Best AC Customer Service in India: సమ్మర్‌లో ఏసీ కొనడం ఒక ఎత్తయితే.. అది పాడైనప్పుడు కంపెనీ ఇచ్చే ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ మరొక ఎత్తు. ఎండలు మండిపోతున్నప్పుడు ఏసీ ఆగిపోతే, కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసిన ఎన్ని గంటలకు టెక్నీషియన్ వస్తున్నాడు? ఏ కంపెనీ సర్వీస్ నెట్‌వర్క్ బాగుంది? ఏ బ్రాండ్ వాళ్ళు కంప్లైంట్స్‌ను లైట్ తీసుకుంటున్నారు? అనే విషయాలపై సోషల్ మీడియా , కన్స్యూమర్ ఫోరమ్స్ నుంచి సేకరించిన ‘యూజర్ ఎక్స్‌పీరియన్స్’ డేటాతో కూడిన పక్కా రివ్యూను ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది ఏసీ కొనేటప్పుడు కేవలం స్టార్ రేటింగ్, వైఫై, ఇన్వర్టర్ కంప్రెసర్ వంటి ఫీచర్లను మాత్రమే చూస్తారు. కానీ నిప్పులు చెరిగే వేసవిలో ఏసీ సడన్‌గా గ్యాస్ లీక్ అవ్వడమో లేదా పీసీబీ బోర్డు ప్రాబ్లం రావడమో జరిగితే.. మనకు తక్షణమే సర్వీసింగ్ కావాలి. ఇలాంటి సమయంలో కంపెనీ రెస్పాన్స్ సరిగ్గా లేకపోతే ఇంట్లో.. నిమిషం కూడా గడపలేం.
1.వోల్టాస్ (Voltas): విస్తృతమైన నెట్‌వర్క్..
టాటా సంస్థకు చెందిన వోల్టాస్ ఏసీలకు ఇండియాలో చిన్న చిన్న టౌన్లలో కూడా బలమైన సర్వీస్ నెట్‌వర్క్ ఉంది. కస్టమర్ కేర్ రెస్పాన్స్ సాధారణంగా బాగుంటుంది. కంప్లైంట్ బుక్ చేసిన 24 నుంచి 48 గంటల లోపు టెక్నీషియన్ విజిట్ చేయడం జరుగుతుంది. అయితే.. పీక్ సమ్మర్ సీజన్‌లో (మే, జూన్ నెలల్లో) కంప్లైంట్స్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల కొన్ని ఏరియాల్లో టెక్నీషియన్ రావడానికి 3 నుంచి 4 రోజులు పడుతుందనే ఫిర్యాదులు కస్టమర్ల నుండి వస్తున్నాయి. అలాగే లోకల్ థర్డ్-పార్టీ టెక్నీషియన్లపై ఆధారపడటం వల్ల సర్వీస్ క్వాలిటీలో సమస్యలు ఉన్నాయి.
2.ఎల్జీ , డైకిన్ (LG & Daikin): ఫాస్ట్ సర్వీస్.. హ్యాపీ కస్టమర్స్
సర్వీసింగ్ క్వాలిటీలో ఎల్జీ (LG) మార్కెట్లో టాప్ పొజిషన్‌లో ఉంది. వీరి కస్టమర్ కేర్ యాప్ (LG ThinQ), వాట్సాప్ సపోర్ట్ చాలా స్మార్ట్‌గా పనిచేస్తాయి. కంప్లైంట్ ఇచ్చిన 12 నుంచి 24 గంటల లోపలే చాలా ప్రాంతాల్లో టెక్నీషియన్లు ఇంటికి వస్తున్నారు. ఎల్జీ ఓన్ టెక్నీషియన్లు ఎక్కువగా ఉండటం వల్ల రిపేర్ పక్కాగా జరుగుతుంది.
ఇక జపనీస్ బ్రాండ్ డైకిన్ (Daikin) విషయానికి వస్తే.. వీరి ప్రొడక్ట్ క్వాలిటీ లాగే సర్వీస్ కూడా ప్రీమియంగా ఉంటుంది. కంప్లైంట్ రెస్పాన్స్ టైమ్ 24 గంటలుగా ఉంది. స్పేర్ పార్ట్స్ కూడా ఈజీగా దొరుకుతాయి.
3. బ్లూ స్టార్ , లాయిడ్ (Blue Star & Lloyd): రెస్పాన్స్ ?
కమర్షియల్ కూలింగ్‌లో కింగ్ అయిన బ్లూ స్టార్, హోమ్ ఏసీలలో కూడా మంచి సర్వీస్ అందిస్తోంది. మెట్రో సిటీలలో వీరి రెస్పాన్స్ టైమ్ 24 గంటలు కాగా.. టైర్-2 నగరాల్లో 48 గంటల సమయం పడుతోంది.
హావెల్స్ సంస్థకు చెందిన లాయిడ్ (Lloyd) ఏసీల సర్వీస్ కూడా ఇటీవలి కాలంలో చాలా మెరుగైంది. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లు కంప్లైంట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా అప్‌డేట్ చేస్తుంటారు. అయితే.. మారుమూల గ్రామాల్లో లాయిడ్ స్పేర్ పార్ట్స్ దొరకడం కాస్త ఆలస్యమవుతుందని కస్టమర్లు చెబుతున్నారు.
Also Read: కరెంట్ బిల్లు సేవింగ్స్ ఓకే.. BLDC ఫ్యాన్ పాడైతే ఎంత ఖర్చవుతుంది?
ఏసీ కొనేముందు ఇలా చేయండి!
మీరు ఏ బ్రాండ్ ఏసీ కొనాలనుకున్నా.. గూగుల్ మ్యాప్స్‌లో మీ ఏరియాలోని ఆయా కంపెనీల “Authorized Service Center” రేటింగ్స్ , రివ్యూస్ ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ఒక బ్రాండ్ హైదరాబాద్‌లో అద్భుతమైన సర్వీస్ ఇస్తే.. అదే బ్రాండ్ ఏదైనా చిన్న జిల్లా కేంద్రంలో దారుణమైన సర్వీస్ ఇవ్వొచ్చు. అలాగే ఏసీ ఇన్‌స్టాల్ చేసేటప్పుడే టెక్నీషియన్ పర్సనల్ నంబర్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో చిన్న చిన్న సమస్యలకు కంపెనీ రూట్ ద్వారా కాకుండా డైరెక్ట్‌గా హెల్ప్ పొందే అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ బాగున్న కంపెనీని ఎంచుకుంటేనే మీ వేసవి ప్రశాంతంగా సాగుతుంది.