E-Paper
Advertisement

బాల్క సుమన్ ‘మిలిటెంట్’ రాజకీయం.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కోసమా? సెల్ఫ్ గోలా?

బాల్క సుమన్ ‘మిలిటెంట్’ రాజకీయం.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కోసమా? సెల్ఫ్ గోలా?
Advertisement

Balka Suman: బీఆర్ఎస్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సప్పగ ఉంటే మనవైపు ఎవరూ చూడరు.. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కామెంట్స్ చూశాక.. అధికారం దూరమైన వారి రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయన్న డౌట్లు వస్తున్నాయ్. అధికారం కోసం, జనం తమవైపు చూడడం కోసం, తమను ఆదరించడం కోసం మిలిటెంట్ యాక్టివిటీస్ చేయడమా? ప్రజాస్వామ్యంలో ఇలాంటి పిలుపు ఎవరైనా ఇస్తారా?

బాల్క సుమన్ ఓవర్‌డోస్ కామెంట్స్?

జనం అటెన్షన్ గ్రాబ్ చేయాలంటే చాలా దారులు ఉన్నాయ్. కానీ ఇదేంటి బాల్క సుమన్ ఇలా మాట్లాడేశారని గులాబీ నేతలే చర్చించుకుంటున్నారు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ కావాలనుకోవడంలో తప్పు లేదు. కానీ అదే ఫైర్ లో ఇరుక్కోకపోతే చాలు. కానీ బాల్క సుమన్ లేటెస్ట్ గా TBGKS మీటింగ్ లో మాట్లాడిన మాటలైతే తీవ్ర వివాదాస్పదమయ్యాయ్. అవి ఆయనకే చుట్టుకుంటున్నాయ్.

ఆందోళనల పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలా..?

Advertisement

ఫైర్ బ్రాండ్ అంటే మాటల్లో వాగ్ధాటి కావాలి. జనాన్ని చైతన్యవంతం చేసేలా కార్యాచరణ ఉండాలి. హింసను పెంచి, రెచ్చగొట్టేలా మాట్లాడి.. జన జీవనానికి, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించేలా ఉండొద్దు. కానీ బాల్క సుమన్ మాటలు విన్న వారు మాత్రం తీవ్రస్థాయిలో రియాక్ట్ అవుతున్న పరిస్థితి. సప్ప సప్పగా ఆందోళనలు, రైలు రోకోలు చేస్తే ఫలితం ఉండదన్నారు. మన ఏరియాల గన్ని రైల్వే లైన్లు ఉన్నయ్. కోసిపారేయుర్రి ఒక రోజు. రైలు రోకో అని పెట్టండి, సీరియస్‌గా జెప్తున్నా. నేను అనే పాయింట్ ఏందంటే మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్పా మీ దిక్కు కార్మిక వర్గం తిరిగి చూడదు. రైల్ రోకోల విషయంలో ఇలా రెచ్చగొట్టారు మాజీ ఎమ్మెల్యే.

బాల్క సుమన్ వ్యాఖ్యలపై చర్చ

కార్యకర్తలైనా, ప్రజలైనా పార్టీలను, నేతలను ఓన్ చేసుకోవాలంటే కావాల్సింది నమ్మకం. పని చేద్దాం.. పార్టీని పవర్ లోకి తెచ్చుకుందాం అన్న తపన సొంతంగా రావాలి. నేతల స్పీచ్ ల స్ఫూర్తితో రావాలి. అంతేగానీ ఇలా రెచ్చగొట్టడం ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నట్లు? అంతే కాదు సింగరేణి జీఎం ఆఫీసును తగలబెట్టండన్నారు. ఓ నెల రోజులు, 45 రోజులు జైలుకు వెళ్లొస్తే ఏం కాదని, అదో గోల్డ్ మెడల్ మాదిరి ఫీల్ అవ్వాలన్నారు. రైల్ రోకో చేయడం విధ్వంసాలు సృష్టించడం వంటి కేసుల్లో ఇరుక్కుంటే కార్యకర్తల భవిష్యత్ ఏంటన్నది ఆలోచించరా? జైలుకు వెళ్లడం అంటే సినిమాకు వెళ్లొచ్చినంత ఈజీ కాదు. ఆ కేసులు, విచారణలు, కోర్టు పేషీలు ఇవన్నీ ఉంటయ్. కార్యకర్త కుటుంబమే రోడ్డున పడుతుందన్న ఆలోచన కూడా లేకుండా రెచ్చగొట్టే మాటలు ఎంత వరకు కరెక్ట్ అన్నది ఇప్పుడు వస్తున్న ప్రశ్న.

