E-Paper
Advertisement

Xiaomi 17 Series: ల్యాప్‌టాప్ రేంజ్ ప్రాసెసర్, అదిరిపోయే బ్యాటరీ.. మార్కెట్లోకి షియోమీ 17 ఫోన్ వచ్చేసింది!

Xiaomi 17 Series: ల్యాప్‌టాప్ రేంజ్ ప్రాసెసర్, అదిరిపోయే బ్యాటరీ.. మార్కెట్లోకి షియోమీ 17 ఫోన్ వచ్చేసింది!
Advertisement

Xiaomi 17 Series: వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘Xiaomi 17’ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. అద్భుతమైన కెమెరా పనితీరు, శక్తివంతమైన ప్రాసెసర్, వేగవంతమైన ఛార్జింగ్ ఫీచర్లతో కూడిన ఈ ఫోన్ టెక్ ప్రియులను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

అద్భుతమైన డిజైన్..

Xiaomi 17 స్మార్ట్‌ఫోన్ అటు లుక్ పరంగా, ఇటు మన్నిక పరంగా అత్యుత్తమ ప్రమాణాలతో రూపొందించబడింది. కేవలం 8.06mm మందం, 191 గ్రాముల బరువుతో ఉండే ఈ ఫోన్‌లో 6.3 అంగుళాల OLED డిస్‌ప్లేను అమర్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. తద్వారా ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రక్షణ కోసం షియోమీ షీల్డ్ గ్లాస్ 3.0, నీటి నుంచి రక్షణ కోసం IP68/69 రేటింగ్‌ను దీనికి జోడించారు.

నిమిషాల్లో ఫుల్ ఛార్జ్..

Advertisement

ఈ ఫోన్ పనితీరు విషయానికి వస్తే.. దీనిలో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది మల్టీ టాస్కింగ్, గేమింగ్‌ను సులభతరం చేస్తుంది. 6330mAh భారీ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఫోన్ చాలా తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. అలాగే వేడిని తగ్గించడానికి ఇందులో అధునాతన ఐస్ లూప్ కూలింగ్ సిస్టం కూడా ఉంది.

Also Read: మీ వాట్సాప్‌లో ఈ మార్పును గమనించారా? కమ్యూనిటీ ట్యాబ్ మాయం, ఎందుకో తెలుసా?

లైకా ఆప్టిక్స్‌తో కెమెరా..

Advertisement

ఇక ఫొటోగ్రఫీ ప్రియుల కోసం షియోమీ, లైకా సంయుక్తంగా ఈ కెమెరా సెటప్‌ను రూపొందించాయి. వెనుక వైపు మూడు 50MP కెమెరాల సెటప్ ఉంది. దీనిలో లైట్ ఫ్యూజన్ 950 సెన్సార్‌తో కూడిన మెయిన్ కెమెరా, టెలిఫొటో, అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో కూడా 50MP కెమెరాను అందించారు. ఈ ఫోన్ ద్వారా 8K వీడియోలతో పాటు 4K డాల్బీ విజన్ రికార్డింగ్‌ను కూడా చేసుకోవచ్చు.

అత్యాధునిక ఫీచర్లు..

ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3 ద్వారా ఈ ఫోన్ నడుస్తుంది. దీనిలో సరికొత్త AI ఫీచర్లను షియోమీ ప్రవేశపెట్టింది. AI రైటింగ్, డైనమిక్ వాల్‌పేపర్స్, AI సెర్చ్ వంటి ఫీచర్లు వినియోగదారులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. ఇవి రోజువారీ పనులను మరింత వేగంగా, స్మార్ట్‌గా పూర్తి చేయడానికి సహకరిస్తాయి.

ధర వివరాలు..

భారతదేశంలో Xiaomi 17 బేస్ వేరియంట్ 12GB+256GB ధర రూ.89,999 కాగా, 512GB వేరియంట్ ధర రూ.99,999గా ఉంది. అయితే లాంచ్ ఆఫర్‌లో భాగంగా 512GB ఫోన్‌ను 256GB ధరకే పొందే అవకాశం ఉంది. మార్చి 18 నుండి అమెజాన్, రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉండే ఈ ఫోన్‌తో పాటు గూగుల్, యూట్యూబ్, జియో నుంచి పలు ఉచిత ప్రయోజనాలు లభిస్తాయి.

Also Read: AIతో వచ్చిన తిప్పలు.. 35% పెరగనున్న ల్యాప్‌టాప్ ధరలు!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×