E-Paper
Advertisement

అస్సలు లాగ్ అవ్వదు.. ఛార్జింగ్ అయిపోదు.. ట్రెండింగ్‌లో ఉన్న గేమర్ల ఫేవరెట్ ఫోన్లు ఇవే!

అస్సలు లాగ్ అవ్వదు.. ఛార్జింగ్ అయిపోదు.. ట్రెండింగ్‌లో ఉన్న గేమర్ల ఫేవరెట్ ఫోన్లు ఇవే!
Advertisement

Best Gaming Phones 2026: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ అంటే జస్ట్ కాల్స్ మాట్లాడుకోవడానికి మాత్రమే కాదు.. జేబులో పెట్టుకుని తిరిగే మినీ కంప్యూటర్ లాంటిది. అందులోనూ గేమింగ్ అంటే ఇష్టపడే కుర్రాళ్లకు ఫోనే సర్వస్వం. BGMIలో చికెన్ డిన్నర్ కొట్టాలన్నా లేదా కాల్ ఆఫ్ డ్యూటీలో అదరగొట్టాలన్నా ఒక పవర్‌ఫుల్ ఫోన్ ఉండాల్సిందే. మరి 2026లో మార్కెట్లో ఉన్న టాప్ గేమింగ్ ఫోన్లు ఏవి? వాటి స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

గేమింగ్ ఫోన్ ఎలా ఉండాలంటే?

ఏదైనా గేమింగ్ ఫోన్ కొనే ముందు కొన్ని విషయాలు మైండ్‌లో పెట్టుకోవాలి. ఫోన్ అస్సలు లాగ్ అవ్వకూడదు అంటే దానిలో స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ లాంటి పవర్‌ఫుల్ ప్రాసెసర్ ఉండాలి. అలాగే, గేమ్ ఆడుతున్నప్పుడు బొమ్మలు స్మూత్‌గా కనిపించడానికి 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే చాలా ముఖ్యం. గంటల తరబడి గేమ్స్ ఆడితే ఫోన్ వేడెక్కిపోతుంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే మంచి కూలింగ్ సిస్టమ్ ఉండాలి. వీటన్నిటితో పాటు ఛార్జింగ్ కూడా ఎక్కువ గంటలు వస్తేనే అప్పుడా ఫోన్ మనకు నచ్చుతుంది కదా.

ASUS ROG Phone 8

Advertisement

మీరు గనుక పక్కా ప్రొఫెషనల్ గేమర్ అయితే.. గేమింగ్ కోసమే పుట్టిన ఈ ఫోన్ బాగా నచ్చుతుంది. దీని లుక్ చూస్తేనే ఇదొక గేమింగ్ బీస్ట్ అని అర్థమైపోతుంది. దీనిలో ప్రత్యేకంగా ఎయిర్ ట్రిగ్గర్స్ ఉంటాయి, ఇవి వీడియో గేమ్ కన్సోల్ వాడుతున్న ఫీలింగ్‌ను ఇస్తాయి. అలాగే ఎంత సేపు ఆడినా ఫోన్ అస్సలు వేడెక్కదు. ఎందుకంటే.. దీనిలో టాప్ లెవల్ కూలింగ్ టెక్నాలజీ ఉంది.

Also Read: రూ.40వేల లోపు బెస్ట్ LG ఫ్రిజ్‌లు.. అదిరిపోయే కూలింగ్, భారీగా కరెంటు ఆదా, ఎక్కడంటే?

OnePlus 12

Advertisement

క్లాసిక్ లుక్‌తో పాటు గేమింగ్‌లో కూడా ఇరగదీయాలంటే వన్‌ప్లస్ 12 మంచి ఛాయిస్. దీని సాఫ్ట్‌వేర్ ఎంత స్మూత్‌గా ఉంటుందంటే.. భారీ గేమ్స్ ఆడుతున్నా సరే ఫోన్ అస్సలు స్లో అవ్వదు. ఈ ఫోన్‌లో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏమిటంటే.. దీని సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం వలన మనం కాఫీ తాగి వచ్చేలోపే ఫోన్ ఫుల్‌ఛార్జ్ అయిపోతుంది. గేమర్లకు అంతకంటే ఏం కావాలి చెప్పండి.

Redmi K70 Pro

తక్కువ బడ్జెట్‌లో మంచి గేమింగ్‌ ఫోన్ కావాలనుకుంటే మాత్రం.. ఈ రెడ్‌మీ K70 ప్రో తీసుకోవాల్సిందే. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఇవ్వడంలో రెడ్‌మీ ఎప్పుడూ ముందుంటుంది. హైఎండ్ గేమ్స్‌ను కూడా ఇది ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ముఖ్యంగా కాలేజీకి వెళ్లే స్టూడెంట్స్‌కి ఈ ఫోన్ మంచి గేమింగ్ పార్ట్నర్ అవుతుంది.

OPPO K-Series

మిడ్‌‌రేంజ్‌లో మంచి బ్యాటరీ బ్యాకప్ ఉండాలి, అలాగే గేమ్స్ కూడా ఆడుకోవాలి అనుకుంటే ఒప్పో K13 టర్బో ప్రో లేదా K15 ప్రోను కొనుగోలు చేయొచ్చు. ఇవి చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా.. గేమింగ్‌లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయి. అటు కెమెరాతో ఫొటోలు తీసుకుంటూ, ఇటు ఖాళీ టైమ్‌లో గేమ్స్ ఆడుకునే వారికి ఇవి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి.

Also Read: అబ్బా.. ఏం ఆఫర్ రా బాబు, Google Pixel 10 ఫోన్ ఇంత తక్కువకా? ఈ బంపర్ ఆఫర్‌ను మిస్ చేసుకోవద్దు!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×