The Paradise Movie: న్యాచురల్ స్టార్ నాని త్వరలోనే ది ప్యారడైజ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ పూర్తికాని నేపథ్యంలో వాయిదా పడితూ వస్తుంది. మార్చిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా జూన్ కు వాయిదా పడింది .అలాగే జూన్ నుంచి ఆగస్టు 21వ తేదీ ఈ సినిమాని విడుదల అవుతుందని చిత్ర బృందం తెలిపారు. అయినప్పటికీ ఈ సినిమా షూటింగ్ పూర్తి కాని నేపథ్యంలో ఆగస్టు నుంచి సెప్టెంబర్ నెలలో విడుదల కాబోతుందనీ నిర్మాతలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 24 న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల అవుతున్నట్టు తెలిపారు.
ఈ సినిమా మరి కొద్ది రోజులలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ సినిమా మరోసారి వాయిదా పడుతుందనే వార్త వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే నాని అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా గ్రాఫిక్స్, RR పనులు పూర్తి కాలేదని అందుకే మరో వారం రోజులు ఆలస్యంగా ఈ సినిమా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా సెప్టెంబర్ 24 నుంచి వాయిదా పడుతూ ఈ సినిమా అక్టోబర్ 1 వ తేదీ విడుదలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.
ఇలా ఈ సినిమా వాయిదా అంటూ వార్తలు వస్తున్నప్పటికీ చిత్ర నిర్మాతలు మాత్రం మౌనంగా ఉన్న నేపథ్యంలో అభిమానులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయినప్పటికీ కేవలం సౌత్ భాషలలో మాత్రమే విడుదల అవుతుందని, హిందీ భాషలో కూడా విడుదల కావటం లేదని సమాచారం. మరి ఈ సినిమా విడుదల వాయిదా గురించి పూర్తి క్లారిటీ రావాలంటే చిత్ర నిర్మాతలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ఇక ఈ సినిమా పట్ల భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మొదటసారి నాని విభిన్నమైన జడల్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ భారీ హైప్ పెంచేశాయి.ఇటీవల విడుద చేసిన సెకండ్ సింగిల్ “ఎషనాగుల కట్టమీద” సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంది. ఈ పాటలో నాని జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు,రాఘవ్ జుయల్,తనికెళ్ళ భరణి, సోనాలి కులకర్ణి వంటి తదితరులు కీలకపాత్రలలో నటిస్తున్నారు.
Also Read; డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!