OnePlus 15 Alternatives| వన్‌ప్లస్ 15 తాజాగా లాంచ్ అయిన ఫ్లాగ్‌షిప్ ఫోన్. దీని ధర రూ.72,999 నుంచి మొదలవుతుంది. ఇందులో లేటెస్ట్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఉంది. 7300 mAh పెద్ద బ్యాటరీ, 165Hz స్మూత్ డిస్‌ప్లే కూడా ఉన్నాయి. కానీ ఇంతకంటే తక్కువ ధర లోనే ఇంకా చాలా మంచి ఫోన్లు దొరుకుతున్నాయి. ఇవి వన్‌ప్లస్ 15తో సమానంగా లేదా అంతకుమించిన ఫీచర్లు ఇస్తాయి. రూ.50,000 నుంచి రూ.70,000 మధ్య బడ్జెట్‌లో 5 అద్భుతమైన ఫోన్ల గురించి ఇప్పుడు చూద్దాం. ఇవి 2025లో టాప్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తున్న ఫోన్లు.
ఈ జాబితాలో మొదటిది ఆపిల్ ఐఫోన్ 16e – దీని ధర కేవలం రూ.48,990. అంటే వన్ ప్లస్ 15 కంటే చాలా చవక! ఇందులో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే ఉంది. A18 బయోనిక్ చిప్ వేగంగా పనిచేస్తుంది. 48MP మెయిన్ కెమెరాతో డాల్బీ విజన్ HDR వీడియో రికార్డ్ చేయవచ్చు. లేటెస్ట్ iOS 18 సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఆపిల్ ఫ్యాన్స్‌కి ఇది పర్ఫెక్ట్. చిన్న సైజు, స్మూత్ యూజ్, లాంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ – అన్నీ బెస్ట్‌గా ఉన్నాయి.
రియల్‌మీ GT 7 ప్రో ధర రూ.50,999లే. ఇందులో 6.78 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే ఉంటుంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎలైట్ ప్రాసెసర్ ఉంది. 50MP OIS రియర్ కెమెరాతో స్పష్టమైన ఫోటోలు వస్తాయి. 5800 mAh బ్యాటరీ రోజంతా ఈజీగా నడుస్తుంది. ఈ ఫోన్‌లో గేమింగ్, మల్టీటాస్కింగ్ – అన్నీ సూపర్ ఫాస్ట్!
ఇక ఐక్యూ 13 ధర రూ.54,999. ఇందులో 6.82 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే ప్యానెల్ ఉంది. ఇది 4500 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది. ఎండలో కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. స్నాప్‌డ్రాగన్ ఎలైట్ ప్రాసెసర్, 6150 mAh పవర్‌ఫుల్ బ్యాటరీ. హెవీ యూజ్‌కి కూడా సరిపోతుంది. IP69 వాటర్ రెసిస్టెంట్ – నీళ్లు, దుమ్ము పడినా ఏమీ భయం లేదు. గేమర్స్‌కి ఈ ఫోన్ బెస్ట్ ఛాయిస్!
శామ్‌సంగ్ గెలాక్సీ S25 ధర రూ.63,640. 6.2 అంగుళాల LTPO AMOLED 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో రన్ అవుతుంది. ట్రిపుల్ 50MP కెమెరా సిస్టమ్ – అద్భుతమైన ఫోటోలు, వీడియోలు షూట్ చేయగలదు. శామ్‌సంగ్ బిల్డ్ క్వాలిటీ టాప్ క్లాస్. ప్రీమియం లుక్, లాంగ్ సపోర్ట్ – ఎవరైనా ఇష్టపడతారు.
జాబితాలో చివరి ఫోన్ వివో X200. దీని ధర రూ.65,999. 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్. జీస్ ట్యూన్డ్ ట్రిపుల్ 50MP కెమెరాలు.. ఫోటోగ్రఫీ ప్రేమికులకి ఇది బెస్ట ఛాయిస్. ఇది క్లీన్ ఆండ్రాయిడ్ 15 సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. స్టైలిష్ డిజైన్, కెమెరా ఫోకస్ తో ఇది స్పెషల్ ఫోన్.
ఈ ఐదు ఫోన్లూ వన్‌ప్లస్ 15తో పోటీ పడతాయి. అన్నింట్లో పవర్‌ఫుల్ చిప్‌సెట్స్, అద్భుతమైన డిస్‌ప్లేలు ఉన్నాయి. ధరలు రూ.48,990 నుంచి రూ.65,999 మధ్యలోనే ఉన్నాయి. మీకు ఏ బ్రాండ్ ఇష్టమో, మీ బడ్జెట్ ఎంతో దాని ఆధారంగా ఎంచుకోండి. మీరు ఐఫోన్ ఫ్యానా? గేమరా? లేదా కెమెరాని ఇష్టపడేవారా? ఎవరైనా .. ఈ జాబితాలో ప్రతి ఒక్కరికి ఒక ఆప్షన్ ఉంది. 2025లో ఈ ఫోన్లతో టాప్ ఎక్స్‌పీరియన్స్ మీ సొంతం చేసుకోండి!
Also Read: సోషల్ మీడియాలో ఏఐ వీడియోలతో మోసం.. నకిలీ వీడియోలను ఇలా గుర్తించండి