Best dehumidifiers for home: వర్షాకాలం.. వచ్చిందంటే చాలు, ఇళ్లలో విపరీతమైన తేమ నిండిపోతుంది. కిటికీలు మూసి ఉన్నా.. ఎందుకో గాలి అంతా ఒకలాంటి జిగటగా, బట్టలు సరిగ్గా.. ఆరక విపరీతమైన వాసన వస్తుంటాయి. ఇది కేవలం అసౌకర్యాన్ని.. కలిగించడమే కాకుండా.. ఇంట్లో బూజు పెరగడానికి, ఆస్తమా లేదా అలర్జీలు ఉన్న వారికి ఇబ్బందిగా మారుతుంది. ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మార్కెట్లో ‘డిహ్యూమిడిఫైయర్ అనే అద్భుతమైన గాడ్జెట్ అందుబాటులో ఉంది. ఇది గాలిలోని.. అదనపు తేమను పీల్చుకుని,ఇల్లు ఎంతో హాయిగా ఉండేలా చేస్తుంది. మీ బడ్జెట్, అవసరాలకు తగ్గట్టుగా ఎంచుకోవడానికి.. వీలుగా ఉండే.. టాప్-5 డిహ్యూమిడిఫైయర్ల గురించి తెలుసుకుందాం.
స్మార్ట్ హోమ్ అప్లయెన్సెస్ విభాగంలో.. ఇది చాలా పాపులర్. ఇది తక్కువ శబ్దంతో.. పని చేస్తుంది. అంతే కాకుండా.. మొబైల్ యాప్ ద్వారా కూడా దీనిని చాలా స్మార్ట్‌గా కంట్రోల్ చేయొచ్చు. గదిలోని.. తేమ శాతాన్ని ఎప్పటికప్పుడు సెట్ చేసుకునే వీలుంది. దీని ధర సుమారు రూ. 8,799 వరకు ఉంటుంది. స్మార్ట్ హోమ్ గాడ్జెట్ ఇష్టపడే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
కమర్షియల్, హోమ్ ఎయిర్ కేర్ మార్కెట్లో..’ఆరిజిన్’ బ్రాండ్ పేరుగాంచింది. ఈ మోడల్ గదిలోని గాలిని వేగంగా శుభ్రం చేస్తుంది . అంతే కాకుండా దీనిలో వాటర్ ట్యాంక్ కెపాసిటీ , ఆటో షట్-ఆఫ్ ఫీచర్ ఉంటుంది. ధర సుమారు రూ.32,500 వరకూ ఉంటుంది. కాబట్టి పెద్ద లివింగ్ రూమ్‌లు లేదా ఎక్కువ తేమ ఉండే పెద్ద ఇళ్లకు ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.
ఇది కేవలం డిహ్యూమిడిఫైయర్ మాత్రమే కాదు, ఎయిర్ ప్యూరిఫైయర్‌గా కూడా పని చేస్తుంది. ప్లాస్మాక్లస్టర్ టెక్నాలజీ, హెపా ఫిల్టర్ ఉండటం వల్ల గాలిలోని హాని కరమైన బ్యాక్టీరియా నశిస్తుంది.
దీని ధరసుమారు రూ. 37,970 వరకూ ఉంటుంది. ఇళ్లలో చిన్న పిల్లలు లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఉండే కుటుంబాలకు ఇది బెస్ట్ ఆప్షన్.
పెద్ద పెద్ద మెషీన్లు కాకుండా, కేవలం అల్మారాలు, చిన్న గదులు లేదా షూ రాక్‌ల కోసం ప్రత్యేకంగా తయారైన కాంపాక్ట్ డివైజ్ ఇది.బట్టలు పాడవకుండా, వాటికి వచ్చే చెడు వాసనను పూర్తిగా తొలగిస్తుంది. దీని ధర సుమారు రూ.1,911 వరకూ ఉంటుంది. కాబట్టి వార్డ్‌రోబ్‌లు, స్టోర్ రూమ్‌లు లేదా చిన్న బాత్‌రూమ్‌లలో తేమను నివారించాలనుకునే వారికి ఇది బెస్ట్.
ఇండియన్ మార్కెట్లో సామాన్యులకు.. అందుబాటు ధరలో లభిస్తుంది. డిజిటల్ డిస్‌ప్లే, టైమర్ కంట్రోల్స్, ఈజీగా మూవ్ చేయడానికి వీలుగా ఉండే డిజైన్ దీని సొంతం. వాటర్ ట్యాంక్ నిండిన వెంటనే ఆటోమేటిక్‌గా ఇది ఆగిపోతుంది. దీని ధర సుమారు రూ. 7,000 నుంచి రూ.12,000 మధ్య ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు కోరుకునే వారి కోసం ఇది బెస్ట్.
Also Read: రూ.1037కే మిక్సీ గ్రైండరా? ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఈ క్రేజీ ఆఫర్ అసలు మిస్ కావద్దు!
రూమ్ సైజు: మీ రూమ్ సైజ్ ను బట్టి తగిన కెపాసిటీ ఉన్న మెషీన్‌ను ఎంచుకోండి.
వాటర్ ట్యాంక్ కెపాసిటీ: ఎక్కువ నీటిని పట్టే ట్యాంక్ ఉంటే.. తరచూ మార్చాల్సిన పని ఉండదు.
పవర్ కన్సంప్షన్: ఎక్కువ గంటలు నడపాలి కాబట్టి తక్కువ కరెంట్ ఖర్చు ఉండే ఉన్న మోడల్ చూడండి.