E-Paper
Advertisement

అమ్మాయిల లోదుస్తుల్లో అబ్బాయిలు.. చైనాలో కొత్త ట్రెండ్, అసలు కారణం ఇదే!

అమ్మాయిల లోదుస్తుల్లో అబ్బాయిలు.. చైనాలో కొత్త ట్రెండ్, అసలు కారణం ఇదే!
Advertisement

Male Lingerie Models: చైనాలోని ఆన్‌లైన్ షాపింగ్ ప్రపంచంలో ఇప్పుడు ఒక వింతైన మార్పు చోటుచేసుకుంది. మహిళా మోడల్స్ లోదుస్తులు (Lingerie) ధరించి లైవ్ స్ట్రీమింగ్‌లో ప్రదర్శించడంపై డ్రాగెన్ ప్రభుత్వం నిషేధం విధించడంతో.. అక్కడి వ్యాపారవేత్తలు వినూత్నమైన దారిని ఎంచుకున్నారు. మహిళలు లోదుస్తులు ధరించకూడదన్న నిబంధనను గౌరవిస్తూనే.. మగ మోడల్స్ ను ఇందుకోసం రంగంలోకి దింపుతున్నారు. విక్రయదారులు.. స్త్రీలకు సంబంధించిన లోదుస్తుల ఉత్పత్తులను పురుషులతో ప్రమోట్ చేయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, దృశ్యాలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే మెుదలైంది.

అసలేం జరిగిందంటే?

ఆన్ లైన్ కంటెంట్ లో అశ్లీలతను దూరం చేసే లక్ష్యంతో చైనా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. మహిళా మోడల్స్ లోదుస్తులు ధరించి.. లైవ్ స్ట్రీమ్స్, బ్రాండ్స్ ప్రమోట్ చేయడంపై నిషేధం విధించింది. దీంతో తమ ఉత్పత్తులను మహిళా మోడల్స్ ద్వారా ప్రచారం చేయడానికి వ్యాపారులకు ఆటంకం ఏర్పడుతోంది. కేవలం బొమ్మల (Mannequins) మీద లోదుస్తులను ప్రదర్శిస్తే.. అమ్మకాలు తగ్గుతాయన్న భావన కంపెనీల్లో పెరిగిపోయింది. దీంతో వారు ఒక క్రేజీ ఐడియాతో ముందుకు వచ్చారు.

Advertisement

రంగంలోకి మగ మోడల్స్

మహిళలు లోదుస్తులతో లైవ్ స్ట్రీమ్ చేయకుడదన్న నిబంధనను పాటిస్తూనే మగ మోడల్స్ (Male Models) ద్వారా వాటిని ప్రదర్శించడం మొదలుపెట్టారు. సిల్క్ రోబ్స్, లేస్ నైట్ వేర్, లోదుస్తులను ధరించి మగ మోడల్స్ టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ప్రత్యక్షమవుతున్నారు. చట్టాన్ని అతిక్రమించకుండా తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు తీసుకున్న తెలివైన నిర్ణయంగా వ్యాపారస్తులు దీనిని సమర్థించుకుంటున్నారు. మగవారితో లోదుస్తులు ప్రమోట్ చేయించడం ఫన్నీగా ఉండటమే కాకుండా తమ సేల్స్ ను కూడా పెంచుతున్నట్లు వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

నెటిజన్ల రియాక్షన్ ఇదే..

మరోవైపు మగవారితో స్త్రీల లోదుస్తులను ప్రమోట్ చేయించడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇది చూసి ఆశ్చర్యపోవడంతో పాటు వ్యాపారవేత్తల తెలివిని మెచ్చుకుంటున్నారు. ఆడవారు చేసేది తామూ చేయగలమని మరోమారు మగవారు నిరూపించుకున్నారని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మార్పును అత్యధిక శాతం మంది స్వాగతిస్తుండటం చూసి తాము షాకవుతున్నట్లు పేర్కొంటున్నారు. ఈ అనూహ్య నిర్ణయంతో లైవ్ స్ట్రీమింగ్ వ్యూయర్ షిప్ పెరగడమే కాకుండా.. బ్రాండ్లకు అనూహ్యమైన పబ్లిసిటీ లభిస్తోందని పలువురు ప్రశంసిస్తున్నారు.

Also Read: LPG Prices: సిలిండర్ ధర పెరిగిందా? తగ్గిందా?.. గ్యాస్ బుక్ చేసే ముందు ఇది తెలుసుకోండి ఫస్ట్!

యాప్స్‌లో కొత్త ట్రెండ్!

ప్రభుత్వ ఆంక్షలు బయట ఎలా ఉన్నా యాప్స్ విషయానికి వచ్చేసరికి అవి మారిపోతున్నాయి. ప్రభుత్వం విధించిన ఆంక్షలు వ్యాపారాలకు అడ్డంకిగా మారినప్పుడు వ్యవస్థలోని లోపాలను వాడుకుని మనుగడ సాగించడం ఎలాగో ఈ ట్రెండ్ నిరూపిస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా డిజిటల్ మార్కెటింగ్ రంగం ఏ విధంగా రూపాంతరం చెందుతుందో ఇది తెలియజేస్తోంది. అలాగే టిక్ టాక్ వంటి యాప్స్ ను ఉపయోగించి.. వ్యాపారాలను ఏ విధంగా విస్తరించుకోవచ్చో చెప్పేందుకు ఇదొక ఉదాహరణగా నిలుస్తోంది. చైనాలో మెుదలైన ఈ ట్రెండ్.. వినూత్నమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని నిపుణులు అంటున్నారు. చైనాలోని ఈ ‘మేల్ లింగరీ మోడలింగ్’ ట్రెండ్ రానున్న రోజుల్లో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టొచ్చని అభిప్రాయపడుతున్నారు.

Also Read: LG 2026 ధమాకా.. సరికొత్త వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్‌లు వచ్చేశాయ్.. ఫీచర్లు చూస్తే గూస్ బంప్సే!

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×