E-Paper
Advertisement

AC Placement Tips: ఏసీ కూలింగ్ రావట్లేదా? వాస్తు లేదనుకుంటా.. ఈ విషయాలు పక్కా తెలుసుకోండి!

AC Placement Tips: ఏసీ కూలింగ్ రావట్లేదా? వాస్తు లేదనుకుంటా.. ఈ విషయాలు పక్కా తెలుసుకోండి!
Advertisement

AC Placement Tips: ఏసీకి వాస్తు ఏంటీ అని అనుకుంటున్నారా? ఈ ఆర్టికల్ పూర్తిగా చదవితే మీకే అర్థమవుతుంది. సాధారణంగా ఒక వస్తువు పనితీరు.. దానిని ఉంచే ప్రదేశాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. అలాగే ఏసీని సైతం సరైన చోట పెట్టాల్సి ఉంటుంది. గదిలో గోడ ఉంది కదా అని.. దాని చుట్టుపక్కల ఉన్న వస్తువులను పట్టించుకోకుండా ఏసీని బిగిస్తే.. అది దాని పనితీరును దెబ్బతీసే ప్రమాదముంది. తద్వారా మీరు ఎంత కూలింగ్ పెట్టినప్పటికీ.. ఉక్కపోత తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ ఏసీని పెట్టడానికి సరైన చోటు ఏదో ఈ కథనంలో పరిశీలిద్దాం.

సరైన ఎత్తులో అమర్చడం

ఏసీని గదిలో అమర్చే ముందు నేల నుంచి కనీసం 7-8 అడుగుల ఎత్తు ఉండేలా జాగ్రత్త తప్పనిసరి. సాధారణంగా గాలిలోని వేడి ఎప్పుడూ పైకి వెళ్తుంది. చల్లని గాలి కిందకు దిగుతుంది. ఏసీని పైన అమర్చడం వల్ల గదిలోని వేడి గాలిని అది త్వరగా గ్రహించి.. చల్లదనాన్ని గది అంతటా సమానంగా పంచుతుంది.

ఫర్నీచర్‌కు దూరంగా..

Advertisement

ఏసీ ముందు భాగంలో ఎలాంటి అడ్డంకులు (కబోర్డ్స్ లేదా కర్టెన్లు) లేకుండా చూసుకోవాలి. అడ్డంకులు ఉంటే గాలి తిరిగి ఏసీ సెన్సార్‌కే తగులుతుంది. దీనివల్ల గది చల్లబడిపోయిందని సెన్సార్లు భావించి.. కంప్రెసర్ ను తక్కువ సామర్థ్యంతో పనిచేసేలా చేస్తాయి. ఫలితంగా గదిలోపల చల్లదనం ఉండకపోగా.. అసౌకర్యంగా అనిపించే అవకాశం ఏర్పడుతుంది.

కిటికీలు, తలుపులు

ఏసీని కిటికీలు లేదా తలుపులకు పైన లేదా దగ్గరగా ఎట్టి పరిస్థితుల్లోనూ అమర్చవద్దు. లేదంటే తలుపులు తీసిన ప్రతిసారీ లోపలి చల్లని గాలి బయటకు వెళ్లిపోయి బయటి వేడి గాలిని ఏసీ చల్లబరచాల్సి వస్తుంది. ఇది కంప్రెషర్‌పై భారం పెంచి కరెంటు బిల్లు భారీగా పెరిగేలా చేస్తుంది.

ఎలక్ట్రానిక్ వస్తువులు

Advertisement

టీవీలు, కంప్యూటర్లు లేదా ఇతర వేడిని విడుదల చేసే వస్తువుల పైన ఏసీని పెట్టకూడదు. ఈ వస్తువుల నుండి వచ్చే వేడి వల్ల ఏసీ థర్మోస్టాట్ గది ఇంకా వేడిగానే ఉందని భావించి అవసరానికి మించి పని చేస్తుంది. దీనివల్ల కూడా మీ విద్యుత్ బిల్లు అధికంగా వచ్చే ఛాన్స్ ఉంది.

అవుట్‌డోర్ యూనిట్

స్ప్లిట్ ఏసీకి ఉండే అవుట్‌డోర్ యూనిట్‌ను సాధ్యమైనంత వరకు నేరుగా ఎండ తగలని చోట ఉంచండి. అది ఎంత చల్లగా ఉంటే లోపలి గదిని అంత వేగంగా చల్లబరుస్తుంది. అలాగే కంప్రెషర్ నుండి వచ్చే వేడి గాలి బయటకు వెళ్లడానికి దాని చుట్టూ కనీసం ఒక అడుగు ఖాళీ ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.

Also Read: Ambati Rambabu: నవరత్నాలే కాదు, జగన్ కూడా ఫెయిల్యూర్.. అంబటి అంత మాట అనేశావేంటీ?

ఇండోర్ – అవుట్‌డోర్ మధ్య గ్యాప్..

సాధారణంగా చాలా మంది ఏసీకి చెందిన ఇండోర్, అవుట్ డోర్ యూనిట్ల మధ్య దూరం ఎక్కువగా పెడుతుంటారు. ఇది సరైనది కాదు. రెండిటి మధ్య దూరం ఎంత తక్కువగా ఉంటే చల్లదనం అంత తక్కువగా వృధా అవుతుంది. పైపు పొడవు పెరిగేకొద్దీ కంప్రెషర్ ఎక్కువ శక్తిని వినియోగించుకోవాల్సి వస్తుంది.

Also Read: AC vs Air Cooler: ఏసీ కొంటే బెటరా? లేదా కూలర్ మంచిదా? మధ్యతరగతి ఇంటికి ఏది బెస్ట్?

Related News

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

Big Stories

Advertisement
×