E-Paper
Advertisement

OnePlus Nord 6: వన్‌ప్లస్ నుంచి కళ్లు చెదిరే స్మార్ట్‌ఫోన్.. ఐఫోన్ రేంజ్ ఫీచర్లు, ధర కూడా తక్కువ!

OnePlus Nord 6: వన్‌ప్లస్ నుంచి కళ్లు చెదిరే స్మార్ట్‌ఫోన్.. ఐఫోన్ రేంజ్ ఫీచర్లు, ధర కూడా తక్కువ!
Advertisement

OnePlus Nord 6: ప్రముఖ బ్రాండ్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. గతేడాది జూలైలో మార్కెట్లోకి వచ్చిన నార్డ్ 5 సక్సెస్‌ను కొనసాగిస్తూ, త్వరలో ‘OnePlus Nord 6’ ను ఇండియన్ మార్కెట్లోకి దించనుంది. తాజా లీక్స్ ప్రకారం, ఈ ఫోన్ ఏప్రిల్ నెలలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చైనాలో ఇప్పటికే విడుదలై సంచలనం సృష్టించిన వన్‌ప్లస్ టర్బో 6 మోడల్‌కు ఇది రీబ్రాండెడ్ వెర్షన్‌గా రానుందని తెలుస్తోంది.

గేమింగ్ ప్రియలకు పండగే..

సాధారణంగా వన్‌ప్లస్ తన Nord సిరీస్ ఫోన్లను చైనాలోని టర్బో మోడల్స్ ఆధారంగానే డిజైన్ చేస్తుంది. అదే పద్ధతిలో నార్డ్ 6 కూడా పవర్‌ఫుల్ ఫీచర్లతో వస్తోంది. దీనిలో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ స్క్రీన్‌ను అమర్చినట్లు సమాచారం. ముఖ్యంగా గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా 165Hz రిఫ్రెష్ రేట్, సూర్యకాంతిలో కూడా స్పష్టంగా కనిపించేలా 1,800 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందించారు. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌తో రానున్న ఈ ఫోన్, మల్టీ టాస్కింగ్ కోసం 16GB వరకు RAM, 512GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.

Advertisement

Also Read: ల్యాప్‌టాప్ రేంజ్ ప్రాసెసర్, అదిరిపోయే బ్యాటరీ.. మార్కెట్లోకి షియోమీ 17 ఫోన్ వచ్చేసింది!

50 మెగాపిక్సల్ కెమెరా..

ఇక ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. OnePlus Nord 6 ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను అమర్చారు. అయితే చైనా వెర్షన్‌లో ఉన్న మోనోక్రోమ్ లెన్స్‌కు బదులుగా, భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను జోడించే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ సరికొత్త సెన్సార్‌ను వాడొచ్చు. ఇక ఈ ఫోన్ హైలైట్ ఏదైనా ఉందంటే అది దాని బ్యాటరీనే. ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీతో పాటు 80W సూపర్ ఊక్ ఛార్జింగ్ సదుపాయం దీని సొంతం.

ధర ఎంతంటే?

Advertisement

ఫీచర్లు భారీగా మారుతుండటంతో నార్డ్ 5 ధరతో పోలిస్తే నార్డ్ 6 ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నార్డ్ 5 ప్రారంభ ధర రూ.31,999 ఉండగా, తాజా మోడల్ అంతకంటే ఎక్కువ ధరకే అందుబాటులోకి రావచ్చు. ఇప్పటికే పలు సర్టిఫికేషన్ సైట్లలో ఈ ఫోన్ కనిపిస్తుండటంతో, దీని అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: మీ వాట్సాప్‌లో ఈ మార్పును గమనించారా? కమ్యూనిటీ ట్యాబ్ మాయం, ఎందుకో తెలుసా?

Tags

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×