E-Paper
Advertisement

Delhi Blast Case Update: ఢిల్లీ పేలుడు కేసు.. డేంజర్ కెమికల్స్, ఆత్మాహుతి దాడుల్లో వాటిని

Delhi Blast Case Update: ఢిల్లీ పేలుడు కేసు.. డేంజర్ కెమికల్స్, ఆత్మాహుతి దాడుల్లో వాటిని
Advertisement

Delhi Blast Case Update: ఢిల్లీ ఎర్రకోట సమీపంలోని పేలుడు వ్యవహారం కొత్త కొత్త విషయాలు బయటకు తెచ్చిందా? ఘటనకు సంబంధించి కీలక విషయాలు బయటకు వస్తున్నాయా? పేలుడులో డేంజర్ కెమికల్స్ ఉపయోగించారా? ఆత్మాహుతి దాడులకు మాత్రమే ఆ కెమికల్స్ ఉపయోగిస్తారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఢిల్లీ పేలుడు కేసు.. ఆత్మాహుతి దాడుల్లో ఉపయోగించే కెమికల్స్

Advertisement

ఢిల్లీలోని ఎర్రకోట మెట్రోస్టేషన్ సిగ్నల్ వద్ద పేలుడు కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోంది. పేలుడులో అత్యంత ప్రమాదకర కెమికల్‌ వాడినట్లు ఫోరెన్సిక్‌ బృందాలు తేల్చాయి. మదర్‌ ఆఫ్‌ సైతాన్‌‌గా పిలిచే ట్రై అసిటోన్‌ ట్రైపెరాక్సైడ్‌-TATP ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇది పూర్తిగా అస్థిర రసాయన సమ్మేళనమన్నది నిపుణుల మాట.

సాధారణ బాంబుల మాదిరిగా గుర్తించడం సాధ్యంకాదని అంటున్నారు. డాక్టర్ల టీమ్.. టీఏటీపీని అమ్మోనియం నైట్రైట్‌తో కలిపి పేలుడు పదార్థాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఐ20 కారుని పేల్చేందుకు ఆత్మాహుతి బాంబర్‌ డాక్టర్‌ ఉమర్‌ నబీ టీఏటీపీని వినియోగించినట్టు తెలుస్తోంది.

Advertisement

ప్రపంచవ్యాప్తంగా ఆత్మాహుతి దాడుల్లో TATP కీలకం

పేలుడుకు కారణమైన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలోని ఓ ఇంట్లో ప్రయోగశాలను ఏర్పాటు చేసినట్టు దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి. అక్కడ వివిధ రకాల పేలుడు పదార్థాలను పరీక్షించేవాడట. టెలిగ్రామ్ ద్వారా పాకిస్తాన్ నిర్వాహకుల సహాయంతో తయారీ పద్ధతులను రెడీ చేసినట్టు తెలుస్తోంది.

కారు పేలుడుకి కారణమైన ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్-IEDని ఇంటి ప్రయోగశాలలో తయారు చేసి ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.  పేలిన కారులో ఉన్న IEDతోపాటు ట్రయాసిటోన్ ట్రైపెరాక్సైడ్-TATP ఓ కీలకమైనది కావచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం రెండు లేదా మూడు కిలోల అమ్మోనియం నైట్రేట్, ఇంధనం ఆయిల్, ఇతర రసాయనాలతో పాటు ఉపయోగించి ఉండవచ్చు.

ALSO READ:  మరోసారి ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్, ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే

దీనివల్ల బాంబు బరువు అమాంతంగా 40 నుంచి 50 కిలోలకు పెరిగే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. డిటోనేటర్ లేకుండా పేలుడుకు కారణమవుతాయి. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో TATP ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన పేలుడులో TATP పాత్ర పోషించి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

తొలిసారి 2001లో ముష్కరులు టీఏటీపీని ప్రయోగం చేపట్టారు. అమెరికా విమానాన్ని పేల్చేందుకు ఓ ఉగ్రవాది బూటులో టీఏటీపీని ఉపయోగించాడు, కానీ అది సక్సెస్ కాలేదు. మరో నాలుగేళ్లు గ్యాప్ ఇచ్చిన తర్వాత 2005లో జులై జరిగిన లండన్‌ బాంబింగ్‌లో టీఏటీపీని ఉపయోగించారు. ఆ ఘటనలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు.

2015 నవంబర్‌లో జరిగిన పారిస్‌ దాడుల్లో వాడారు. ఆత్మాహుతి బాంబర్లు ధరించిన జాకెట్లలో వీటిని అమర్చారు. 2016 మార్చి నెల బ్రస్సెల్స్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఉపయోగించారు. ఈ ఘటనలో 32 మంది చనిపోయారు. గాయాల పాలైనవారి సంఖ్య 300 మంది. 2017 మే లో మాంచెస్టర్‌ ఎరీనా పేలుళ్లలో ఐఈడీతో కలిపి టీఏటీపీని వినియోగించారు ముష్కరులు. ఆ ఘటనలో 22 మంది చనిపోయిన విషయం తెల్సిందే.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×