E-Paper
Advertisement

బెస్ట్ కమర్షియల్ మిక్సీ గ్రైండర్లు..హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌ల కోసం టాప్ మోడల్స్

బెస్ట్ కమర్షియల్ మిక్సీ గ్రైండర్లు..హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌ల కోసం టాప్ మోడల్స్
Advertisement

Best Commercial Mixer Grinders: ఒక హోటల్, రెస్టారెంట్ లేదా కేఫ్ లాభాలతో నడవాలంటే కిచెన్‌లో పని చాలా వేగంగా జరిగిపోవాలి. నిమిషాల వ్యవధిలోనే కిలోల కొద్దీ ఇడ్లీ పిండి, మసాలాలు, గ్రేవీలు లేదా చట్నీలు రుబ్బాల్సి ఉంటుంది. ఇలాంటి పనులకు మనం ఇళ్లలో వాడే మామూలు మిక్సీలు అస్సలు సెట్ అవ్వవు. వాటి కోసం గంటల తరబడి మొరాయించకుండా.. పనిచేసే ‘కమర్షియల్ మిక్సీ గ్రైండర్లు’ (Commercial Mixer Grinders) అవసరం. కమర్షియల్ కిచెన్స్ కోసం మార్కెట్లో దూసుకుపోతున్న టాప్ 5 హెవీ డ్యూటీ మిక్సీల పూర్తి వివరాలు మీకోసం..

కమర్షియల్ మిక్సీ గ్రైండర్లు ఎందుకు బెస్ట్?

Advertisement

హోటల్ కిచెన్లలో మిక్సీలను రోజుకు చాలా సార్లు, ఎక్కువ సమయం పాటు వాడాల్సి వస్తుంది. కమర్షియల్ మిక్సీలలో ఉండే మోటార్లు సాధారణంగా 1000 వాట్స్ నుంచి 1500 వాట్స్ లేదా అంతకంటే ఎక్కువ పవర్‌తో వస్తాయి. వీటి బాడీ , జార్లు క్లాస్-వన్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారవుతాయి కాబట్టి.. ఎంత రఫ్‌గా వాడినా తట్టుకుంటాయి. అంతేకాదు.. వీటిలో ఉండే అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్ వల్ల మోటార్ త్వరగా వేడెక్కదు.

రెస్టారెంట్లు, కేఫ్‌ల కోసం టాప్ 5 కమర్షియల్ మిక్సీలు ఇవే:

Advertisement

1. సుజాత పవర్‌మాటిక్ ప్లస్ 900-వాట్ జ్యూసర్‌ మిక్సర్‌ గ్రైండర్ (Sujata Powermatic Plus):
చిన్న కేఫ్‌లు, జ్యూస్ సెంటర్లు, రెస్టారెంట్ నడిపే ప్రతి ఒక్కరి మొదటి ఛాయిస్ ‘సుజాత’. దీని మోటార్ చాలా పవర్‌ఫుల్. గంటల తరబడి నాన్‌స్టాప్‌గా రన్ చేసినా ఇది అస్సలు అలసిపోదు. 22000 RPM స్పీడ్‌తో తిరిగే దీని బ్లేడ్లు గట్టి మసాలాలను కూడా క్షణాల్లో పౌడర్ చేసేస్తాయి. జ్యూస్‌లు, స్మూతీలు ఎక్కువగా చేసే కేఫ్‌లకు ఇది బెస్ట్.

2. ప్రీతి ఎక్స్‌ప్రో కమర్షియల్ మిక్సీ గ్రైండర్ (Preethi Xpro Duo 1300 Watt):
హోటల్స్ కోసం ప్రీతి బ్రాండ్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన మోడల్ ఇది. 1300 వాట్స్ హెవీ డ్యూటీ మోటార్‌తో వచ్చే ఈ మిక్సీలో పెద్ద సైజ్ స్టెయిన్‌లెస్ స్టీల్ జార్లు ఇస్తారు. ఇడ్లీ, దోస పిండి లేదా హోటల్ స్టైల్ మసాలా గ్రేవీలను ఎక్కువ క్వాంటిటీలో రుబ్బడానికి ఇది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇందులో ఉన్న సేఫ్టీ లాకింగ్ సిస్టమ్ వల్ల జార్ సరిగ్గా కూర్చుంటేనే మోటార్ ఆన్ అవుతుంది.

