E-Paper
Advertisement

డిప్యూటీ సీఎం ఇస్తేనే కేబినెట్‌లోకి వెళ్తా.. ఏఐసీసీకి మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్‌!

డిప్యూటీ సీఎం ఇస్తేనే కేబినెట్‌లోకి వెళ్తా.. ఏఐసీసీకి మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్‌!
Advertisement

Cabinet Expansion: ప్రస్తుత పీసీసీ చీఫ్​ కేబినెట్ లోకి వెళ్లడం ఖాయమనే చర్చ పార్టీలో ఉన్నది. అయితే తనకు బెర్త్ తో పాటు డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే కేబినెట్ లోకి వెళ్తానని, లేదంటే పీసీసీ చీఫ్​ గానే కొనసాగుతానని మహేష్​ కుమార్ గౌడ్ హైకమాండ్ ముందు ప్రపోజల్ పెట్టినట్లు తెలిసింది. హైకమాండ్ పూర్తి స్థాయిలో అధ్యయనం తర్వాత నిర్ణయం తీసుకోనున్నది. కేబినెట్ బెర్త్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకమాండ్.. డిప్యూటీ సీఎం పదవి క్లియరెన్స్ కు అధ్యయనం చేస్తున్నది. పార్టీ, ప్రభుత్వంలోని ముఖ్యలతో ఏఐసీసీ పెద్దలు డిస్కషన్ చేస్తున్నారు. రాజకీయ, కుల సమీకరణాలు ఆధారంగా ఈ పదవిని నిర్ణయించనున్నట్లు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి దాదాపు మూడేళ్లు సమీపిస్తున్నా.. నామినేటెడ్ పదవులు, మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవుల పంపకంపై ఉత్కంఠ వీడటం లేదు. ఈ నేపథ్యంలో ఈ దఫా అన్ని పదవులు పూర్తి చేయాలని హైకమాండ్ భావిస్తున్నది. మరోవైపు పీసీసీ చీఫ్​ కేబినెట్ లోకి వెళ్తే, తనకు పీసీసీ చీఫ్​‌గా అవకాశం ఇవ్వాలని ఎంపీ బలరామ్ నాయక్ హైకమాండ్ ముందు ప్రపోజల్ పెట్టారు. కేబినెట్ లో లంబాడా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదని, అందుకే పీసీసీ చీఫ్​‌గా అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ది సస్పెన్స్ గా మారింది.

మంత్రి పదవుల కోసం ‘భారీ’పోటీ…?

కేబినెట్ విస్తరణ, ప్రక్షాళన జరుగుతుందనే ప్రచారంతో ఆశావహుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది.ప్రస్తుతం ఖాళీగా ఉన్న బెర్త్‌లను దక్కించుకోవడానికి పలువురు సీనియర్, జూనియర్ నాయకులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తమ సామాజిక వర్గ సమీకరణాలు, సీనియారిటీ ఆధారంగా బెర్త్ దక్కించుకునేందుకు విజయశాంతి, బాలు నాయక్ లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.సీనియర్ నేతగా తనకున్న ఇమేజ్, మునుగోడులో సాధించిన విజయాన్ని అధిష్టానానికి వివరిస్తూ మంత్రివర్గంలో చోటు కోసం రాజగోపాల్ రెడ్డి గట్టిగా ట్రై చేస్తున్నారు.ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సీనియారిటీ ఆధారంగా తన పేరును పరిశీలించాలని సుదర్శన్ రెడ్డి కోరుతున్నారు.బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల కోటాలో మంత్రివర్గంలో స్థానం సంపాదించేందుకు బీర్ల ఐలయ్య, గడ్డం ప్రసాద్ కుమార్ లు పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సైతం ఈసారి మంత్రి పదవి రేసులో గట్టి పోటీ ఇస్తున్నారు.

Advertisement

Also read: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

స్పీకర్,డిప్యూటీ స్పీకర్ ఎంపికపై ‘తర్జనబర్జన’..

కేవలం మంత్రివర్గ విస్తరణే కాకుండా, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ స్థానాల భర్తీలోనూ అధిష్టానానికి స్పష్టత రావడం లేదు. ప్రసాద్ కుమార్ కు కేబినెట్ లోకి తీసుకుంటే, ఆయన స్థానంలో కొత్త స్పీకర్‌గా ఎవరిని నియమించాలనే అంశంపై హైకమాండ్ కూడా క్లారిటీ రావడం లేదు. క్యాస్ట్, డిస్ట్రిక్ట్ , పొలిటికల్ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ కానుందునే ఇన్ని రోజలు పాటు ఈ పదవుల భర్తీ డీలే అయిందనే చర్చ ఉన్నది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవిని ఎవరికి కేటాయించాలనే దానిపై ప్రాంతీయ, సామాజిక సమతుల్యత కలసిరావడం లేదు.మంత్రివర్గ విస్తరణ, పార్టీ ప్రక్షాళన ప్రక్రియ ఆలస్యం కావడానికి అసలు కారణం ఈ అంతర్గత పోటీయేనని కాంగ్రెస్ వర్గాలు అంగీకరిస్తున్నాయి. ఒకరికి ఇస్తే మరొకరు అసంతృప్తి చెందే అవకాశం ఉండటంతో, అధిష్టానం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అందరినీ సమన్వయం చేస్తూ, వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతోనే ఈ జాప్యం జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Also read: కాంగ్రెస్ పార్టీకి ఉహించని షాక్.. ఆ విషయంలో ఇక అన్ని పార్టీలు అటువైపే..?

Tags

Related News

తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనలో ఊహించని ట్విస్ట్.. సీనియర్లకు బిగ్ షాక్!

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరికిందుకు బీఆర్ఎస్ బిగ్ స్కెచ్.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..!

కాంగ్రెస్ పార్టీకి ఉహించని షాక్.. ఆ విషయంలో ఇక అన్ని పార్టీలు అటువైపే..?

రెండేళ్లు చాన్సివ్వండి.. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ది..ప‌రీక్ష‌లో మంచి మార్కులు తెచ్చుకుంటా! ఆ త‌రువాత మీ జీత‌భ‌త్యాలు నేను చూసుకుంటా!

కృష్ణా నీటి వివాదంపై తేలని పంచాయితీ.. కీలక వ్యాఖ్యలు చేసిన కేఆర్ఎంబీ!

కేటీఆర్ జెన్‌జీ మంత్ర.. విద్యార్థులు, నిరుద్యోగుల‌తో ఢిల్లీ బాట‌..! జెన్‌జీ మ‌న‌సు గెలుచుకునే ప్ర‌య‌త్నం..

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ లేఆఫ్స్.. లక్ష మంది ఉద్యోగులకు షాక్!

Big Stories

Advertisement
×