E-Paper
Advertisement

Rituals: ఈ నియమాలు పాటించకుండా ఎన్ని పూజలు చేసినా వృథాయేనట

Rituals: ఈ నియమాలు పాటించకుండా ఎన్ని పూజలు చేసినా వృథాయేనట
Advertisement

Rituals: కొన్ని నియమాలు పాటించకుండా మీరు ఎన్ని పూజలు చేసినా..ఫలితం మాత్రం రాదంటున్నారు పండితులు. అయితే పూజ చేసేటప్పుడు కచ్చితంగా ఆ నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. పండితులు సూచిస్తున్న ఆ నియమాలేంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం..

హిందూ పురాణాల ప్రకారం పూజలు చేసే ప్రతి ఒక్కరు కొన్ని నియమాలు పాటించాలట. అలా నియమాలు పాటించకుండా ఎన్ని పూజలు చేసినా వ్యర్థమేనట. ప్రతి పూజకు ఒక విధానం ఉంటుంది. ఆ విధానంలో చేస్తేనే ఆ పూజకు ప్రతిఫలం చేసిన వారికి లభిస్తుంది. కానీ ఇంట్లో చేసే పూజలకు మాత్రం కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలట. అవి పాటించకుండా ఎన్ని రోజులు పూజలు చేసినా వృథాయేనట. మరి ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా..!

Advertisement

ఒక్కటే గణపతి ప్రతిమ ఉండాలి: మీరు ఇంట్లో పూజ చేసే పూజా మందిరంలో గణపతికి చెందిని ఒకే ప్రతిమ కానీ ఫోటో కానీ ఉండాలట అలా కాకుండా ఒకటి కన్నా ఎక్కువ ఉంటే మీరెన్ని పూజలు చేసినా ఆ పూజలకు ప్రతిఫలం లభించదట. ఇంకా చెప్పాలంటే మీ పూజామందిరంలో ఏ దేవుడి ఫోటో అయినా విగ్రహం అయినా ఒక్కటే ఉండాలని పండితులు సూచిస్తున్నారు. అప్పుడే మీ పూజలకు ఫలితం దక్కుతుందట.

నిలబడి పూజ చేయకూడదు: మీరు ఇంట్లో ఎప్పుడు పూజ చేసినా ఎట్టిపరిస్థితుల్లో నిలబడి మాత్రం పూజ చేయకూడదట. దేవుడి ముందు ఆసనం వేసుకుని ప్రశాంతంగా కూర్చుని పూజ చేయాలట. అలా కాకుండా నిలబడి పూజ చేస్తే ఆ పూజాఫలం మీకు అసలు దక్కదట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దేవుడి ముందు నిలబడి పూజ చేయకూడదట. ఒకవేళ నిలబడే పూజ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆరోజుకు పూజను చేయకుండా విరమించుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.

Advertisement

పూజకు ముందు ఇల్లు శుభ్రం చేసుకోవాలి: ఇంట్లోని దేవుడి దగ్గర పూజ చేసుకోవడానికి ముందు.. మీ ఇల్లంతా పసుపు నీళ్లతో కానీ గంగాజలంతో కానీ చల్లుకుని శుద్ది చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఇల్లు మొత్తం శుద్ది చేసుకున్నాకే పూజ చేసుకోవాలట. అలా కాకుండా పూజ ఎంత చేసినా ఫలితం మాత్రం శూన్యమేనట.

స్త్రీలు పూజ చేసే నియమం: ఇంట్లో స్త్రీలు పూజలు చేసేటప్పుడు కచ్చితంగా నుదుటిన కుంకుమ, పాదాలకు పసుపు పూసుకునే పూజలు చేసుకోవాలట. అలా కాకుండా ఏదో పూజ చేస్తున్నాం తంతు ముగించేశాం అన్నట్టు చేస్తే మాత్రం మీరు వందేళ్లు పూజలు చేసినా ఆ పూజాఫలం మీకు దక్కదట. అలాంటి పూజలు చేసినా ఒక్కటే చేయకపోయినా ఒక్కటే అంటున్నారు పండితులు. కాబట్టి స్త్రీలు కాళ్లకు పసుపు, నుదుటిన కుంకుమ తప్పకుండా ధరించాలట.

ఆ రోజుల్లో దేవుడి పటాలు శుబ్రం చేయకూడదు: సంవత్సరంలో కొన్ని రోజులు మీ ఇంట్లో ఉన్న దేవుడి పటాలు అసలు శుబ్రం చేయకూడదట. అలా చేస్తే కూడా మీరు చేసే పూజలకు ఫలితం దక్కదట. అయితే ఎప్పుడైనా సరే మంగళవారం, శుక్రవారం, అమావాస్య రోజు అసలు దేవుడి మందిరం కానీ పటాలు కానీ శుభ్రం చేయకూడదని సూచిస్తున్నారు పండితులు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: భర్త ముందు భార్య చేయకూడని 10 పనులు ఇవేనట

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×