E-Paper
Advertisement

AI Smart ACs: AI టెక్నాలజీ, Wi-Fi కనెక్టివిటీ.. వాయిస్ కంట్రోల్ ఫీచర్లు.. ఈ ఏసీలు చాలా స్మార్ట్ గురూ!

AI Smart ACs: AI టెక్నాలజీ, Wi-Fi కనెక్టివిటీ.. వాయిస్ కంట్రోల్ ఫీచర్లు.. ఈ ఏసీలు చాలా స్మార్ట్ గురూ!
Advertisement

AI Smart ACs: ప్రస్తుత ఏఐ యుగంలో ప్రతీ ఎలక్ట్రానిక్ వస్తువు స్మార్ట్ గా మారిపోతోంది. అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలను అందిస్తోంది. వీటికి ఏసీలు సైతం అతీతం కాదు. ప్రస్తుతం మార్కెట్ లో ఏఐ ఆధారిత స్మార్ట్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. వై-ఫై కనెక్టింగ్, వాయిస్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు వాటిలో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ లోని టాప్-5 స్మార్ట్ ఏసీలు ఏవో ఇప్పుడు చూద్దాం.

శాంసంగ్ బెస్పోక్ ఏఐ విండ్ ఫ్రీ (Samsung Bespoke AI WindFree)

మార్కెట్ లోని అడ్వాన్స్డ్ ఏసీల్లో ఇదీ ఒకటి. ఇది Bespoke AI టెక్నాలజీతో పనిచేస్తుంది. యూజర్ వినియోగించే విధానానికి అనుగుణంగా కూలింగ్ ను ఈ ఆటోమేటిక్ గా ఇది సర్దుబాటు చేసుకుంటుంది. స్మార్ట్ థింగ్స్ (Smart Things) యాప్ ద్వారా ఈ ఏసీని కంట్రోల్ చేయవచ్చు. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్. బక్స్బీ (Bixby) వాయిస్ సపోర్ట్ ఉంది. ఇతర ఏసీలతో పోలిస్తే 30 శాతం వరకూ విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీనిలోని విండ్ ఫ్రీ టెక్నాలజీ కారణంగా గాలి నేరుగా శరీరానికి తగలకుండా గది అంతా చల్లబడుతుంది.

ఎల్జీ ఏఐ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ (LG AI Dual Inverter AC)

Advertisement

మార్కెట్ లో ఎల్జీ ఏసీలకు మంచి గుర్తింపు ఉంది. స్మార్ట్ ఫీచర్లకు సైతం ఈ ఏసీ ప్రసిద్ధి చెందింది. 2026లో ఎల్జీ నుంచి ఏఐ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ లాంచ్ అయ్యింది. దీనిలో AI Convertible 6-in-1 కూలింగ్ ఆప్షన్ ఉంటుంది. ఎల్జీ థింక్ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా ఈ ఏసీని ఆపరేట్ చేయవచ్చు. వైఫై కనెక్టివిటీ, వాయిస్ కంట్రోల్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులోని సెన్సార్లు.. ఏఐ టెక్నాలజీ ఆధారంగా గది ఉష్ణోగ్రతను గుర్తించి డైట్ మోడ్ లేదా వైరాట్ మోడ్ ను ఆటోమేటిక్ గా ఎంచుకుంటాయి. ఇందులో హిమ్ క్లీన్ టెక్నాలజీ.. ఏసీలోపల బ్యాక్టీరియా చేరకుండా ఆటోమేటిక్ గా క్లీన్ చేస్తుంది.

పానాసోనిక్ స్మార్ట్ వైఫై ఏసీ (Panasonic Miraie Smart AC)

పానాసోనిక్ తన Miraie ప్లాట్‌ఫామ్ ద్వారా అత్యుత్తమ స్మార్ట్ అనుభవాన్ని అందిస్తోంది. ఇది Matter ప్రోటోకాల్‌ను సపోర్ట్ చేసే మొదటి ఏసీలలో ఒకటి. MirAie యాప్ ద్వారా ఈ ఏసీని కంట్రోల్ చేయవచ్చు. మీ అవసరానికి అనుగుణంగా కస్టమైజ్డ్ స్పీల్ ప్రొఫైల్స్ ను సెట్ చేసుకోవచ్చు. ఇందులోని ట్రూ ఏఐ టెక్నాలజీ బయట వాతావరణం, గదిలోని తేమ ఆధారంగా కూలింగ్ మేనేజ్ చేస్తుంది. గాలిని శుద్ధి చేసే నానో-జి టెక్నాలజీ ఇందులో మరో ప్రత్యేకమైన ఫీచర్ గా చెప్పవచ్చు.

క్యారియర్ ఎస్టర్ ఎడ్జ్ ఏఐ (Carrier Ester Edge AI)

Advertisement

2026 మోడల్ కు చెందిన ఈ ఏసీ.. ప్రీవియస్ వాటితో పోలిస్తే అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో వై ఫై కనెక్టివిటీతో పాటు Geo-fencing టెక్నాలజీ ఉంది. అంటే మీరు ఇంటికి దగ్గరకు రాగానే ఏసీ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. గూగుల్ హోమ్, అలెక్సా ద్వారా దీనిని కంట్రోల్ చేయవచ్చు. 52°C ఎండలో కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది.

Also Read: Convertible Refrigerators: వేసవిలో కూల్ కూల్.. 2026లో బెస్ట్ రిఫ్రిజరేటర్లు.. ధర, ఫీచర్స్ ఇవే

బ్లూ స్టార్ AI ప్రో (Blue Star AI Pro)

బ్లూ స్టార్ తన స్మార్ట్ సిరీస్‌లో DigiQ Hepta Sensorsని ప్రవేశపెట్టింది. ఇవి అత్యంత ఖచ్చితమైన కూలింగ్‌ను అందిస్తాయి. బ్లూ స్టార్ స్మార్ట్ యాప్ ద్వారా ఈ ఏసీకి సంబంధించిన ఎనర్జీ వినియోగాన్ని మానిటర్ చేయవచ్చు. వాయిస్ కమాండ్స్‌తో ఉష్ణోగ్రత మార్చుకోవచ్చు. ఇందులోని ‘AI Pro’ ఫీచర్.. గదిలో మనుషుల సంఖ్యను బట్టి కూలింగ్ లోడ్‌ను సర్దుబాటు చేస్తుంది.

Also Read: AC – Fridge: ఏసీ ఉన్న గదిలోనే ఫ్రిడ్జ్‌ను పెడుతున్నారా? అయితే మీకు ఈ నష్టాలు తప్పవు!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×