E-Paper
Advertisement

Best 90 Day Plan: జియో vs ఎయిర్‌టెల్ vs బిఎస్ఎన్ఎల్.. 90 రోజు వాలిడిటీతో బెస్ట్ ప్లాన్ ఏది?

Best 90 Day Plan: జియో vs ఎయిర్‌టెల్ vs బిఎస్ఎన్ఎల్.. 90 రోజు వాలిడిటీతో బెస్ట్ ప్లాన్ ఏది?
Advertisement

Best 90 Day Plan| తరచూ రీఛార్జ్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. 90 రోజుల ప్లాన్ తీసుకుంటే సమయం ఆదాతో పాటు తరుచూ రీఛార్జ్ చేసే ఇబ్బంది ఉండదు. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, బిఎస్‌ఎన్‌ఎల్ కంపెనీలు అందుబాటులో ఉన్న చవకైన లాంగ్-టర్మ్ ప్లాన్లను పోల్చి చూద్దాం. మీ అవసరాలకు తగిన ప్లాన్ ఎంచుకోవచ్చు.

జియోలో చవకైన 90 రోజుల ప్లాన్

జియో రూ.195 రీఛార్జ్ ప్లాన్‌లో 90 వాలిడిటీ ఇస్తోంది. ఇది డేటా వౌచర్ మాత్రమే. మొత్తం 15GB హై-స్పీడ్ డేటా ఇస్తుంది. కాలింగ్ బెనిఫిట్స్ ఏవీ లేవు. ఇప్పటికే యాక్టివ్ బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ ఉండాలి. ఈ వౌచర్ ఎక్స్‌ట్రా డేటా మాత్రమే జోడిస్తుంది. మొబైల్ ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగించే వారికి బాగుంటుంది. ఎక్కువ కాల్స్ చేసేవారికి ఇది సరిపోదు. జియోలో 84 రోజుల అన్‌లిమిటెడ్ 5G ప్లాన్లు Rs 859 నుంచి మొదలవుతాయి. కానీ Rs 195 ప్లాన్ లైట్ డేటా యూజర్లకు చవకైన ఆప్షన్.

బిఎస్‌ఎన్‌ఎల్ 90 రోజుల బడ్జెట్ ప్లాన్

Advertisement

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.449 ప్రీపెయిడ్ ప్లాన్ ఇస్తోంది. వాలిడిటీ 90 రోజులు. దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంది. ఫ్రీ నేషనల్ రోమింగ్ బెనిఫిట్ కూడా ఉంది. రోజుకు 100 SMS ఇస్తుంది. మొత్తం 5GB డేటా ఇస్తుంది. రోజువారీ డేటా లిమిట్ లేదు. 90 రోజుల్లో ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. రోజుకు సుమారు రూ.5 ఖర్చు అవుతుంది. చవకైన లాంగ్-వాలిడిటీ కాలింగ్ ప్లాన్లలో ఇది టాప్‌లో ఉంది. తక్కువ ఖర్చుతో సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్. డిజిటల్ ఎక్స్‌ట్రాల కంటే బేసిక్ కనెక్టివిటీ ఈ ప్లాన్ ఉద్దేశం.

ఎయిర్‌టెల్ లాంగ్-వాలిడిటీ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.548 ప్రీపెయిడ్ ప్లాన్ ఇస్తోంది. వాలిడిటీ 84 రోజులు. లోకల్, STD, రోమింగ్ కాల్స్ అన్‌లిమిటెడ్. మొత్తం 7GB డేటా ఇస్తుంది. 900 SMS ఉన్నాయి. అదనంగా 12 నెలల Adobe Express ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఇస్తుంది. స్పామ్ అలర్ట్ సర్వీస్ కూడా ఉంది. ఈ ఎక్స్‌ట్రాల వల్ల వాల్యూ ఎక్కువగా ఉంటుంది. కానీ రోజువారీ ఖర్చు బిఎస్‌ఎన్‌ఎల్ కంటే కొంచెం ఎక్కువ. డిజిటల్ బెనిఫిట్స్ కావాలనుకునేవారికి, ప్రీమియం నెట్‌వర్క్ ఇష్టపడేవారికి సరిపోతుంది.

Advertisement

Also Read: ప్రకృతి నాశనం.. మనుషుల కంటే ఎక్కువ నీరు తాగేస్తున్న ఏఐ టెక్నాలజీ

ఏ ప్లాన్ బెస్ట్?

మీ అవసరాల ఆధారంగా ఎంచుకోవాలి. డేటా మాత్రమే కావాలంటే జియో Rs 195 ప్లాన్ బెస్ట్.
చవకగా అన్‌లిమిటెడ్ కాలింగ్ కావాలంటే బిఎస్‌ఎన్‌ఎల్ Rs 449 ప్లాన్ టాప్.
డిజిటల్ సబ్‌స్క్రిప్షన్స్, అదనపు బెనిఫిట్స్ కావాలంటే ఎయిర్‌టెల్ Rs 548 ప్లాన్ మంచిది.

బిఎస్‌ఎన్‌ఎల్ రోజువారీ ఖర్చులో చవకైనది. జియో ఎంట్రీ ప్రైస్ తక్కువ. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రా సర్వీసెస్ ఇస్తుంది. లాంగ్-వాలిడిటీ ప్లాన్లు రీఛార్జ్ ఒత్తిడి తగ్గిస్తాయి. ఖర్చులు మేనేజ్ చేయడం సులభం అవుతుంది.

Related News

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ కంటెంట్ ఇకపై కనిపించదు.. మెటాకు కేంద్రం గట్టి ఆదేశాలు జారీ!

ఫోన్ పోయిందా? వాట్సాప్ చాట్‌ సేఫ్‌గా ఉండాలంటే వెంటనే ఈ పని చేయండి!

సముద్రం అడుగున వింత రాళ్లు.. గాలి తగలగానే భగ్గుమంటూ మంటలు, కారణం ఏమిటీ?

వాట్సాప్ లేటెస్ట్ అప్ డేట్..చాటింగ్ స్టైల్ మారబోతోంది బాస్

యాప్స్, ఫొటోస్ డిలీట్ చేసినా స్టోరేజ్ ఫుల్ అని వస్తోందా? అయితే ఈ సీక్రెట్ ట్రిక్ ట్రై చేయండి!

ల్యాప్‌టాప్‌‌పై నీళ్లు పడ్డాయా? ఆన్ చేసే.. ముందు ఈ ఒక్క తప్పు చేయెద్దు!

విదేశాలకు వెళ్తున్నారా? రోమింగ్ బిల్లుల బెంగ వదిలేసి, ఇలా eSIM వాడేయండి!

రూ. 40వేలలోపే లగ్జరీ లుక్..ఆఫర్‌లో బెస్ట్ ఫ్రిజ్‌లు

Big Stories

Advertisement
×