E-Paper
Advertisement

సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!

సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!
Advertisement

Lumio Vision 9: భారతీయ స్మార్ట్ టీవీ మార్కెట్లోకి అధునాతన సాంకేతికతతో కూడిన సరికొత్త టీవీ అడుగుపెట్టింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ లుమియో (Lumio) తన సరికొత్త ‘లుమియో విజన్ 9’  55 అంగుళాల క్యూడి మిని ఎల్‌ఈడీ (QD-Mini LED) టీవీని దేశీయ మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. ప్రీమియం ఫీచర్లు, అద్భుతమైన డిస్‌ప్లే క్వాలిటీతో వచ్చిన ఈ టీవీ ధరను.. సామాన్యులకు సైతం అందుబాటులో ఉంచడం విశేషం. ఈ ‘లుమియో విజన్ 9’ టీవీకి సంబంధించిన ధర, ప్రధాన ఫీచర్లు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

రూ. 44,999లకే ప్రీమియం అనుభూతి!

లూమియో తన ఫ్లాగ్‌షిప్ విజన్ 9 ను ఇవాళ (జూన్ 4) మధ్యాహ్నం 12 గంటల నుంచి దేశీయ మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా క్యూడి-మిని ఎల్‌ఈడీ టెక్నాలజీ కలిగిన టీవీలు మార్కెట్లో చాలా ఎక్కువ ధరకు లభిస్తుంటాయి. కానీ లుమియో సంస్థ ఈ 55 ఇంచుల ప్రీమియం మోడల్‌ను కేవలం రూ.44,999 ప్రారంభ ధరకే అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. బడ్జెట్ ధరలో థియేటర్ లాంటి అనుభూతిని సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు.

అదిరిపోయే డిస్‌ప్లే ఫీచర్లు

Advertisement

ఈ టీవీలో ఉపయోగించిన క్వాంటం డాట్ మిని ఎల్‌ఈడీ స్క్రీన్ వల్ల.. తెరపై రంగులు అత్యంత సహజంగా, స్పష్టంగా కనిపిస్తాయి. సాధారణ ఎల్‌ఈడీ టీవీలతో పోలిస్తే ఇందులో బ్రైట్‌నెస్, డీప్ బ్లాక్ లెవెల్స్ అద్భుతంగా ఉంటాయని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. 4K రిజల్యూషన్‌తో పాటు డాల్బీ విజన్ (Dolby Vision), HDR10+ సపోర్ట్ ఉండటం వల్ల ఓటీటీలో సినిమాలు చూసేటప్పుడు విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌ అనుభూతిని పంచుతాయని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు గేమింగ్ ప్రియుల కోసం ఇందులో హై రిఫ్రెష్ రేట్ ఫీచర్‌ను కూడా అందించారు.

థియేటర్‌ను తలపించే సౌండ్ క్వాలిటీ

సాధారణంగా టీవీల్లో థియేటర్ అనుభూతి రావాలంటే కేవలం విజువల్స్ క్వాలిటీగా ఉంటే సరిపోదు. ఆడియో కూడా థియేటర్ రేంజ్ లో ప్రీమియంగా ఉండాల్సిందే. ఈ నేపథ్యంలోనే లుమియో విజన్ 9 టీవీలో శక్తివంతమైన స్పీకర్లను అమర్చారు. ఇది డాల్బీ అట్మోస్ (Dolby Atmos) సాంకేతికతను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఇల్లు కూడా ఒక చిన్న థియేటర్‌లా మారిపోతుంది. చుట్టూ శబ్దాలు వినిపిస్తున్నట్లుగా ఉండే ఆడియో అనుభూతిని యూజర్లు పొందుతారని కంపెనీ పేర్కొంది.

Advertisement

Also Read: ఇన్వర్టర్ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? ఈ 5 కారణాలే కావచ్చు!

మరిన్ని స్మార్ట్ ఫీచర్లు

ఈ స్మార్ట్ టీవీ లేటెస్ట్ గూగుల్ టీవీ (Google TV) ఓఎస్‌పై రన్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి అన్ని రకాల ప్రముఖ యాప్స్ ఇందులో ఇన్‌బిల్ట్‌గా వస్తాయి. ఇన్ బిల్ట్ క్రోమ్‌కాస్ట్, గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కంట్రోల్ ఫీచర్లు సైతం దీనిలో ఉంటాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్, వై-ఫై, మల్టిపుల్ హెచ్‌డిఎమ్‌ఐ (HDMI), యూఎస్‌బీ (USB) పోర్టులను కూడా అందించారు.

Also Read: కదిలే ఏసీ కావాలా? 2026లో టాప్ ఇవే.. ఎక్కడకెళ్లినా మీ వెంటే!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×