E-Paper
Advertisement

AC Cooling Tips: ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే.. కరెంటు పోయినా ఏసీ చల్లదనాన్ని ఆస్వాదించవచ్చు!

AC Cooling Tips: ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే.. కరెంటు పోయినా ఏసీ చల్లదనాన్ని ఆస్వాదించవచ్చు!
Advertisement

AC Cooling Tips: ఎండాకాలం వచ్చిందంటే చాలు.. బయట అడుగు పెట్టాలంటే ఎక్కడ లేని భయం పుట్టుకొస్తుంది. పోనీ ఇంట్లో ఉందామంటే.. ఉక్కపోతను భరించడం ఇంకా కష్టంగా ఉంటుంది. ఈ క్రమంలో శరీరాన్ని చల్లబరచడానికి ఇంట్లో ఫ్యాను ఉంటే సరిపోదు.. ఎక్కువ చల్లదనం ఇచ్చే ఏసీ కూడా ఉండాల్సిందే. కానీ మన దురదృష్టం కొద్దీ కరెంట్ ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. ఏసీ ఆగిపోగానే ఐదు నిమిషాల్లో గది మళ్లీ సెగలు గక్కడం మొదలవుతుంది. అయితే కొన్ని తెలివైన చిట్కాలు పాటిస్తే.. కరెంట్ లేకపోయినా గదిలోని ఆ చల్లదనాన్ని గంటల పాటు ఆపొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

కరెంటు పోగానే తలుపులు తీస్తున్నారా?

మనం చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే.. కరెంట్ పోగానే గాలి వస్తుందని తలుపులు తీసేస్తుంటాం. దీనివల్ల గదిలో ఉన్న చల్లని గాలి బయటకు పోయి, బయటి వేడిగాలి లోపలికి వచ్చేస్తుంది. అందుకే కరెంట్ పోయినప్పుడు కిటికీలు, తలుపులు అస్సలు తీయకూడదు. ముఖ్యంగా తలుపు కింద ఉండే చిన్న గ్యాప్ ద్వారా చల్లని గాలి త్వరగా బయటకు పోతుంది. ఆ గ్యాప్ దగ్గర ఓ మందపాటి దుప్పటిని లేదా తడి టవల్‌ను అడ్డంగా ఉంచితే చల్లదనం గదిలోనే ఉంటుంది.

కిటికీలకు కర్టెన్లు ఉండాల్సిందే:

Advertisement

పగటిపూట కిటికీల ద్వారా వచ్చే సూర్యకాంతి గది ఉష్ణోగ్రతను చాలా వేగంగా పెంచుతుంది. దీన్ని అడ్డుకోవడానికి మందపాటి కర్టెన్లు లేదా బ్లైండ్స్ వాడటం చాలా ముఖ్యం. ముదురు రంగులో ఉండే కర్టెన్లు సూర్యరశ్మిని లోపలికి రాకుండా చూస్తాయి. ఒకవేళ కర్టెన్లు లేకపోతే, కనీసం కిటికీలకు పేపర్లనో లేదా పాత బెడ్ షీట్లనో అడ్డంగా కట్టాలి. ఇలా చేయడం వల్ల గది లోపల ఉన్న చల్లదనానికి ఎలాంటి ఎఫెక్ట్ కలగకుండా ఉండి, ఎక్కువ సేపు కూలింగ్ నిలుస్తుంది.

Also Read: వావ్, అతి తక్కువ ధరకే జ్యూసర్లు.. వీటిని మీతోపాటే ఎక్కడికైనా తీసుకెళ్లిపోవచ్చు!

ఆ పని అస్సలు చేయొద్దు:

Advertisement

మనకు తెలియకుండానే ఇంట్లోని కొన్ని వస్తువులు వేడిని పుట్టిస్తాయి. టీవీలు, కంప్యూటర్లు, పాతకాలం నాటి బల్బులు గదిని వేడెక్కిస్తాయి. కరెంట్ పోగానే వీలైనంత వరకు ఈ ఎలక్ట్రానిక్ పరికరాల ప్లగ్‌లను తీసేయండి. అలాగే గదిలో ఎక్కువ మంది ఉండటం వల్ల కూడా శరీరాల నుంచి వచ్చే వేడికి టెంపరేచర్ పెరిగిపోతుంది. కాబట్టి.. గదిలో కిక్కిరిసి ఉండకుండా, గాలి ఆడేలా కొంచెం దూరంగా కూర్చోవడం మంచిది. ఆ సమయంలో వంట గదిలో స్టౌ వెలిగించడం లాంటి పనులు అస్సలు చేయొద్దు.

ప్రత్యామ్నాయాలు అనేకం:

మీ ఇంట్లో గనుక ఇన్వర్టర్ ఫ్యాన్ ఉంటే.. ఒక చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి. ఓ బకెట్ నిండా ఐస్ ముక్కలు లేదా ఫ్రిడ్జ్‌లోని చల్లని వాటర్ బాటిళ్లను తీసి ఫ్యాన్ కింద ఉంచండి. ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఆ ఐస్ నుంచి వచ్చే చల్లదనం గదిలో సర్క్యులేట్ అవుతుంది. ఒకవేళ ఐస్ లేకపోతే, ఒక పాత బెడ్ షీట్‌ను తడిపి కిటికీకి అడ్డంగా వేలాడదీయండి. గాలి తగిలినప్పుడు ఆ నీరు ఆవిరవుతూ గదిని కాసేపు చల్లగా ఉంచుతుంది. ఇది మన పెద్దలు పూర్వం నుంచి పాటిస్తున్న పద్ధతే.

ఇలా జాగ్రత్త పడండి:

ఇవన్నీ తాత్కాలికంగా చేసే పనులైతే, లాంగ్ టర్మ్ కోసం మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి పైకప్పుకు వైట్ రిఫ్లెక్టివ్ పెయింట్ వేయించడం వల్ల మేడ మీద ఎండ ప్రభావం తగ్గుతుంది. అలాగే గది గోడలకు ఇన్సులేషన్ మెటీరియల్ వాడితే ఏసీ చల్లదనం చాలాసేపు గదిలోనే నిలిచి ఉంటుంది. చిన్న ఇన్వర్టర్ ఉన్నా సరే కనీసం ఒక ఫ్యాన్ అయినా తిరిగేలా ప్లాన్ చేసుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కరెంట్ పోయినా ఏసీ చల్లదనాన్ని హాయిగా ఆస్వాదించవచ్చు.

Also Read: మారుమూల గ్రామాల కోసం ఇంటర్నెట్ అక్కర్లేని మొబైల్స్.. భారత్‌లో తయారీ మొదలెట్టిన ఖుష్‌టెక్!

 

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×