E-Paper
Advertisement

సమ్మర్‌లో ఏసీ వాడుతున్నారా ? ఇవి తెలుసుకోకపోతే ప్రమాదమే..

సమ్మర్‌లో ఏసీ వాడుతున్నారా ? ఇవి తెలుసుకోకపోతే ప్రమాదమే..
Advertisement

AC Temperature in summer: ఎండలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం బయట అడుగుపెడితే సెగలు, ఇంట్లో ఉంటే ఉక్కపోత అన్నట్లు ఉంది పరిస్థితి. ఈ భయంకరమైన వేడి నుంచి కాస్త రిలాక్స్ అవడానికి మనందరికీ గుర్తొచ్చే ఏకైక మార్గం ‘ఏసీ’. అయితే.. చాలామంది రూం త్వరగా చల్లబడాలని ఏసీని 16 లేదా 18 డిగ్రీల వద్ద  సెట్ చేస్తారు. కానీ.. ఇలా రూం ఓవర్‌కూల్ చేయడం వల్ల  ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చల్లటి గాలి కోసం చూస్తూ.. అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవద్దని అంటున్నారు. అసలు సమ్మర్‌లో ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలి? డాక్టర్ల సలహా ఏంటి ? అన్న విషయాలను గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవిలో ఏసీ టెంపరేచర్: ఎంత ఉండాలి? ఎందుకు?

చాలా ప్రాంతాల్లో సమ్మర్ లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల పైనే ఉంటుంది. ఈ సమయంలో మన శరీరం గది ఉష్ణోగ్రతకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే.. ఏసీని తక్కువ టెంపరేచర్‌లో పెడితే ఏసీ ఎక్కువ కూలింగ్ ఇస్తుందని. కానీ అది తప్పు.

Advertisement

డాక్టర్లు సూచిస్తున్న సరైన టెంపరేచర్ ఎంత?
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE), నిపుణుల ప్రకారం.. సమ్మర్లో 24°C నుంచి 26°C మధ్య ఏసీని సెట్ చేయడం మంచిది.

శరీర ధర్మం: మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 37°C (98.6°F) గా ఉంటుంది. ఏసీని 24 డిగ్రీలు ఉంచినప్పుడు, మన శరీరం ఈజీగా ఆ వాతావరణానికి అలవాటు పడుతుంది.

Advertisement

షాక్ ఎఫెక్ట్: మీరు 18 డిగ్రీల ఏసీ గదిలో ఉండి.. ఒక్కసారిగా బయటకు 40 డిగ్రీల ఎండలోకి వెళ్లినప్పుడు శరీరం ‘థర్మల్ షాక్’కు గురవుతుంది. దీని వల్ల బీపీలో మార్పులు రావచ్చు.

ఓవర్‌కూలింగ్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు:
డాక్టర్లు “ఓవర్‌కూలింగ్” గురించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అతి తక్కువ టెంపరేచర్‌తో ఏసీ వాడటం వల్ల కలిగే నష్టాలు ఇవే..

1.కీళ్ల నొప్పులు : ఎక్కువ సేపు అతి చల్లటి గాలిలో ఉండటం వల్ల ఎముకలు, కీళ్లలో నెప్పి మొదలవుతుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఇది నరకం.

2.శ్వాసకోస సమస్యలు: ఏసీ గాలి వల్ల గదిలోని తేమ తగ్గిపోతుంది. దీని వల్ల ముక్కు, గొంతు ఎండిపోయి సైనస్, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు పెరుగుతాయి.

3.డ్రై ఐస్ & స్కిన్: చల్లటి గాలి కళ్ళలోని తేమను లాగేస్తుంది. కళ్ళు ఎర్రబడటం, దురద రావడం జరుగుతుంది. అలాగే చర్మం పగుళ్లు ఇచ్చి పొడిబారిపోతుంది.

4. తలనొప్పి: గాలి సరిగ్గా ఆడకపోవడం, ఎక్కువ చల్లదనం వల్ల తరచుగా తలనొప్పి, అలసట రావచ్చు.

కరెంట్ బిల్లుపై ప్రభావం:
మీకు తెలుసా? ఏసీని ప్రతీ డిగ్రీ పెంచినప్పుడు (ఉదాహరణకు 18 నుంచి 19కి), దాదాపు 6 శాతం కరెంట్ ఆదా అవుతుంది. అంటే మీరు 18 డిగ్రీల బదులు 24 డిగ్రీల వద్ద ఏసీని వాడితే.. మీ నెలవారీ కరెంట్ బిల్లులో సుమారు 25% నుంచి 30% వరకు తగ్గుతుంది.

Also Read: ఏసీ ఆపేసినా.. గంటల తరబడి రూమ్ కూల్‌గా ఉంచే సీక్రెట్స్ ఇవే !

ఏసీ వాడటానికి చిట్కాలు:
ఫ్యాన్ వాడండి: ఏసీని 24 లేదా 25 డిగ్రీలు సెట్ చేసి.. సీలింగ్ ఫ్యాన్‌ను తక్కువ స్పీడ్‌లో ఉంచండి. దీని వల్ల చల్లటి గాలి గది అంతా త్వరగా వ్యాపిస్తుంది.

మెయింటెనెన్స్: ఏసీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. దుమ్ము నిండిన ఫిల్టర్ల వల్ల బ్యాక్టీరియా పెరిగి గాలి కలుషితం అవుతుంది.

నీరు ఎక్కువగా తాగండి: ఏసీ గదిలో ఉన్నప్పుడు దాహం వేయదు. కానీ శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. అందుకే నీరు తాగుతూ ఉండాలి.

బయటకు వెళ్లే ముందు: ఏసీ ఆపివేసిన వెంటనే బయటకు వెళ్లకండి. ఏసీ ఆపాక ఒక 5-10 నిమిషాలు ఆగి, సాధారణ గాలికి అలవాటు పడ్డాక బయటకు వెళ్లడం మంచిది.

Related News

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

Big Stories

Advertisement
×