E-Paper
Advertisement

OTT బాగా చూస్తారా? అయితే ఈ ప్లాన్స్ మీకోసమే.. తక్కువ ధరలో అన్‌లిమిటెడ్ వినోదం!

OTT బాగా చూస్తారా? అయితే ఈ ప్లాన్స్ మీకోసమే.. తక్కువ ధరలో అన్‌లిమిటెడ్ వినోదం!
Advertisement

OTT Recharge Plans: టెలికాం కంపెనీల మధ్య పోటీ రోజు రోజుకు గణనీయంగా పెరుగుతోంది. దీంతో కస్టమర్లను ఆకర్షించేందుకు బోలెడన్ని బెనిఫిట్స్ తో రీఛార్జ్ ప్లాన్స్ ను ఎయిర్ టెల్, జియో, వీఐ, బీఎస్ఎన్ఎల్ తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం యూత్ పెద్ద ఎత్తున ఓటీటీ చూస్తున్న నేపథ్యంలో.. తమ ప్లాన్స్ లో నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి వాటికి ఉచిత సబ్ స్క్రిప్షన్లు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయా సంస్థలు ఉచితంగా ఓటీటీలు అందిస్తున్న ప్లాన్స్ ఏవి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.

ఎయిర్‌టెల్ (Airtel)

 

రూ.279 ప్లాన్

Advertisement

ఎయిర్ టెల్ తీసుకొచ్చిన ఈ రీఛార్జ్ ప్లాన్.. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది. 30 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ ద్వారా ఏకంగా 20పైగా ఓటీటీ యాప్ లను ఉచితంగా పొందొచ్చు. ఇందులో నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ సైతం ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి ఈ ప్లాస్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. దీంతో పాటు 1GB డేటా యూజర్ కు లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ పై ఫ్రీ కాల్స్, ఎస్ఎంఎస్ లు అందుబాటులో ఉండవు.

రూ. 3,999 వార్షిక ప్లాన్

ఒక్క రీఛార్జ్ తో ఏడాది అంతా వినోదం కోరుకునేవారికి ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. అయితే ఇది ఫైబర్ నెట్ సేవలు అందిస్తుంది. 350పైగా టీవీ ఛానల్స్, నెలకు 3300GB డేటా, 4K అండ్రాయిడ్ టీవీ బాక్స్, వైఫై రూటర్ దీని కింద అందిస్తారు. అలాగే నెట్ ఫ్లిక్స్ (బేసిక్), అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, యాపిల్ టీవీ తదితర ఓటీటీలకు ఉచిత సబ్ స్క్రిప్షన్ సైతం లభించనుంది. వాటిని ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొని కూడా వాడుకోవచ్చు.

రిలయన్స్ జియో (Jio)

Advertisement

 

రూ.1,299 ప్లాన్

84 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్.. నెట్ ఫ్లిక్స్ (మెుబైల్ వెర్షన్), యూట్యూబ్ ప్రీమియం కంటెంట్ ను ఉచితంగా అందిస్తుంది. అలాగే రోజుకు 2GB చొప్పున ప్లాన్ పూర్తయ్యే సమయానికి యూజర్ కు 168 GB లభిస్తుంది. వీటితో అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్ లకు ఉచిత యాక్సెస్ లభిస్తాయి.

రూ. 3999 వార్షిక ప్లాన్

ఏడాది పొడవున ఓటీటీ వినోదం కోరుకునే జియో కస్టమర్లకు ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. ఈ ప్లాన్ కింద రోజుకు 2.5GB డేటా లభిస్తుంది. అలాగే జియో హాట్ స్టార్ తో పాటు.. క్రీడల కోసం ఫ్యాన్ కోడ్ ఓటీటీకి ఉచిత సబ్ స్క్రిప్షన్ పొందొచ్చు. దీంతో 18 నెలల పాటు జెమిని ప్రో ఏఐ యాక్సెస్ ను జియో అందించనుంది.

వోడాఫోన్ ఐడియా (Vi)

 

రూ. 1,599 ప్లాన్..

నెట్ ఫ్లిక్స్ ప్రియుల కోసం.. వీఐ ఈ ప్లాన్ తీసుకొచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ లో ప్రతీ రోజూ 2.5GB డేటా డేటా లభించనుంది. అలాగే నెట్ ఫ్లిక్స్ (బేసిక్ వెర్షన్) కు సంబంధించిన ఫ్రీ సబ్ స్క్రిప్షన్ పొందొచ్చు. అంతేకాకుండా అపరిమిత కాల్స్, రోజుకు 100SMSలు లిభిస్తాయి. రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరుకు అపరిమిత డేటా ను వినియోగించుకోవచ్చు.

వీఐ వార్షిక ఓటీటీ ప్లాన్లు

వీఐ తన రూ.3,699, రూ.3,799 ప్లాన్‌ల ద్వారా కూడా ఉచితంగా ఓటీటీలను అందిస్తోంది. వీటిని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా జియో హాట్ స్టార్, అమేజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ కంటెంట్ ను ఏడాది పొడవునా ఉచితంగా వీక్షించవచ్చు.

Also Read: BSNL మరో క్రేజీ ప్లాన్.. 3 నెలల పాటు.. రోజూ 3GB డేటా, ఫ్రీ కాల్స్!

బీఎస్ఎన్ఎల్ (BSNL)

 

రూ.799 ఫైబర్ ప్లాన్

ఈ ఫైబర్ ఇంటర్నెట్ ప్లాన్ ద్వారా జియో హాట్ స్టార్, సోనీలివ్, జీ5 వంటి సేవలను ఉచితంగా పొందొచ్చు. మరోవైపు రూ.499 అదనపు ప్యాక్ ను రీఛార్జ్ చేసుకుంటే 3 నెలల పాటు జియో హాట్ స్టార్, సోనీలివ్ యాక్సెస్ ను బీఎస్ఎన్ఎల్ అందిస్తుంది.

Also Read: BSNL రూ.1 ప్లాన్.. ప్రతీరోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్.. దీనిని కొట్టేదే లేదు భయ్యా!

Related News

రూ. 20 వేల బడ్జెట్‌లో బెస్ట్ వాషింగ్ మెషిన్! మీ ఇంటికి పర్ఫెక్ట్

రూ. 16,499 కే సామ్‌సంగ్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ! ఈ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

జేబులో పట్టే సైజులో పవర్ బ్యాంక్.. ధర కూడా చాలా తక్కువ తెలుసా ?

ఆఫీస్ నుంచే ఇల్లు క్లీన్ చేయొచ్చా? ఫోన్‌తో ఆపరేట్ అయ్యే రోబో వాక్యూమ్స్

ఫోటో, వీడియో ఎడిటింగ్ సరికొత్తగా! మీ బడ్జెట్‌లో టాప్ 5 డిస్‌ప్లే మానిటర్స్

మీ టీవీకి పర్‌ఫెక్ట్ జోడీ!హోమ్ థియేటర్ ఫీల్ ఇచ్చే.. టాప్ సౌండ్‌బార్స్

తాగునీరు విషయంలో కాంప్రమైజ్ వద్దు ! వీటితో హెల్దీ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్

అమ్మో..ఈ మిక్సర్ గ్రైండర్స్ ఇంత స్మార్టా? మీ టైమ్, మనీ ఆదా చేసే టాప్ 5 మిక్సర్లు ఇవే!

Big Stories

Advertisement
×