Best Smartwatches Under 2000: ప్రస్తుత డిజిటల్ యుగంలో.. స్మార్ట్ వాచ్ అనేది కేవలం సమయం చూసుకోవడానికి మాత్రమే కాదు, ఒక స్టైల్ ఐకాన్‌గా మారి పోయింది. ముఖ్యంగా ప్రయాణాల్లో.. ఉన్నప్పుడు లేదా బైక్ నడుపుతున్నప్పుడు ఫోన్ జేబులోంచి తీయకుండానే.. వాచ్ ద్వారానే నేరుగా మాట్లాడే ‘బ్లూటూత్ కాలింగ్’ ఫీచర్‌కు ఇప్పుడు విపరీతమైన క్రేజ్ ఉంది. ఒకప్పుడు వేలల్లో.. ఉన్న ఈ ఫీచర్, ఇప్పుడు చాలా తక్కువ బడ్జెట్ ధరలోనే.. అందుబాటులోకి వచ్చింది. రూ. 1500 నుంచి రూ. 2000 లోపు లభించే బెస్ట్ కాలింగ్ స్మార్ట్ వాచీలు, వాటి ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బడ్జెట్ ధరలో కాలింగ్ స్మార్ట్ వాచీల హవా:
మార్కెట్లో నాయిస్, బోట్, ఫైర్-బోల్ట్ వంటి బ్రాండ్లు తక్కువ ధరలోనే.. ప్రీమియం లుక్, అద్భుతమైన ఫీచర్లను అందిస్తూ.. యువతను ఆకట్టుకుంటున్నాయి. ఫోన్ కాల్స్ మాట్లాడటంతో పాటు హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ వంటి హెల్త్ ట్రాకర్లు కూడా వీటిలో ఇన్-బిల్ట్‌గా వస్తున్నాయి. జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్న ఆ టాప్ 5 స్మార్ట్ వాచీల వివరాలు ఇవే..
1. ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ (Fire-Boltt Ninja Call Pro Plus):
బడ్జెట్ ధరలో.. అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ వాచీలలో ఇది ఒకటి. ఇది 1.83 ఇంచుల పెద్ద డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలోని ఇన్-బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్ క్వాలిటీ చాలా బాగుంటాయి. ఇందులో డయల్ ప్యాడ్, రీసెంట్ కాల్స్ హిస్టరీ చూసుకునే సదుపాయం ఉంది.
ధర: సుమారు రూ. 1,199 నుంచి రూ. 1,399 లోపు ఉంటుంది.
2. బోట్ వేవ్ కాల్ (boAt Wave Call):
బోట్ సంస్థకు చెందిన ఈ వాచ్ ప్రీమియం మెటాలిక్ బాడీ డిజైన్‌తో వస్తుంది. దీనిలోని 1.69 ఇంచుల హెచ్‌డీ కర్వ్డ్ డిస్‌ప్లే ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దీని ద్వారా బ్లూటూత్ కాలింగ్ చాలా స్మూత్‌గా పని చేస్తుంది. ఇందులో దాదాపు 10కి పైగా కాంటాక్ట్స్ సేవ్ చేసుకోవచ్చు.
ధర: మార్కెట్లో దీని ధర సుమారు రూ. 1,499 గా ఉంది.
3. నాయిస్ పల్స్ 2 మాక్స్ (Noise Pulse 2 Max):
నాయిస్ బ్రాండ్ డిస్‌ప్లే క్వాలిటీకి చాలా ఫేమస్. ఈ వాచ్ 1.85 ఇంచుల అతిపెద్ద బ్రైట్ డిస్‌ప్లేతో వస్తుంది. ‘ట్రూ సింక్’ టెక్నాలజీ వల్ల ఇది ఫోన్‌కు చాలా వేగంగా కనెక్ట్ అవుతుంది. అంతే కాకుండా బ్యాటరీ కూడా తక్కువ ఖర్చవుతుంది. కాల్స్ మాట్లాడినా కూడా దీని బ్యాటరీ 5 రోజుల వరకు వస్తుంది.
ధర: ఆన్‌లైన్ ఆఫర్లలో ఇది రూ. 1,599 కే లభిస్తుంది.
4. బోట్ స్టార్మ్ కాల్ (boAt Storm Call):
మీకు క్లాసిక్ స్క్వేర్ డిజైన్ నచ్చితే బోట్ స్టార్మ్ కాల్ మంచి ఆప్షన్. ఇది చాలా లైట్ వెయిట్‌గా ఉండి, చేతికి పెట్టుకుంటే మంచి లుక్ ఇస్తుంది. దీనిలో రకరకాల స్పోర్ట్స్ మోడ్స్ , క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్ ఉంటాయి. దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా పటిష్టంగా ఉంటుంది.
ధర: దీని ధర సుమారు రూ. 1,299 నుంచి రూ. 1,499 లోపు అందుబాటులో ఉంది.
Also Read: పవర్ కట్ టెన్షన్ వద్దు.. చార్జింగ్ ఎల్‌ఈడీ లైట్లతో కలిగే లాభాలు ఇవే!
5. ఫైర్-బోల్ట్ ఫోనిక్స్ (Fire-Boltt Phoenix – రౌండ్ డయల్):
చాలా మందికి స్క్వేర్ కంటే రౌండ్ షేప్ (గుండ్రటి) వాచీలంటే ఇష్టం. అలాంటి వారి కోసం ఫైర్-బోల్ట్ ఫోనిక్స్ బెస్ట్ ఛాయిస్. ఇది హై-రెజల్యూషన్ రౌండ్ డిస్‌ప్లే, స్మార్ట్ కాలింగ్ ఫీచర్‌తో వస్తుంది. ఇందులో ఇన్-బిల్ట్ గేమ్స్ కూడా ఇవ్వడం విశేషం.
ధర: దీని ధర సుమారు రూ. 1,699 గా ఉంది.
కొనేముందు గమనించాల్సిన స్మార్ట్ టిప్:
తక్కువ ధరలో కాలింగ్ వాచ్ కొనేటప్పుడు, దానికి ‘IP67 లేదా IP68 వాటర్ రెసిస్టెంట్’ రేటింగ్ ఉందో లేదో ఖచ్చితంగా చూసుకోండి. దీని వల్ల ఎండా కాలంలో వచ్చే చెమట లేదా వర్షపు నీటి చుక్కల వల్ల వాచ్ పాడవకుండా సేఫ్‌గా ఉంటుంది. మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా పై వాటిలో ఒక మంచి మోడల్‌ను ఎంచుకుంటే.. తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ మీ సొంతమవుతాయి.