బీఆర్ఎస్ ఉద్యమాలపై కీలక వ్యాఖ్యలు

Advertisement

బాల్క సుమన్ మాటల్లో మరో అసహనం కనిపించింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లైనా, ఇతర ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలైనా.. జనం రావట్లేదు.. కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలే రోడ్డుపై కనిపిస్తున్నారంటున్నారు. ముఖ్యంగా రైతుల గురించి ప్రస్తావించారు. వడ్ల కోనుగోలు ఇష్యూలో రైతులు రోడ్లపైకి రావడం లేదని, భీమారంలో హైవే దిగ్బంధిస్తే ఐదుగురే రైతులు వచ్చారన్నారు. మిగతా 60-70 మంది మనోళ్లే అని, చెన్నూరులో కిష్టంపేట దగ్గర హైవే మీద కూర్చుంటే నలుగురైదుగురే రైతులు, మిగతా 100 మంది మనోళ్లే ఉన్నారన్నారు. ధైర్యంగా ఎవరూ ముందుకు రావడం లేదని, వాళ్లు బయటకు రావాలంటే మిలిటెంట్ యాక్టివిటీకి రూపకల్పన చేయాలని, దీని వల్ల దూరమైన వర్గాలు దగ్గరవుతాయంటూ ఓ సంబంధం లేని లాజిక్ వినిపించారు.

బాల్క సుమన్‌పై కాంగ్రెస్ మండిపాటు

బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శ కాదని, ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చేస్తున్న ప్రత్యక్ష దాడి అని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనలను పక్కనపెట్టి, హింసను ప్రేరేపించడం ద్వారా బాల్క సుమన్ రాజకీయాల్లో రెడ్ లైన్ దాటేశారని మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని, దీనికి వారి మద్దతు ఉందా లేదా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి.

కాంగ్రెస్ నేతల డిమాండ్

ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి, శాంతిభద్రతల విఘాతానికి పిలుపునిచ్చిన సుమన్‌పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయ్. రాజకీయ ఉన్మాదిగా మాట్లాడుతున్నాడని, వెంటనే రైల్వే శాఖ తరపున కేంద్ర పోలీసులు అతడిపై కేసు నమోదు చేయాలన్నారు. బాల్క మాట్లాడిన వీడియోతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. సింగరేణి కార్మికులు తల్లి లాంటి సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయాలని చెబుతున్నాడని, వెంటనే బీఆర్ఎస్ పార్టీ బాల్క సుమన్ ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.

బాల్క సుమన్‌పై మంత్రి అడ్లూరి ఫైర్

ప్రభుత్వ కార్యాలయాలను తగలబెట్టమనడం, రైలు పట్టాలు కోసేయమనడం బాధ్యతాయుతమైన ప్రతిపక్ష లక్షణం కాదన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. బాల్క సుమన్ బానిస సుమన్ లా మారాడన్నారు. బాల్క సుమన్ ఏం మాట్లాడాడో ప్రజలంతా చూశారన్నారు. అధికారం కోల్పోయిన మూడేళ్లకే ఇంత విషం కక్కడం ఎందుకు అన్నారు. వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే చట్టం తన పని తాను చేసుకెళ్తుందన్నారు.

బాల్క సుమన్ కామెంట్లపై డీజీపీకి ఫిర్యాదు

కాల్చేయడం, పేల్చేయడం ఇది ఎవరి డైరెక్షన్ అని క్వశ్చన్ చేశారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కాంగ్రెస్ నేతలంతా బాల్క సుమన్ కామెంట్లపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఉద్యమంలో మీపైనే కాదు.. తమపైనా కేసులున్నాయని గుర్తు చేశారు. ఎంపీ హోదాలో డ్రోన్ ఎగరేశారని చెప్పి లేని అధికారాలను తెరపైకి వచ్చి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసింది వాస్తవం కాదా అని క్వశ్చన్ చేశారు.

ఇలా మాట్లాడటం సరికాదన్న ఎమ్మెల్యే

గతంలో ఎమ్మెల్యే, ఎంపిగా ఎన్నికైన బాల్క సుమన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. తెలంగాణలో బిఆర్ఎస్ రోజురోజుకు ప్రజల విశ్వాసం ఆదరణ కోల్పోతోందని, తెలంగాణ రాష్ట్రంలో బిఅర్ఎస్ పార్టీ అవసరం లేదని జనం అనుకుంటున్నారన్నారు. రోడ్లపై కనీసం కార్యక్రమాలు చేస్తే ప్రజలు రాకపోవడంతో బీఆర్ఎస్ ఫ్రస్ట్రేషన్ లో ఉందన్నారు.

