Peddi Trailer: మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ టాలీవుడ్ చిత్రం ‘పెద్ది’. అనౌన్స్‌మెంట్ రోజు నుంచే భారీ అంచనాలను మూటగట్టుకున్న ఈ సినిమా, తాజాగా ఒక సెన్సేషనల్ అప్‌డేట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రామ్ చరణ్ అభిమానులు కాలర్ ఎగరేసేలా చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే ప్రకటన చేసింది. ‘పెద్ది’ చిత్ర ట్రైలర్ రిలీజ్ డేట్‌తో పాటు, అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న లొకేషన్‌ను కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Read also-టాలీవుడ్ టాప్ హీరోలను ఇలా చూస్తుంటే రెండు కళ్లూ సరిపోవు భయ్యా..
భారతీయ చలనచిత్ర రంగంలో ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ ఒక ల్యాండ్‌మార్క్ ఈవెంట్‌గా మారబోతోంది. మే 18, 2026న దేశ ఆర్థిక రాజధాని ముంబై వేదికగా ఈ చిత్ర ట్రైలర్‌ను అత్యంత గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా, పాన్-ఇండియా మార్కెట్‌ను కొల్లగొట్టడమే లక్ష్యంగా ముంబైలో ఈ భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.
దీని గురించి ట్విట్టర్ (X) వేదికగా చిత్ర బృందం స్పందిస్తూ… “MUMBAAAIIIII, Remember his name #PEDDI, he is coming.. PEDDI Trailer Takeover from May 18th, More details soon” అంటూ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ అప్‌డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. ముంబై వేదికగా జరగబోయే ఈ ఈవెంట్‌కు బాలీవుడ్ ప్రముఖులతో పాటు భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది.
ట్రైలర్ అప్‌డేట్‌తో పాటే సినిమా రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ మరోసారి నొక్కి చెప్పారు. జూన్ 4, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సమ్మర్ ముగింపులో బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. బుచ్చి బాబు సనా మార్క్ ఎమోషన్స్, రామ్ చరణ్ నెరవబోయే పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి.
Read also-Kannada : కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత..
‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో గ్లోబల్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్, ఈ సినిమాలో ఒక వైవిధ్యమైన, రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండడం విశేషం. ముంబైలో మే 18న జరగబోయే ట్రైలర్ లాంచ్‌తో ఈ సినిమా ప్రమోషన్స్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లనున్నాయి. జూన్ 4 కోసం మెగా ఫ్యాన్స్ థియేటర్ల వద్ద కౌంట్‌డౌన్ అప్పుడే మొదలుపెట్టేశారు!
MUMBAAAIIIII, Remember his name #PEDDI, he is coming 💥💥#PEDDI Trailer Takeover from May 18th, More details soon❤️🔥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON JUNE 4th❤️🔥 pic.twitter.com/9EZfM1LnGV
— PEDDI (@PeddiMovieOffl) May 13, 2026