E-Paper
Advertisement

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!
Advertisement

Top rated air fryers India:  ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ కోసం చాలామంది ఇప్పుడు ఆయిల్ ఫుడ్‌కి దూరంగా ఉంటున్నారు. కానీ నూనెలో.. వేయించిన క్రిస్పీ స్నాక్స్ అంటే.. ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? ఈ సమస్యకు చెక్ పెడుతూ మార్కెట్లోకి వచ్చాయి అద్భుతమైన ఎయిర్ ఫ్రైయర్స్. కేవలం కొద్ది నూనెతో లేదా అసలు నూనె లేకుండానే.. నోరూరించే వంటకాలను తయారు చేసుకోవచ్చు. హెల్త్ కాన్షియస్ కుటుంబాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన టాప్ 5 బెస్ట్-రేటెడ్ ఎయిర్ ఫ్రైయర్స్ విశేషాలు ఇప్పుడు చూద్దాం!

హెల్దీ కుకింగ్ కోసం టాప్ 5 ఎయిర్ ఫ్రైయర్స్:

నేడు ప్రతి ఇంట్లోనూ కిచెన్ గ్యాడ్జెట్ల ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా.. బరువు తగ్గాలనుకునే వారు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారు డీప్ ఫ్రై చేసిన పదార్థాలకు స్వస్తి పలికి ఎయిర్ ఫ్రైయర్స్ వైపు అడుగులు వేస్తున్నారు. ఎయిర్ ఫ్రైయర్ సహాయంతో ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ గ్రిల్స్, సమోసాలు వంటి వాటిని 80 శాతం వరకు తక్కువ నూనెతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు.

1. Philips Digital Airfryer:

Advertisement

ఎయిర్ ఫ్రైయర్ మార్కెట్లో ఫిలిప్స్ బ్రాండ్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. రాపిడ్ ఎయిర్ టెక్నాలజీతో పని చేసే ఈ ఎయిర్ ఫ్రైయర్ ఫుడ్ ను అన్ని వైపులా సమానంగా ఉడికిస్తుంది. డిజిటల్ టచ్ స్క్రీన్, ప్రీ-సెట్ మెనూ ఆప్షన్లతో దీన్ని ఆపరేట్ చేయడం చాలా ఈజీ. చిన్న , మధ్యతరగతి కుటుంబాలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

2. Inalsa Air Fryer:

బడ్జెట్ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే.. వారికి ఇన్సాన్ ఎయిర్ ఫ్రైయర్ ఒక అద్భుతమైన ఆప్షన్. ఇది వేగంగా.. వేడెక్కడంతో పాటు సమయాన్ని ఆదా చేస్తుంది. దీనిలోని నాన్‌స్టిక్ బాస్కెట్ ఈజీగా శుభ్రం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. టెంపరేచర్ కంట్రోల్ , టైమర్ ఫీచర్లు దీనిలో స్పెషల్ అట్రాక్షన్.

3. Nutricook / AmazonBasics Air Fryer:

Advertisement

స్టైలిష్ లుక్ , మోడర్న్ ఫీచర్లతో వస్తున్న ఈ ఎయిర్ ఫ్రైయర్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పెద్ద ఫ్యామిలీల కోసం ఎక్కువ కెపాసిటీలో లభించే ఈ మోడల్స్, బేకింగ్, రోస్టింగ్, రీహీటింగ్ వంటి అనేక పనులను ఒకే టచ్‌తో పూర్తి చేస్తాయి. హెల్దీ స్నాక్స్ లవర్స్ కు ఇదొక సూపర్ గ్యాడ్జెట్.

4.Glen Air Fryer:

ఇండియన్ వంటకాలను దృష్టిలో.. ఉంచుకుని తయారైన గ్లాన్ ఎయిర్ ఫ్రైయర్స్ క్వాలిటీకి మారుపేరు. స్మోక్ లెస్ టెక్నాలజీతో.. పని చేయడం వల్ల వంట సమయంలో ఇంట్లో పొగ రాకుండా ఉంటుంది. తక్కువ క్యాలరీలతో రుచికరమైన ఫుడ్ తినాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Also Read: బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

5. Instant Vortex Air Fryer:

మల్టీ-ఫంక్షనల్ కుకింగ్ కోసం చూస్తున్నవారికి.. ఇది బెస్ట్ ఆప్షన్. ఎయిర్ ఫ్రైయింగ్‌తో పాటు బేక్, రోస్ట్, రీహీట్ వంటి నాలుగు విభిన్న పద్ధతులలో వంటలను చేసుకోవచ్చు. ఇది తక్కువ కరెంట్ ఖర్చుతో బెస్ట్ వంటకాలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది.

నూనె లేని ఆహారమే ఆరోగ్యానికి శ్రీరామరక్ష. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే.. మీకు నచ్చిన రుచికరమైన స్నాక్స్‌ను ఆస్వాదించడానికి ఒక మంచి ఎయిర్ ఫ్రైయర్‌ను మీ ఇంటికి తీసుకురండి. ఇది మీ కిచెన్ పనిని ఈజీ చేయడమే కాకుండా.. మిమ్మల్ని ఫిట్‌గా ఉంచడంలో సహాయ పడుతుంది.

Related News

ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు బ్యాటరీ సేవ్ చేయడానికి పాటించాల్సిన 5 రూల్స్!

iPhone Duo స్టాక్‌పై యాపిల్ కీలక నిర్ణయం? కొనుగోలుదారులకు నిరాశ తప్పదు!

రే-బాన్ మెటా గ్లాసెస్‌లో ఊహించని అప్డేట్.. ఇప్పుడిక దారి వెతకడం, మ్యూజిక్ వినడం సూపర్ ఈజీ!

బోస్ సౌండ్ స్పీకర్లు, 165Hz డిస్‌ప్లేతో రెడ్‌మీ నుంచి మరో పవర్‌ఫుల్ ఫోన్!

వావ్.. స్మార్ట్‌వాచ్‌లో ఇలాంటి ఫీచర్లు కూడా ఉంటాయా? 51 రోజుల బ్యాకప్‌తో Amazfit T-Rex Dual Solar!

రూ.2.99 లక్షల iPhone Duo.. బ్యాటరీ విషయంలో యాపిల్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇదే!

12 జీబీ ర్యామ్, సరికొత్త ఆండ్రాయిడ్‌తో పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్!

యాపిల్ లవర్స్‌కు పండగలాంటి వార్త.. వచ్చే వారమే మార్కెట్లోకి 4 సరికొత్త గ్యాడ్జెట్స్!

Big Stories

Advertisement
×