E-Paper
Advertisement

కొత్త ఏసీ కావాలా? 2026లో టాప్ మోడల్స్ ఇవే.. ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వదు!

కొత్త ఏసీ కావాలా? 2026లో టాప్ మోడల్స్ ఇవే.. ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వదు!
Advertisement

Air Conditioners: తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఎండలు కాస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత బయటకు వచ్చే పరిస్థితే ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు. అటు ఇళ్లలోనూ ఉక్కపోతతో అల్లాడిపోతున్నట్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వేసవిలో మంచి ఉపశమనం కలిగించే అత్యుత్తమ 1.5 టన్ 5 స్టార్ ఏసీలను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. ఇవి విద్యుత్ ను పొదుపుగా వాడుకుంటూ పవర్ బిల్లును చాలా వరకూ తగ్గిస్తాయి. రూ.55,000లోపు బడ్జెట్ లో 2026లోనే ది బెస్ట్ గా నిలిచిన ఏసీలు, వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి.

పానాసోనిక్ 1.5 టన్ 5స్టార్ ఏసీ

పానాసోనిక్ నుండి వచ్చిన ఈ కొత్త మోడల్.. అత్యధికంగా 5.8 ISEER రేటింగ్‌తో విద్యుత్ ఆదాలో అగ్రస్థానంలో ఉంది. ఇది ‘మ్యాటర్ (Matter)’ ఫీచర్ తో వచ్చినందువల్ల ఇంట్లోని ఇతర స్మార్ట్ పరికరాలతో సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. దీనిలోని 8 ఇన్ 1 కన్వర్టిబుల్ ఫీచర్, PM 0.1 ఎయిర్ ఫిల్టర్ గదిలోని గాలిని ప్యూరిఫై చేయడమే కాకుండా.. అవసరాన్ని బట్టి కూలింగ్ సామర్థ్యాన్ని మార్చుకోవడానికి వీలు కల్పిస్తుంది. మార్కెట్లో ఈ ఏసీ రూ.53,500కి సేల్ అవుతోంది.

ఎల్‌జీ ఏఐ డ్యూయల్ ఇన్వర్టర్

Advertisement

2026 లేటెస్ట్ మోడల్ ఏసీలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఎల్జీ తీసుకొచ్చింది. ఇది గదిలోని వాతావరణాన్ని బట్టి కూలింగ్‌ను దానంతట అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. దీనిలోని విరాట్ మోడ్.. అత్యంత వేగంగా గదిని చల్లబరుస్తుంది. ఇది సైలెంట్ గా తనపని తాను చేసుకుపోతూ.. రాత్రిళ్లు ఆహ్లాదకరమైన నిద్రను అందిస్తుంది. దీని ధర మార్కెట్లో రూ.48,490 వరకు ఉంది.

డైకిన్ ఇన్వర్టర్ ఏసీ

క్వాలిటీ, మన్నిక విషయంలో డైకిన్ ఏసీలకు మార్కెట్ లో మంచి గుడ్ ఉంది. 2026లో డైకిన్ తీసుకొచ్చిన ఏసీల్లో.. డ్యూన్ క్లీన్ టెక్నాలజీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇది లోపలి కాయిల్స్‌ను ఆటోమేటిక్‌గా శుభ్రం చేసి.. స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. దీనిలోని ట్రిపుల్ డిస్‌ప్లే ఫీచర్ ద్వారా పవర్ వినియోగం, గది టెంపరేచర్ ను ఏసీ పైనే చూడవచ్చు. ఇది మార్కెట్లో రూ.46,990 – రూ.49,990 మధ్య లభిస్తోంది.

శాంసంగ్ విండ్‌ఫ్రీ ఏసీ

Advertisement

శాంసంగ్ విండ్‌ఫ్రీ టెక్నాలజీతో వచ్చిన ఈ ఏసీ.. చల్లగాలి నేరుగా శరీరానికి తగలకుండా గది మెుత్తాన్ని కూల్ చేస్తుంది. దీనిలోని ఏఐ ఎనర్జీ మోడ్ ను ఉపయోగించి.. 20% వరకు విద్యుత్ ను ఆదా చేయవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్లు గాలిలోని క్రిములను తొలగించి.. గదిలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని పేర్కొన్నాయి. దీని ధర రూ. 45,000 నుంచి రూ.52,000 మధ్య ఉంది.

Also Read: అమ్మాయిల లోదుస్తుల్లో అబ్బాయిలు.. చైనాలో కొత్త ట్రెండ్, అసలు కారణం ఇదే!

వోల్టాస్ వెక్ట్రా సిరీస్

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి వోల్టాస్ 5-స్టార్ ఏసీ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఇది 52 డిగ్రీల ఎండలో కూడా సమర్థవంతంగా గదిని కూల్ చేస్తుంది. దీనిలోపలి యాంటీ డస్ట్ ఫిల్టర్లు.. దుమ్ము, దూళి, హానికార క్రిములను తొలగించి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయి. ఇది మార్కెట్లో రూ.38,990 నుంచి రూ.42,000 మధ్య సేల్ అవుతోంది.

Also Read: OTT బాగా చూస్తారా? అయితే ఈ ప్లాన్స్ మీకోసమే.. తక్కువ ధరలో అన్‌లిమిటెడ్ వినోదం!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×