E-Paper
Advertisement

సామ్‌సంగ్ 43 ఇంచుల టీవీపై భారీ డిస్కౌంట్..ఆఫర్ ముగిసేలోపే కొనేయండి

సామ్‌సంగ్ 43 ఇంచుల టీవీపై భారీ డిస్కౌంట్..ఆఫర్ ముగిసేలోపే కొనేయండి
Advertisement

Samsung 43 inch 4K TV: మీ ఎంటర్టైన్మెంట్‌ను పూర్తిగా మార్చేయడానికి మార్కెట్లోకి  అద్భుతమైన మోడల్ వచ్చేసింది. బెస్ట్ విజువల్స్, లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, అంతే కాకుండా ఆకట్టుకునే సౌండ్ టెక్నాలజీతో వస్తున్న ఈ స్మార్ట్ టీవీ ప్రస్తుత ట్రెండ్‌లో.. టెక్‌ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రూ. 32,990 ధరతో లభిస్తున్న ఈ ట్రెండీ టీవీ గురించిన పూర్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం.

సామ్‌సంగ్ 43 ఇంచల 4K స్మార్ట్ టీవీ:

ప్రస్తుత స్మార్ట్ టీవీ మార్కెట్‌లో సామ్‌సంగ్ బ్రాండ్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్, ప్రీమియం ఫీచర్లు కోరుకునే యూజర్ల కోసం కంపెనీ ప్రవేశపెట్టిన సామ్‌సంగ్ 43 ఇంచుల క్రిస్టల్ UHD 4K విజన్ ఏఐ స్మార్ట్ టీవీ టెక్‌ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ టీవీ అందమైన డిజైన్‌తో పాటు శక్తివంతమైన పర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది.

అద్భుతమైన డిస్‌ప్లే , పిక్చర్ క్వాలిటీ:

Advertisement

ఈ స్మార్ట్ టీవీ డిస్‌ప్లే , పిక్చర్ క్వాలిటీ పరంగా చూస్తే..ఇది 4కే అల్ట్రా హెచ్‌డీ (3840 x 2160 పిక్సెల్స్) రెసల్యూషన్‌తో వస్తుంది. ఇందులో ఉన్న క్రిస్టల్ ప్రాసెసర్ 4K సాయంతో సాధారణ కంటెంట్‌ని కూడా అద్భుతమైన 4కే క్వాలిటీకి అప్‌స్కేల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా.. పుర్‌కలర్ టెక్నాలజీ కారణంగా ప్రతి సీన్ చాలా సహజంగా, స్పష్టమైన రంగులతో కనిపిస్తుంది.

థియేటర్ లాంటి సౌండ్ :

ఇక సౌండ్ సిస్టమ్ విషయానికి వస్తే.. ఈ టీవీలో పవర్ ఫుల్ స్పీకర్లు ఇచ్చారు. ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్, క్యూ-సింఫనీ ఫీచర్లు కూడా దీనిలో ఉండటం వల్ల సినిమా చూస్తున్నప్పుడు లేదా ఆటలు ఆడుతున్నప్పుడు థియేటర్ లాంటి ఆడియో ఫీల్ కలుగుతుంది. సౌండ్ నేరుగా ఆన్-స్క్రీన్ యాక్షన్‌కి తగినట్లుగా.. మూవ్ అవుతుంది కాబట్టి స్క్రీన్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మీకు థియేటర్ అనుభూతిని అందిస్తుంది.

విజన్ AI , స్మార్ట్ ఫీచర్లు:

Advertisement

టెక్‌ పరంగా ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది విజన్ ఏఐ కంపానియన్ ఫీచర్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వస్తుంది కాబట్టి. వాయిస్ అసిస్టెంట్ సాయంతో.. కేవలం మీ గొంతుతోనే టీవీని కంట్రోల్ చేయొచ్చు. అలాగే తాజా టైజెన్ ఓఎస్ ఆధారంగా పని చేసే వన్ యూఐ ఇంటర్‌ఫేస్ చాలా స్మూత్‌గా పని చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ వంటి అన్ని ప్రముఖ ఓటీటీ యాప్స్ ఇందులో చాలా బాగా రన్ అవుతాయి.

Also Read: కిచెన్ పనులు చిటికెలో అయిపోవాలా? వీటిపై ఓ లుక్కేయండి

గేమింగ్ లవర్స్ కోసం ప్రత్యేకతలు:

గేమర్స్ కోసం ఇందులో.. మోషన్ ఎక్సలరేటర్ , ఆటో లో లేటెన్సీ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి గేమింగ్‌లో ఎలాంటి లాగ్ లేకుండా సూపర్‌గా మారుస్తాయి. దీనిలో సేఫ్టీ కోసం సామ్‌సంగ్ నాక్స్ సెక్యూరిటీ కూడా వాడారు కాబట్టి. ఇది మీ పర్సనల్ డేటాను, పాస్‌వర్డ్‌లను ఎల్లప్పుడూ సేఫ్ గానే ఉంచుతుంది.

మార్కెట్లో దీని అసలు ధర రూ. 39,900 వరకు ఉండగా.. ప్రస్తుతం వివిధ ఆఫర్లు, డీల్స్ కలుపుకుని కేవలం రూ. 32,990 ధరకే అందుబాటులో ఉంది. మీరు తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు, ఏఐ టెక్నాలజీ, అద్భుతమైన 4కే పిక్చర్ క్వాలిటీ కోరుకుంటే.. ఈ సామ్‌సంగ్ 43 ఇంచుల స్మార్ట్ టీవీ మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

Related News

గేమింగ్ పీక్స్ చూపిస్తాయ్.. రూ.1.5 లక్షలలోపు బెస్ట్ లాప్‌టాప్స్ ఇవే భయ్యా!

ఫిట్‌నెస్ లవర్స్‌కు పండగే.. మతిపోగొట్టే ఫీచర్లతో Motorola Watch Ultra గ్లోబల్ ఎంట్రీ!

వావ్ అనిపిస్తున్న మోటరోలా తొలి వైడ్ ఫోల్డబుల్ ఫోన్.. ఈ ఫీచర్లకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

కిచెన్ పనులు చిటికెలో అయిపోవాలా? వీటిపై ఓ లుక్కేయండి

హెల్తీ లైఫ్ కోసం కాపర్ vs ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్..ఏది బెస్ట్?

AirPods కంటే దుమ్మురేపే బేస్ కావాలా? ఈ 4 బెస్ట్ ఇయర్ బడ్స్‌పై ఒక లుక్కేయండి!

చూస్తేనే దిమ్మతిరిగిపోయే లుక్.. 16GB ర్యామ్‌తో వచ్చేస్తోన్న Xiaomi 18 Fold!

Big Stories

Advertisement
×