E-Paper
Advertisement

vehicle number plates: వాహనాల నెంబర్ ప్లేట్లకు ఉన్న రంగుల అర్థం తెలుసా..?

vehicle number plates: వాహనాల నెంబర్ ప్లేట్లకు ఉన్న రంగుల అర్థం తెలుసా..?
Advertisement

Vehicle number plates: వాహనాలకు ఉన్న నెంబర్‌ ప్లేట్‌ లను ఎప్పుడైనా గమనించారా..? ఆ నెంబర్‌ ప్లేట్ల మీద ఉండే రంగులను గుర్తు పట్టారా..? అన్ని వాహనాలకు ఒకే రకమైన కలర్స్‌ ఉండదు.. అయితే ఇలా రంగురంగుల నెంబర్‌ ప్లేట్లు ఉంటే వాటికున్న హోదా కూడా మారిపోతుందట. ఏ కలర్‌ నెంబర్‌ ప్లేట్‌ ఉంటే ఎలాంటి వాహనమో ఇప్పుడు తెలుసుకుందాం.

మనదేశంలో తరిగే టూ వీలర్‌ నుంచి భారీ వెహికిల్స్‌ వరకు ప్రతి ఒక్క వాహనానికి ఒక రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ఉంటుంది. అలా రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ రాయడానికి కూడా ప్లేట్స్‌ వాడుతుంటారు. ఆ వాడుతున్న ఆ నెంబర్‌ ప్లేట్లలో కూడా కలర్స్‌ ఉంటాయి. ఒక్కో కలరుకు ఒక్కో సింబాలిజమ్‌ ఉంటుంది. అయితే మనదేశంలో వాడే అన్ని రకాల నెంబర్ ప్లేట్లకు ఉన్న ప్రత్యేక ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

నలుపు రంగు నెంబర్‌ ప్లేట్‌: మనదేశంలో నలుపు రంగు నెంబర్‌ ప్లేట్‌ ఉందంటే ఆ వాహనం స్టార్‌ హోటల్స్‌కు సంబంధించినదైన ఉండాలి లేదంటే ఎవరైనా వీఐపీల కోసం ఉపయోగించే వాహనమైనా ఉండాలని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నలుపు అనేది స్టార్ హోటల్స్‌ లేదా వీఐపీల కోసం కేటాయిస్తారు.

నీలం రంగు నెంబర్‌ ప్లేట్‌: మనదేశంలో ఏదైనా వాహనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దాని నెంబర్‌ ప్లేట్‌ నీలం రంగులో ఉంటే అది ఐక్యరాజ్యసమితికి చెందినదని గుర్తుపెట్టుకోవాలట. ఆ వాహనంలో ఐక్యరాజ్యసమితికి చెందిన వారు ఎవరో వెళ్తున్నారు అనుకోవాలట.

Advertisement

పసుపు రంగు నెంబర్‌ ప్లేట్‌: మనదేశంలో ఎక్కువగా కనిపించే నెంబర్‌ ప్లేట్‌ పసుపు రంగు నెంబర్‌ ప్లేట్‌. ఇది ఎక్కువగా టాక్సీలు, ట్రక్కులు, లేదా భారీ వాహనాలకు ఉపయోగిస్తారు. ముఖ్యం పాసింజర్‌ వెహికిల్స్‌ అంటే కమర్షియల్‌ లేదా సంపాదన కోసం ఉపయోగించే వాహనాలన్నింటికి ఎల్లో కలర్‌ నెంబర్‌ ప్లేట్‌ ఉపయోగిస్తారట.

ఎరుపు రంగు నెంబర్‌ ప్లేట్‌: మన దేశంలో ఎక్కడైనా రెడ్‌ కలర్‌ నెంబర్‌ ప్లేట్‌ తో ఏదైనా వాహనం వెళ్తుందంటే అది రాష్ట్ర గవర్నర్లకు సంబంధించింది లేదా రాష్ట్రపతికి సంబంధించినదై ఉంటుందట. రెడ్‌ కలర్‌ నెంబర్‌ ప్లేట్‌ కారులో రాష్ట్రాల గవర్నర్లు.. లేదా రాష్ట్రపతి మాత్రమే ప్రయాణిస్తారట.

ఆకుపచ్చ రంగు నెంబర్‌ ప్లేట్‌: ఆకుపచ్చ కలర్‌ నెంబర్‌ ప్లేట్‌ మనదేశంలో ఎలక్రిక్‌ వాహనాలకు కేటాయిస్తారు. ఒక వాహనం నెంబర్‌ ప్లేట్‌ గ్రీన్ కలర్‌లో ఉంటే అది కచ్చితంగా ఎలక్రిక్‌ వెహికిల్‌ అని అర్థం చేసుకోవాలి.

తెలుపు రంగు నెంబర్‌ ప్లేట్‌: మనదేశంలో వైట్‌ కలర్‌ నెంబర్‌ ప్లేట్‌ వ్యక్తిగత వాహనాలకు మాత్రమే ఉపయోగిస్తారు. ఈ వాహనాలను కమర్షియల్‌ అవసరాలకు వినియోగించకూడదు. అంటే టాక్సీలుగా లేదా ప్యాసింజర్‌ వాహనాలుగా అసలు వాడకూడదు. వాడినట్టు రుజువైతే జరిమానా విధిస్తుంది ప్రభుత్వం.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు రవాణా శాఖ  నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా మరియు రవాణా శాఖ వారి వెబ్సైట్ నుంచి తీసుకుని అందించిన వివరాలు మాత్రమే. ఇందులో బిగ్ టీవీ సొంతంగా క్రియేట్ చేసిన అంశాలు ఏమీ లేదని గమనించగలరు. మరిన్ని పూర్తి వివరాల కోసం రవాణా శాఖ అధికారులను కానీ.. రవాణా శాఖ వెబ్సైట్ ను కానీ సంప్రదించగలరు.

ALSO READ: మహిళలు మంగళసూత్రం విషయంలో ఆ పొరపాట్లు అసలు చేయకూడదట

 

Related News

సహారా ఎడారి లేకపోతే అమెజాన్ అడవి ఉండేది కాదా? రెండింటి మధ్య అసలు లింకేంటి?

ఒకప్పుడు పాక్ లో.. ఇప్పుడు ఇండియాలో.. ఈ అందమైన గ్రామం గురించి మీకు తెలుసా?

హైడ్రోజన్ రైలుపై రాళ్లు విసిరారా? వైరల్ వీడియోపై రైల్వే క్లారిటీ!

రాత్రిపూట వెలిగే మొక్కలు వచ్చేశాయి.. ‘అవతార్‘ సినిమాలో చూసింది ఇప్పుడు నిజమైంది!

ఈ నదుల్లో నీళ్లే కాదు, బంగారం ప్రవహిస్తుంది.. నిజంగా అద్భుతం!

48 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన భార్య.. పచ్చబొట్టు చూసి గుండెలకు హత్తుకున్న భర్త!

స్మశానంలో ప్రేమాయణం.. ఇదేం పిచ్చిరా అయ్యా!

రైల్వే స్టేషన్ లో చిప్స్ ప్యాకెట్స్ ఎత్తు కెళ్లిన ప్రయాణికులు.. ఏం చిల్లర గాళ్లు ఉన్నారేంట్రా మీరూ?

Big Stories

Advertisement
×