E-Paper
Advertisement

Best Refrigerators 2026: 50% కరెంట్ ఆదా చేసే 5-స్టార్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లు.. జీరో డౌన్ పేమెంట్‌‌తో పట్టుకెళ్లొచ్చు!

Best Refrigerators 2026: 50% కరెంట్ ఆదా చేసే 5-స్టార్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లు.. జీరో డౌన్ పేమెంట్‌‌తో పట్టుకెళ్లొచ్చు!
Advertisement

Best Refrigerators 2026: కొన్ని ఇ-కామర్స్ సైట్లు ఇస్తున్న ఆఫర్ల పుణ్యమా అని మధ్యతరగతి ఇళ్లలో కూడా డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు కామన్ అయిపోయాయి. అయితే, ఫ్రిడ్జ్ కొనడం ఒక ఎత్తైతే.. దాని వల్ల వచ్చే కరెంట్ బిల్లును భరించడం మరో ఎత్తు. అందుకే చాలామంది వినియోగదారులు ఎప్పుడూ 5-స్టార్ రేటింగ్ ఉన్న మోడల్స్‌ను ఎంపిక చేసుకుంటారు. ఇవి సాధారణ ఫ్రిడ్జ్‌లతో పోలిస్తే దాదాపు 50 శాతం వరకు కరెంటును ఆదా చేస్తాయి. ఈ నేపథ్యంలో మీరూ కొత్తగా ఫ్రిడ్జ్ కొనాలనుకుంటే.. లేటెస్ట్ ఫీచర్లు, ధరల వివరాలు తెలుసుకోండి.

5-స్టార్ ఫ్రిడ్జ్ ఎందుకు కొనాలి?

చాలామంది ఫ్రిడ్జ్ ధర తక్కువగా ఉంది కదా అని తక్కువ స్టార్ రేటింగ్ ఉన్నవి కొంటారు. కానీ దీర్ఘకాలంలో అవి కరెంట్ బిల్లుల రూపంలో మీ జేబుకు చిల్లు పెడతాయి. 5-స్టార్ రేటింగ్ ఉన్న డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లు విద్యుత్ ఆదా చేయడమే కాకుండా.. పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీ వల్ల ఫ్రిడ్జ్ సౌండ్ తక్కువగా రావడమే కాకుండా, ఎక్కువ కాలం మన్నుతుంది కూడా.

స్మార్ట్ ఫీచర్లు అనేకం..

Advertisement

నేటి తరం 5-స్టార్ ఫ్రిడ్జ్‌లు కేవలం కూలింగ్ మాత్రమే కాదు,.. అనేక స్మార్ట్ ఫీచర్లతో వస్తున్నాయి. దీనిలో కన్వర్టబుల్ ఫీచర్ చాలా కీలకం. అంటే.. మీకు ఫ్రిడ్జ్ అవసరం ఎక్కువగా ఉండి, ఫ్రీజర్ తక్కువగా వాడుతుంటే.. ఒక బటన్ నొక్కి ఫ్రీజర్‌ను కూడా ఫ్రిడ్జ్‌గా మార్చుకోవచ్చు. దీనివల్ల నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే ఫ్రాస్ట్ ఫ్రీ టెక్నాలజీ వల్ల లోపల అనవసరంగా మంచు పేరుకుపోయే సమస్య ఉండదు.

Also Read: నోటిఫికేషన్స్ గోల లేదు, ఛార్జింగ్ కష్టాలు ఉండవ్.. మీ ఆరోగ్యం ఇక ఈ స్మార్ట్ రింగ్ చేతుల్లో!

ధరల వివరాలు..

Advertisement

మార్కెట్లో ప్రస్తుతం శాంసంగ్, ఎల్జీ, పానాసోనిక్ వంటి ప్రముఖ బ్రాండ్ల 5-స్టార్ ఫ్రిడ్జ్‌లు అందుబాటులో ఉన్నాయి. సాధారణ 275 లీటర్ల శాంసంగ్ మోడల్ రూ.36,750 నుంచి ప్రారంభమవుతుంటే.. బిగ్ ఫ్యామిలీస్ కోసం పానాసోనిక్ సైడ్-బై-సైడ్ మోడల్స్ రూ.లక్ష వరకు ఉన్నాయి. అందుకే.. మీ బడ్జెట్, కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి సరైన మోడల్ ఎంచుకోవడం ముఖ్యం.

కొనే ముందు గమనించాల్సినవి..

మీరు ఫ్రిడ్జ్ కొనేటప్పుడు కేవలం స్టార్ రేటింగ్ మాత్రమే కాకుండా.. లోపల ఉండే షెల్ఫ్స్ నాణ్యతను కూడా చూడాలి. టఫ్ అండ్ గ్లాస్ షెల్ఫ్స్ ఉన్నవైతే బరువైన గిన్నెలు పెట్టినప్పుడు పగిలిపోయే ప్రమాదం ఉండదు. అలాగే కూరగాయలు, పండ్లు తాజాగా ఉండటానికి ప్రత్యేకమైన కంపార్ట్‌మెంట్‌లు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. వై-ఫై కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉంటే ఫోన్ ద్వారానే ఫ్రిడ్జ్ సెట్టింగ్స్ మార్చుకునే సౌలభ్యం ఉంటుంది.

ఈజీ EMI ఆప్షన్లు..

నచ్చిన ఫ్రిడ్జ్ ధర బడ్జెట్ దాటుతుందని కంగారు పడక్కర్లేదు. బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నో-కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో మనకు నచ్చిన మోడల్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండానే సులభమైన నెలవారీ వాయిదాలలో డబ్బులు చెల్లించే అవకాశం ఉండటం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు ఇది గొప్ప ఊరట అనే చెప్పాలి.

Also Read: ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే.. కరెంటు పోయినా ఏసీ చల్లదనాన్ని ఆస్వాదించవచ్చు!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే.

 

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×