బాల్క సుమన్ కామెంట్స్‌పై SIT దర్యాప్తు

ప్రజాస్వామ్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, శాంతియుత నిరసనలు చేయడం ప్రతిపక్షాల హక్కు. కానీ ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టాలని పిలుపునివ్వడం నేరం కిందకే వస్తుందంటున్నారు న్యాయనిపుణులు. ఈ కామెంట్స్ పై సిట్ వేయాలన్నారు. తెరవెనుక ఎవరున్నారో తేల్చాలంటున్నారు.

ప్రజల మద్దతు లేక నిరాశలోనే బాల్క వ్యాఖ్యలు

ఇవన్నీ నిరాశలో నుంచి వచ్చిన వ్యాఖ్యల్లా కనిపిస్తున్నాయన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. BRS పిలుపునిచ్చినా వడ్ల కొనుగోలు సమస్యలపై రైతులు క్షేత్రస్థాయిలో ఆందోళనల్లోకి రావడం లేదని బాల్క సుమనే స్వయంగా ఒప్పుకున్నారని, ప్రజల మద్దతు లభించడం లేదనే నిరాశ, మైలేజ్ కోసం కేడర్‌ను హింస వైపు పురికొల్పే ప్రయత్నంగా ఇది కనిపిస్తోందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఒక మాజీ ప్రజాప్రతినిధిగా కేడర్‌ను చట్టబద్ధమైన పోరాటాల వైపు నడిపించాల్సింది పోయి.. జైలుకు వెళ్తే గోల్డ్ మెడల్ వచ్చినట్లు అని మాట్లాడడం కార్యకర్తల జీవితాలను ప్రమాదంలో పడేయడమే అవుతుంది. ఇదేనా నాయకత్వ బాధ్యత అన్న ప్రశ్నలు వస్తున్నాయ్.

బాల్క వ్యాఖ్యలపై ప్రశ్నలు

ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రతిపక్షానికి కచ్చితంగా ఉంటుంది. కానీ, వ్యవస్థలను ధ్వంసం చేయాలనే మిలిటెంట్ ధోరణిని ప్రజలు అంగీకరించరు. ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్సయ్యారు? నిజంగానే కార్యకర్తలు ఈ మాటలు విని అన్నది చేస్తే ఎంత నష్టం.. ఎవరికి నష్టం అన్న ప్రశ్నలు వస్తున్నాయ్.

విధ్వంసం, హింసే బీఆర్‌ఎస్ విధానమా..?

ఈ ఎపిసోడ్ పై అటు కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. సింగరేణి కార్మికులను రెచ్చగొట్టే కార్యక్రమం ఇదన్నారు. BRS నాయకులు ద్రోహులు.. ఉగ్రవాదులన్నారు. నిప్పులు పెట్టడం, విధ్వంసం సృష్టించడం, హింసను ప్రేరేపించడం… KCR, KTR నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి విధానం ఇదే అని Xలో పోస్ట్ పెట్టారు. అధికారం దక్కకపోతే, ప్రజలు రైతులు బీఆర్ఎస్ నిరసనల్లో పాల్గొనకపోతే రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేయడానికి కూడా వెనుకాడని క్రూరమైన మనస్తత్వం వీరిదంటూ ఫైర్ అయ్యారు. వీరు మనుషులేనా? లేక పాకిస్తాన్ ఉగ్రవాదులా? అని క్వశ్చన్ చేశారు. గతంలో శాంతియుత ఉద్యమాలు సాగుతున్న టైంలో వీరు రెచ్చగొట్టి వందలాది మంది ప్రాణాలను బలిగొన్నారని, ఇప్పుడు తెలంగాణ శాంతియుతంగా పురోగమిస్తున్నప్పుడు కూడా కుట్రలు పన్నుతున్నారన్నారు.

ఒడ్డున పడ్డ చేపలా బీఆర్‌ఎస్ పరిస్థితి

అటు బాల్క కామెంట్స్ పై బీజేపీ నేతలు రియాక్ట్ అయ్యారు. యాంటీ నేషనల్ స్టేట్ మెంట్లపై చర్యలు తీసుకోవాలన్నారు. సింగరేణి ఆఫీస్ జాతీయ సంపద అని, బీఆర్ఎస్ బిల్డింగ్ కాదన్నారు. బాల్క సుమన్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒడ్డున పడ్డ చేపలా బిఅర్ఎస్ పరిస్థితి ఉందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. పైసల కోసం బిఅర్ఎస్ విలవిలలాడుతోందని, పైసలు వసూల్ చెయ్యడానికే సింగరేణి ఆఫీసులు తగలబెట్టండని అంటున్నారన్నారు.

తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన బాల్క

నిజానికి బాల్క సుమ్ మాట్లాడిన మాటల తీవ్రతను గ్రహించిన బీఆర్‌ఎస్ సోషల్ మీడియా టీమ్ యూట్యూబ్ లైవ్ ఫీడ్ నుండి ఆ భాగాన్ని తొలగించింది. అంటే ఈ తరహా వ్యాఖ్యలు పార్టీకి కూడా నష్టం కలిగిస్తాయనుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ పై బాల్క సుమన్ తాజాగా రియాక్ట్ అయ్యారు. తాను మాట్లాడిన మాటలపై ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారన్నారు. మంత్రులు పొన్నం, లక్ష్మణ్ కుమార్ .. ధాన్యం కొనుగోళ్లు వదిలేసి తనపై దృష్టి పెట్టారన్నారు. సింగరేణిపై ఫోకస్ పెట్టాలని సూచించారు. తనపై డీజీపీకి ఫిర్యాదు చేసేంత తీరికలో కాంగ్రెస్ పెద్దలున్నారంటూ కౌంటర్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. రైతుల ధాన్యం కొనడం లేదని, సింగరేణిలో వెల్ఫేర్ యాక్టివిటీ లేదన్నానని చెప్పుకున్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడేలా పెద్ద ఎత్తున పోరాటం చేద్దామని చెప్పానని, ప్రజలు, కార్మికుల ఆగ్రహాన్ని ఆక్రోషాన్ని మాత్రమే ప్రస్తావించానన్నారు. తనకు పోరాటాలు, జైళ్లు కొత్త కాదని చెప్పుకున్నారు.

ఉద్యమాల పేరుతో హింసాత్మక వ్యాఖ్యలా..?

తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నంలో మళ్లీ తెలంగాణ ఉద్యమ రోజుల దాకా వెళ్లి పోయారు బాల్క సుమన్. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర చాలా ఉందని, మొత్తం తనపై 226 కేసులు ఉన్నాయన్నారు. తనపై నాలుగు సార్లు పోలీసులు లాఠీఛార్జ్ చేశారని, హైదరాబాద్ లో తాను లేని పోలీస్ స్టేషన్ లేదన్నారు. సో ఫైనల్ గా చూస్తే గతంలో కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్లను వినిపించారు సుమన్. అయితే ఆ కాంటెక్ట్స్ వేరు. ఇప్పుడు బాల్క చెప్పిన రూట్ వేరు. డైరెక్ట్ అటాకే అని పిలుపునివ్వడం వివాదాస్పదంగా మారింది.

మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి ఆరోపణలు

క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆ ఘర్షణల టైంలో కాంగ్రెస్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై దాడి జరిగిందని, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 18న బాల్క సుమన్ అరెస్ట్ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్నారు. నాడు ములాఖత్ లో సుమన్ ను పరామర్శించిన హరీష్ రావు ఇది కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు చర్య అని మండిపడ్డారు. మార్చి 4న జైలు నుంచి రిలీజ్ అయ్యారు.

జైలు నుంచి వచ్చాక మరింత దూకుడు

జైలు నుండి బయటకు రాగానే బాల్క సుమన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా మంత్రి వివేక్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేవలం రాజకీయ కక్షతోనే తమపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని, ఇలాంటి బెదిరింపులకు బీఆర్‌ఎస్ భయపడబోదన్నారు. రైట్ అది అయిపోయింది. మరి ఇప్పుడు ఏకంగా సింగరేణి ఆస్తుల్ని తగలబెట్టాలనడం, రైల్వే పట్టాలు కోసేయాలనడం దేని కిందికి వస్తుందని కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రైల్వే పట్టాలు డ్యామేజ్ చేస్తే రైళ్లు పట్టాలు తప్పి ప్రాణనష్టం జరగదా అన్న ప్రశ్నలు వస్తున్నాయ్.

వివేక్, రేవంత్‌పై ఘాటు వ్యాఖ్యలు

బాల్క సుమన్ విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తన రాజకీయ ప్రస్థానంలో చాలా వివాదాలలో చిక్కుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడిగా ఉద్యమ కాలంలో ఎంత దూకుడుగా వ్యవహరించారో, ఆ తర్వాత ప్రత్యర్థి నేతలపై, అధికారులపై చేసిన పరుష వ్యాఖ్యలతో అంతే పెద్ద ఎత్తున వివాదాలు కొనితెచ్చుకున్నారు. అధికారం పోయాక, ముఖ్యంగా తాను ఎమ్మెల్యేగా ఓడిపోయాక ఫ్రస్ట్రేషన్ పెరిగిందంటారు. అందుకే మాటి మాటికి వివేక్ పై, అటు సీఎం రేవంత్ పై దొరికిన ప్రతి సందర్భంలో తీవ్రస్థాయిలో మాటలు మాట్లాడారు.

