E-Paper
Advertisement

Best Induction Stove: బెస్ట్ ఇండక్షన్ అంటే ఏయే ఫీచర్లు ఉండాలి? ఎలాంటి పాత్రలు వాడాలి? పూర్తి వివరాలివే!

Best Induction Stove: బెస్ట్ ఇండక్షన్ అంటే ఏయే ఫీచర్లు ఉండాలి? ఎలాంటి పాత్రలు వాడాలి? పూర్తి వివరాలివే!
Advertisement

Best Induction Stove:  మారుతున్న కాలంతో పాటు మన వంటగది కూడా స్మార్ట్‌గా మారిపోతోంది కదా. ప్రస్తుత గ్యాస్ కొరత వలన సిలిండర్ ఖాళీ అయిపోతుందన్న టెన్షన్ లేకుండా, బుకింగ్ కోసం ఎదురుచూడాల్సిన పని లేకుండా చాలామంది ఇండక్షన్ స్టవ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, మార్కెట్లో చాలా రకాల ఇండక్షన్ స్టవ్‌లు కనిపిస్తాయి. మరి వాటిలో ఏది మంచిది? కొనేముందు చూసుకోవాల్సిన ముఖ్యమైన ఫీచర్లు ఏవి.. వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఎలాంటి గిన్నెలు వాడాలి?

ఇండక్షన్ స్టవ్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే.. దీని మీద అన్ని రకాల పాత్రలు పని చేయవు. గిన్నె అడుగు భాగం ఫ్లాట్‌గా ఉండాలి. ముఖ్యంగా ఆ గిన్నెకు అయస్కాంతం అంటుకుంటేనే అది ఇండక్షన్‌పై వేడెక్కుతుంది. అందుకే ఇనుము లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ గిన్నెలు దీనికి పక్కాగా సెట్ అవుతాయి. అలాగే మరీ చిన్నవి కాకుండా కనీసం 4 అంగుళాల నుండి 12 అంగుళాల సైజులో ఉండే గిన్నెలు వాడితే స్టవ్ వెంటనే రిసీవ్ చేసుకుంటుంది.

Advertisement

Also Read: ల్యాప్‌టాప్ రేంజ్ ప్రాసెసర్, అదిరిపోయే బ్యాటరీ.. మార్కెట్లోకి షియోమీ 17 ఫోన్ వచ్చేసింది!

ఏ సైజు ఇండక్షన్ స్టవ్ తీసుకోవాలి?

మీ ఇంట్లో ఎంతమంది మనుషులు ఉన్నారనే దాన్ని బట్టి ఇండక్షన్ పవర్‌ను ఎంచుకోవాలి. మీరు పెద్ద ఫ్యామిలీ అయితే 2000 వాట్స్ స్టవ్ తీసుకోండి. అప్పుడే వంట త్వరగా పూర్తవుతుంది. చిన్న కుటుంబాలకు అయితే 1500 వాట్స్ సరిపోతుంది. లోపల కాపర్ వైరింగ్ ఉన్న స్టవ్ తీసుకుంటే వేడి అంతా సమానంగా పంపిణీ అయి, వంట రుచిగా ఉంటుంది.

సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయా లేదా?

Advertisement

వంట చేసేటప్పుడు సేఫ్టీ చాలా ముఖ్యం. అందుకే ఆటోమేటిక్ షట్ ఆఫ్ (గిన్నె తీయగానే ఆగిపోవడం), ఓవర్ హీట్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయో లేదో చూసుకోండి. ఇక ఇప్పుడు వస్తున్న వాటిలో పాలు కాచడానికి, దోశలు వేయడానికి ఇలా రకరకాల వంటలకు సరిపోయేలా బటన్స్ ఇస్తున్నారు. టైమర్ సెట్ చేసుకునే సదుపాయం ఉంటే, వంట మాడిపోతుందన్న భయం లేకుండా మనం వేరే పనులు చూసుకోవచ్చు.

శుభ్రం చేయడం చాలా ఈజీ..

గ్యాస్ స్టవ్‌లను క్లీన్ చేయడం పెద్ద తలనొప్పి అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీని పైన ఉండే గ్లాస్ సర్ఫేస్‌ను తడి గుడ్డతో తుడిస్తే చాలు, తళతళలాడిపోతుంది. పైగా ఇవి చాలా తక్కువ బరువు ఉంటాయి కాబట్టి ఎక్కడికైనా సులభంగా పట్టుకెళ్లొచ్చు. క్రోంప్టన్ లాంటి కంపెనీల్లో ఇవి మన బడ్జెట్‌లోనే మంచి క్వాలిటీతో దొరుకుతున్నాయి.

Also Read: వన్‌ప్లస్ నుంచి కళ్లు చెదిరే స్మార్ట్‌ఫోన్.. ఐఫోన్ రేంజ్ ఫీచర్లు, ధర కూడా తక్కువ!

Related News

ఇంటర్నెట్ లేకపోయినా.. BSNL బ్యాలెన్స్, వ్యాలిడిటీ క్షణాల్లో తెలుసుకోండిలా!

కనిపించకుండా పోయిన వస్తువులను ఇట్టే వెతికి పట్టుకోవచ్చు.. శాంసంగ్ నుంచి క్రేజీ డివైజ్!

అమెజాన్ దసరా ఆఫర్.. రూ. 45,000 లోపే యాపిల్ ఐప్యాడ్.. రూ. 20,000 లోపే టాప్ ఫోన్లు!

Samsung Galaxy S27 Ultraలో స్నాప్‌డ్రాగన్‌కు నో ఎంట్రీ.. కారణం ఎంటో తెలుసా?

వీఐ సంచలనం.. దేశంలో తొలి ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ లాంచ్.. డేటా షేరింగ్‌తోపాటు 10% డిస్కౌంట్!

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

Big Stories

Advertisement
×