E-Paper
Advertisement

టయోటా హైబ్రిడ్ ధరపై గందరగోళం.. ప్రకటనలో ఒక ధర, వెబ్‌ సైట్‌ లో మరో ధర!

టయోటా హైబ్రిడ్ ధరపై గందరగోళం.. ప్రకటనలో ఒక ధర, వెబ్‌ సైట్‌ లో మరో ధర!
Advertisement

Toyota Hybrid Price Confusion: టయోటా అర్బన్ క్రూయిజర్ హైబ్రిడ్‌కు సంబంధించి కంపెనీ తాజాగా ఇచ్చిన పేపర్ యాడ్ కొనుగోలుదారుల్లో గందరగోళాన్ని క్రియే చేసింది. పత్రికలో వచ్చిన ప్రకటనలో ఒక ధరను చూపించగా, కంపెనీ అధికారిక వెబ్‌ సైట్‌లో మరో ధరను చూపించారు. చాలా మంది వినియోగదారులు అసలు హైబ్రిడ్ వేరియంట్ ధర ఎంత? అని తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు.

ఇంతకీ అసలు ఏం జరిగింది?

టయోటా తాజాగా విడుదల చేసిన ప్రకటనలో హైబ్రిడ్ ఎలక్ట్రిక్ అడ్వాంటేజ్ ను హైలైట్ చేశారు. ఇందులో లీటరుకు 27.97 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని వెల్లడించారు. అదే సమయంలో కారు ప్రారంభ ధర రూ.10.99 లక్షలు అని ప్రకటించారు. ఈ యాడ్ చూసి చాలా మంది ఈ ధర హైబ్రిడ్ వేరియంట్‌ కే అనుకుని ఆసక్తి చూపించారు. అయితే, టయోటా అధికారిక వెబ్‌ సైట్‌లో ఉన్న వివరాలు చూసి షాక్ అవుతున్నారు. అక్కడ స్ట్రాంగ్ హైబ్రిడ్ శ్రేణిలోని ఎంట్రీ లెవల్ S e-Drive 2WD వేరియంట్ ధర రూ.16.77 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతోందని ప్రకటించారు. అలాగే టాప్ వేరియంట్ల ధరలు రూ.18.78 లక్షల నుంచి రూ.18.98 లక్షల వరకు ఉన్నాయి. అంటే, ప్రకటనలో చూపిన రూ.10.99 లక్షల ధరకు, అసలు హైబ్రిడ్ ధరకు దాదాపు రూ.6 లక్షల తేడా ఉంది.

ఇంతకీ తప్పు ఎవరిది?

Advertisement

ధరలో వ్యత్యాసానికి ప్రధాన కారణం ప్రకటనలో చూపిన ధర హైబ్రిడ్ మోడల్‌ ది కాకపోవడమే. రూ.10.99 లక్షలు అనేది సాధారణ పెట్రోల్, నియో డ్రైవ్ వేరియంట్‌కు సంబంధించిన ప్రారంభ ధరగా తెలుస్తోంది. కానీ, యాడ్ లో హైబ్రిడ్ ఫీచర్లను హైలైట్ చేస్తూనే ఆ ధరను చూపించడం వల్ల వినియోగదారులు అయోమయంలో పడుతున్నారు. ఈ యాడ్ లో ఛార్జింగ్ అవసరం లేదు,  తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, సెల్ఫ్ ఛార్జింగ్ బ్యాటరీ, ఎక్కువ మైలేజ్ లాంటి హైబ్రిడ్ బెనిఫిట్స్ ను పెద్దగా కనిపించేలా చేశారు. సాధారణంగా చూసే వారికి ఇది హైబ్రిడ్ మోడల్‌కు సంబంధించిన ధరే అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఆ ధర బేస్ పెట్రోల్ వేరియంట్‌కు సంబంధించినది.

టయోటా తీరుపై వినియోగదారుల ఆగ్రహం

టెక్నికల్ గా చూస్తే టయోటా తప్పు చేసినట్లు చెప్పలేం. ఎందుకంటే, ధర వివరాలు వేరియంట్ ఆధారంగా ఉంటాయని చిన్న అక్షరాల్లో రాసి ఉంటుంది. అయినప్పటికీ, యాడ్ రూపొందించిన తీరు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉందని కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి  ఇది ఆటోమొబైల్ రంగంలో తరచుగా కనిపించే మార్కెటింగ్  ట్రిక్ ఇది. కంపెనీలు తక్కువ ప్రారంభ ధరను పెద్దగా ప్రచారం చేస్తూ, అదే సమయంలో అధిక ఫీచర్లు ఉన్న ఖరీదైన వేరియంట్లను చూపిస్తుంటాయి. దీంతో వినియోగదారులు షోరూమ్‌కి వెళ్లాక అసలు ధర తెలుసుకుని ఆశ్చర్యపోతారు. అందుకే, కారు కొనుగోలు చేయాలనుకునే వారు ఇలాంటి ప్రకటనలను చూసి వెంటనే నిర్ణయం తీసుకోకుండా, కంపెనీ అధికారిక వెబ్‌ సైట్‌ లో వేరియంట్ల ధరలు, ఫీచర్లు స్పష్టంగా చూసుకోవడం మంచిది.

Advertisement

Read Also: త్వరలో 4 క్రేజీ ఈవీల ఎంట్రీ.. మార్కెట్‌ షేక్ అవ్వాల్సిందే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×