స్టేజ్‌పై చెప్పులు చూపిన బాల్క

కేసీఆర్ పై రేవంత్ పరుషంగా మాట్లాడారని చెప్పి.. బాల్క సుమన్ విరుచుకపడ్డ సందర్భాలెన్నో ఈ మూడేళ్లలో ఉన్నాయి. నిజానికి పొలిటికల్ లాంగ్వేజ్ విషయంలో కేసీఆర్ గతంలో చాలా గీత దాటి ఏకవచనంతో ప్రత్యర్థి నేతలపై మాట్లాడిన సందర్భాలెన్నో ఉన్నాయి. వాటిని వదిలేసి రేవంత్ ఏదో అన్నారని చెప్పి స్టేజ్ పైనే చెప్పులు చూపిస్తూ మాట్లాడడం, వాటిపై FIRలు నమోదవడం ఇలాంటివన్నీ బాల్క సుమన్ ఏరి కోరి తెచ్చుకున్నవే. ఆ స్పీచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మంచిర్యాల పోలీసులు బాల్క సుమన్‌పై నాడు 294బీ, 504, 506 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నోటీసులు జారీ చేశారు.

అధినేతల దృష్టిలో పడేందుకే బాల్క దూకుడా..?

అధినేతల దృష్టిలో పడాలన్న ఉత్సాహమే బాల్క సుమన్ ఉద్దేశమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అందుకే బాల్క సుమన్ కాస్తా బానిస సుమన్ అయ్యారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పోలీస్ నోటీసులు అందుకున్న తర్వాత కూడా బాల్క సుమన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టి మరీ రేవంత్ రెడ్డిపై మరింత ఘాటుగా విమర్శలు చేశారు. తాను ఒక్క పిలుపు ఇస్తే తన అభిమానులు, విద్యార్థులు వచ్చి చేయాల్సింది చేస్తారన్నారు. కేసీఆర్ లాంటి మహోన్నత నాయకుడి గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదంటూ తీవ్రంగా అవమానించిన సందర్భాలెన్నో ఉన్నాయ్. అదే కేసీఆర్ మిగితా నేతలను ఏకవచనంతో అన్నప్పుడు ఎక్కడికి వెళ్లారన్న కాంగ్రెస్ నేతల ప్రశ్నలకు జవాబు లేదు.

తెలంగాణ ఆస్తులపై దాడి ఎందుకు?

బాల్క సుమన్ తాజాగా చేసిన మిలిటెంట్ కార్యాచరణ కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు పాత విషయాలను గుర్తు చేశారు. ఉద్యమంలో ఏం చేసినా నడిచిపోయిందని, కడుపులో దాచుకున్నామని, ట్యాంక్ బండ్ పై విగ్రహాలు కూలగొట్టిందెవరో తెలుసు అన్నారు అద్దంకి దయాకర్. అది సరే.. ఇప్పుడు తెలంగాణ వచ్చాక కూడా తెలంగాణ ఆస్తులను ధ్వంసం చేస్తామనడం ఎంత వరకు కరెక్ట్ అని అద్దంకి ప్రశ్నిస్తున్నారు.

బాల్క సుమన్ ప్రయాణం

సో ఇన్నేళ్ల బాల్క సుమన్ ప్రస్థానం చూస్తే ఉద్యమ బాట నుంచి అగ్రెసివ్ యాటిట్యూడ్ దాకా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. రాజకీయాల్లో దూకుడు స్వభావం మంచిదే. అయితే అదే దూకుడు మిలిటెంట్ తరహా చర్యలకు పాల్పడాలని చెప్పడం చేటు చేసేదే అని మర్చి పోవద్దు. ఏం మాట్లాడినా చెల్లుతుంది.. ఎవరూ ఏమీ చేయలేరు అన్న ధీమా అన్ని సందర్భాల్లో పనికి రాదు. ముఖ్యంగా పవర్ లేనప్పుడు మరింత జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ అదే జరగలేదు. అందుకే కాంగ్రెస్ లీడర్లు గట్టిగా ఇచ్చి పడేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు.

Also Read: బాల్క సుమన్‌ని మెంటల్ హస్పిటల్లో చేర్పించండి: మెట్టు సాయికుమార్!

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×