3. హామిల్టన్ బీచ్ కమర్షియల్ బ్లెండర్ (Hamilton Beach HBH455):
మీరు ఒక మోడ్రన్ కేఫ్ లేదా హై-ఫై రెస్టారెంట్ నడుపుతుంటే సౌండ్ లేని బ్లెండర్ చాలా అవసరం. హామిల్టన్ బీచ్ మిక్సీలు ప్రీమియం కేఫ్‌లకు కేరాఫ్ అడ్రస్. దీనికున్న ‘సౌండ్ షీల్డ్’ కవర్‌ వల్ల మిక్సీ తిరుగుతున్నప్పుడు అస్సలు సౌండ్ రాదు. ఐస్ క్యూబ్స్‌ను సైతం స్మూత్‌గా క్రష్ చేసి క్రీమీ షేక్స్, మాక్‌టెయిల్స్ తయారు చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్.

4. విడెమాల్ట్ హెవీ డ్యూటీ కమర్షియల్ గ్రైండర్ (Widemalt 1500W):
పెద్ద రెస్టారెంట్లు, క్యాటరింగ్ సర్వీసెస్ చేసే వారికి 1500 వాట్స్ పవర్ గల విడెమాల్ట్ మిక్సీ సూపర్బ్ ఛాయిస్. ఇది కమర్షియల్ గ్రేడ్ ప్యూర్ కాపర్ మోటార్‌తో వస్తుంది. గసగసాలు, ఎండుమిర్చి లాంటి కఠినమైన పదార్థాలను కూడా చాలా సాఫ్ట్‌గా గ్రైండ్ చేస్తుంది. దీని స్టైలిష్ డిజైన్ , బిల్డ్ క్వాలిటీ కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది.

5. బటర్ ఫ్లై కమర్షియల్ మ్యాచ్‌లెస్ (Butterfly Commercial Matchless 1000W):
సౌత్ ఇండియన్ హోటళ్లలో చట్నీలు ఎక్కువగా రుబ్బడానికి బటర్‌ఫ్లై బ్రాండ్ చాలా ఫేమస్. 1000 వాట్స్ పవర్‌తో వచ్చే ఈ మోడల్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ. దీని జార్ హ్యాండిల్స్ , బేస్ చాలా గట్టి ప్లాస్టిక్‌తో డిజైన్ చేశారు. కాబట్టి రోజువారీ రఫ్ యూసేజ్‌కు ఇది బాగా తట్టుకుంటుంది.

Also Read: చిక్కటి కాఫీ కోసం బెస్ట్ గ్యాడ్జెట్స్.. మీ కిచెన్‌లో ఉండాల్సిన టాప్ 5 కాఫీ బ్లెండర్లు

కమర్షియల్ మిక్సీ కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి:
మోటార్ వాటేజ్: మీ కేఫ్ లేదా రెస్టారెంట్ అవసరాన్ని బట్టి కనీసం 1000W నుంచి 1300W మోటార్ ఉన్న మిక్సీలను ఎంచుకోండి.

జార్ కెపాసిటీ: కమర్షియల్ కిచేన్స్ కోసం కనీసం 2 లీటర్ల నుంచి 3 లీటర్ల కెపాసిటీ ఉన్న జార్లు ఇస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి.

సర్వీస్ అండ్ వారంటీ: హోటల్ మిక్సీలు రోజులు తరబడి ఆగిపోకూడదు కాబట్టి, మీ ఏరియాలో మంచి సర్వీస్ సెంటర్ నెట్‌వర్క్ ఉన్న బ్రాండ్స్‌ను మాత్రమే సెలెక్ట్ చేసుకోండి.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×