Best gaming laptops under 1.5 lak: నేటి డిజిటల్ యుగంలో గేమింగ్ కేవలం.. టైంపాస్ కాదు, దానికో ప్రత్యేక క్రేజ్ ఉంది. హై-ఎండ్ గ్రాఫిక్స్, జీరో లాగ్ పర్ఫార్మెన్స్ , అద్దిరిపోయే రిఫ్రెష్ రేట్ కోరుకునే గేమర్స్ కోసం మార్కెట్లో అనేక.. ఆప్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా రూ. 1.5 లక్షల బడ్జెట్ అనేది ఒక స్వీట్ స్పాట్ లాంటిది. ఈ రేంజ్‌లో మీరు కేవలం గేమింగ్ మాత్రమే కాదు, హెవీ వీడియో ఎడిటింగ్, కోడింగ్, 3D రెండరింగ్ లాంటి పనులను ఇట్టే పూర్తి చేయవచ్చు. మరి లేట్ ఎందుకు, ప్రస్తుత రూ. 1.5 లక్షలలోపు లభించే బెస్ట్ లాప్‌టాప్స్ వివరాలు చూద్దాం.
ఈ బడ్జెట్‌లో బెస్ట్ ఓవరాల్ ప్యాకేజ్ కావాలనుకునే.. వారికి హెచ్‌పి ఓమెన్ సిరీస్ ఎప్పుడూ ముందుంటుంది. దీని డిజైన్ చాలా క్లీన్‌గా, ప్రొఫెషనల్‌గా ఉంటుంది. ఇది పవర్ ఫుల్ ఇంటెల్ కోర్ లేదా లేటెస్ట్ ఏఎండీ రైజెన్ ప్రాసెసర్‌తో పాటు ఎన్విడియా జెఫోర్స్ RTX గ్రాఫిక్స్ కార్డ్‌ను కలిగి ఉంది. దీని వల్ల హై-ఎండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు గ్రాఫిక్స్ చాలా రియలిస్టిక్‌గా వస్తాయి. అంతే కాకుండా ఇందులో 16 ఇంచుల పెద్ద 2K డిస్‌ప్లే, 165Hz హై రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.కాబట్టి ఇది గేమింగ్ ఫీల్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది.
ధర:మార్కెట్లో దీని ధర సుమారు రూ. 1,39,990 నుంచి రూ.1,49,990 వరకు ఉంది.
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్స్ కోరుకునే.. ఇండియన్ గేమర్స్ మధ్య లేనోవో ఎల్ఓక్యూ లాప్‌టాప్‌లకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇది వేగంగా ఆడే గేమర్స్‌కి పర్‌ఫెక్ట్ ఛాయిస్. ఇది పవర్ ఫుల్ ఇంటెల్ కోర్.. i7 లేదా i5 HX-సిరీస్ ప్రాసెసర్‌తో వస్తుంది. అంతే కాకుండా దీనిలోని MUX స్విచ్ గేమింగ్ సమయంలో.. బ్యాటరీ సేవ్ చేస్తూనే గ్రాఫిక్స్ పని అమాంతం పెంచుతుంది. గంటల తరబడి గేమ్స్ ఆడినా లాప్‌టాప్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో లేటెస్ట్ థర్మల్ కూలింగ్ టెక్నాలజీని అందించారు.
ధర: దీని ధర సుమారు రూ. 1,29,990 నుంచి రూ.1,44,990 మధ్య లభిస్తుంది.
Also Read: సామ్‌సంగ్ 43 ఇంచుల టీవీపై భారీ డిస్కౌంట్..ఆఫర్ ముగిసేలోపే కొనేయండి
ఎంత కఠినమైన వాతావరణంలోనైనా చెక్కుచెదరకుండా పనిచేసే లాప్‌టాప్ కావాలంటే.. ఆసుస్ టఫ్ సిరీస్‌ను మించింది లేదు. గేమర్స్ ఎక్కువగా నమ్మే బ్రాండ్లలో ఇది ఒకటి. మిలిటరీ-గ్రేడ్ డిజైన్‌తో ఇది చాలా గట్టిగా ఉంటుంది. యాక్సిడెంటల్ డ్రాప్స్ లేదా ట్రావెలింగ్ చేసేవారికి ఇది చాలా సేఫ్ అని చెప్పొచ్చు. అంతే కాకుండా హై స్పీడ్ DDR5 రామ్ , ఫాస్ట్ SSD స్టోరేజ్ ఉండటం వల్ల గేమ్స్ క్షణాల్లో లోడ్ అవుతాయి. దీని కీబోర్డ్ గేమింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసారు.
ధర: ఈ లాప్‌టాప్ ధర సుమారు రూ. 1,19,990 నుంచి రూ.1,45,000 వరకు ఉంటుంది.
మీరు ప్రొఫెషనల్ గేమర్ కావాలనుకుంటే.. లేదా హై-ఎండ్ కంటెంట్ క్రియేట్ చేయాలని చూస్తుంటే.. రూ. 1.5 లక్షల బడ్జెట్‌లో పైన తెలిపిన బెస్ట్ మోడల్స మీకు చాలా బాగా ఉపయోగపడతాయి.. మీ అవసరానికి తగినట్లుగా సరైన మోడల్‌ను ఎంచుకుని మీ గేమింగ్ జర్నీని కొనసాగించండి!