Bigg Boss 10: బిగ్ బాస్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6 సాయంత్రం 7:00 నుండి గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సీజన్ కి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి . గత సీజన్లలో సెలబ్రిటీలను ఎక్కువ మందిని , సామాన్యులను తక్కువ మందిని హౌస్ లోకి తీసుకునేవారు. కానీ ఈ సీజన్లో సామాన్యులను 6 మందిని సెలబ్రిటీలను కూడా 6 మందిని తీసుకోబోతున్నట్లు ఒకవైపు వార్తలు రాగా.. మరోవైపు 9 మంది సెలబ్రిటీలను, 6 మంది సామాన్యులను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజముందో తెలియాలి అంటే సెప్టెంబర్ 6 వరకు ఎదురు చూడాల్సిందే.
ఇదిలా ఉండగా.. మరొకవైపు ఈసారి కూడా సామాన్యులకు భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అగ్ని పరీక్షకు వెళ్లి అక్కడ పలు టాస్క్ లతో జడ్జెస్ ను మెప్పించి, ఎంపికైన ఆరుగురిని హౌస్ లోకి పంపించబోతున్నారు. అయితే వీరికి వారానికి రూ.50 వేల నుండి సుమారుగా రూ.70 వేల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇకపోతే అగ్నిపరీక్షలో సెలెక్ట్ అయి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే సామాన్యులకు భారీ రెమ్యునరేషన్ తో పాటు అంతకుమించి గుర్తింపు కూడా లభిస్తోంది..
ఇప్పటికే సామాన్యులుగా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్, కళ్యాణ్ పడాల , డెమోన్ పవన్ , ఆదిరెడ్డి, ప్రియా శెట్టి ఇలా ఎంతో మంది సామాన్యులు.. కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టి ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు బుల్లితెర షోలలో సెలబ్రిటీలతో సమానంగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. పలు షోలలో సందడి చేస్తూ సీరియల్స్ లో కూడా అవకాశాలు అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీన్ని బట్టి చూస్తే సామాన్యులకు బిగ్ బాస్ పాపులారిటీని అందించే వేదికగా నిలవబోతోంది అని చెప్పాలి. ఏది ఏమైనా బిగ్ బాస్ సామాన్యులకు ఒక గొప్ప వరంగా మారుతోంది అంటూ నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
also read: నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?
ఇకపోతే గత కొన్ని సీజన్లుగా మనం గమనించినట్లయితే కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ టైటిల్ విజేతగా నిలవగా.. గత సీజన్ కూడా కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్ గా నిలిచి సామాన్యులకు పెద్దపీట వేస్తున్నారు. అయితే ఈసారి ఏకంగా 6 మంది హౌస్ లోకి వెళ్లబోతున్నారు. వారిలో ప్రత్యేకించి అమన్ మసూద్, అపూర్వ, ఝాన్సీ, శాలిని , గాయత్రి, చరణ్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఝాన్సీ పేరు ఈసారి టైటిల్ రేసులో నిలవడం ఖాయం అంటూ అగ్నిపరీక్షలో ఆమె పెర్ఫార్మెన్స్ చూసిన నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.. మరి ఈసారి కూడా సామాన్యులే టైటిల్ విజేతగా నిలుస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ సామాన్యులే గనుక ఈసారి కూడా టైటిల్ కొడితే మాత్రం.. బిగ్ బాస్ లో సామాన్యులదే హవా అవడం గ్యారెంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.