. వాయిస్ కంట్రోల్ ఫీచర్లు.. ఈ ఏసీలు చాలా స్మార్ట్ గురూ!

కొనేముందు పరిశీలించాల్సిన అంశాలు..

Advertisement

మినీ ఫ్రిడ్జ్ లు కొనుగోలు చేసే ముందు కొన్ని అంశాలు గుర్తుంచుకోవాలి. మీ అవసరానికి అనుగుణంగా 45-90 లీటర్ల కేపాసిటీ ఉన్నవి ఎంచుకోవచ్చు. బెడ్‌రూమ్‌లో పెట్టుకోవాలనుకుంటే, తక్కువ శబ్దం చేసే మోడల్‌ను ఎంచుకోవడం మంచిది. మీకు ఐస్ క్యూబ్స్ కావాలనుకుంటే, చిన్న ఫ్రీజర్ బాక్స్ ఉన్న మోడల్ చూసుకోండి. మినీ ఫ్రిజ్‌లు కేవలం విలాసం మాత్రమే కాదు.. బ్యాచిలర్స్, చిన్న కుటుంబాలకు ఇది ఒక స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ గా నిలుస్తోందని చెప్పవచ్చు.

Also Read: AC – Fridge: ఏసీ ఉన్న గదిలోనే ఫ్రిడ్జ్‌ను పెడుతున్నారా? మీ జేబుకి చిల్లు పడటం ఖాయం!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×