Best Induction Cooktop Under 2000: ప్రస్తుతం చాలా మంది ఇండక్షన్‌లు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గ్యాస్ స్టౌవ్‌తో పోలిస్తే ఇవి త్వరగా వంట చేయటానికి ఉపయోగపడటమే కాకుండా కరెంట్ ఖర్చును కూడా చాలా వరకు తగ్గిస్తాయి. ముఖ్యంగా హాస్టల్‌లో ఉండే విద్యార్థులు, బ్యాచిలర్స్ లేదా చిన్న చిన్న కుటుంబాలకు ఇండక్షన్ స్టౌవ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. మార్కెట్లో రూ. 2000 లోపు కూడా మంచి ఫీచర్లు, సేఫ్టీ ఆప్షన్స్, ఉన్న మోడల్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అలాంటి టాప్ 5 ఇండక్షన్ కుక్‌టాప్‌ల గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1. Prestige Xpress 1200W:
ప్రెస్టేజ్ బ్రాండ్ కిచెన్ అప్లయెన్సెస్ తయారీలో ముందుంది. ఈ బ్రాండ్ కు కూడా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది . ఈ Prestige Xpress 1200W ఇండక్షన్ కుక్‌టాప్ చిన్న చిన్న కుటుంబాలకు లేదా హాస్టల్ లో వాడుకోవడానికి సరైన ఎంపికగా చెప్పుకోవచ్చు. ఇది 1200వాట్ పవర్‌తో పనిచేస్తుంది. కాబట్టి రోజువారీ వంటలైన రైస్, కర్రీ, టీ, మ్యాగీ వంటి వంటలు దీనిలో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ మోడల్‌లో పుష్ బటన్ కంట్రోల్ సిస్టమ్ ఉండటం వల్ల వాడటం చాలా ఈజీగా ఉంటుంది. ప్రీసెట్ కుకింగ్ మెనూలు ఉండటం వల్ల వివిధ రకాల వంటలు త్వరగా చేయొచ్చు. అంతే కాకుండా ఆటో షట్‌డౌన్ , ఓవర్‌హీట్ ప్రొటెక్షన్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ధర: రూ.1500 – రూ.1600
2. Philips 1300W:
Philips కంపెనీకి చెందిన ఈ ఇండక్షన్ కుక్‌టాప్ మంచి క్వాలిటీ , డ్యూరబిలిటీతో ఉంటుంది. ఇది 1300W పవర్‌తో పనిచేస్తుంది. ఫలితంగా వేగంగా వంట చేయడానికి సహాయ పడుతుంది. మైక్రో క్రిస్టల్ గ్లాస్ ప్లేట్ ఉండటం వల్ల ఇది స్ట్రాంగ్2గా ఉండటమే కాకుండా సులభంగా శుభ్రం చేయడానికి వీలుగా కూడా ఉంటుంది. ఈ ఇండక్షన్ కుక్‌టాప్‌లో మల్టిపుల్ పవర్ సెట్టింగ్స్ ఉంటాయి. వంటకు అవసరమైన టెంపరేచర్‌ను సులభంగా దీనిలో నియంత్రించవచ్చు. అదనంగా ఆటో స్టాండ్‌బై ఫంక్షన్, కూలింగ్ ఫ్యాన్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా దీని డిజైన్ కూడా చాలా స్లిమ్ , స్టైలిష్‌గా ఉంటుంది.
ధర:రూ.1800 –రూ.1900
3. Pigeon Thunder:
బడ్జెట్ సెగ్మెంట్‌లో Pigeon బ్రాండ్ ఇండక్షన్ స్టౌవ్స్ చాలా పాపులర్. Pigeon Thunder ఇండక్షన్ కుక్‌టాప్ 1800W పవర్‌తో వస్తుంది. ఇది ఎక్కువ పవర్ కలిగి ఉండటం వల్ల వేగంగా వంట చేయడానికి సహాయ పడుతుంది. ఈ మోడల్‌లో ఎల్ఈడీ డిస్ప్లే, టచ్ కంట్రోల్, టైమర్ ఫీచర్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఆటో పాన్ డిటెక్షన్, ఓవర్‌హీట్ ప్రొటెక్షన్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని బాడీ హీట్ రెసిస్టెంట్ మెటీరియల్‌తో తయారు చేసారు కాబట్టి ఎక్కువకాలం ఉపయోగించవచ్చు.
ధర: సుమారు రూ.1100 – రూ.1300
Also Read: ఇండక్షన్ స్టౌ గురించి 10 సీక్రెట్స్ .. చాలా మందికి తెలియని నిజాలు !
4. V-Guard VIC01 V2 1200W:
V-Guard కంపెనీ ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్‌లో మంచి పేరు సంపాదించింది. ఈ ఇండక్షన్ కుక్‌టాప్ 1200W పవర్‌తో పనిచేస్తుంది. రోజువారీ వంటలకు సరిపడే పవర్ , ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ మోడల్‌లో టెంపరేచర్ కంట్రోల్ ,టైమర్ సెట్టింగ్స్ ఉంటాయి. అదనంగా ఆటో షట్‌డౌన్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది ఎనర్జీ ఎఫిషియెంట్‌గా ఉండటం వల్ల కరెంట్ వాడకం తక్కువగా ఉంటుంది. దీని గ్లాస్ టాప్ కూడా బలంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు ఉపయోగించుకోవచ్చు.
ధర: సుమారు రూ.1600 – రూ.1700
Also Read: హెల్తీ లైఫ్ కోసం బెస్ట్ స్మూతీ బ్లెండర్స్.. ఈ 5 తెలిస్తే ఇక జ్యూస్ సెంటర్‌కి వెళ్లరు!
5. Lifelong 2100W:
Lifelong కంపెనీ బడ్జెట్ కిచెన్ అప్లయెన్సెస్‌లో బెస్ట్. ఈ ఇండక్షన్ కుక్‌టాప్ 2100W పవర్‌తో వస్తుంది. ఇతర మోడల్స్‌తో పోలిస్తే.. ఇది ఎక్కువ పవర్ కలిగి ఉండటం వల్ల వంట వేగంగా పూర్తవుతుంది. ఈ మోడల్‌లో డిజిటల్ డిస్ప్లే, మల్టిపుల్ కుకింగ్ మోడ్‌లు, టచ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా.. ఆటో షట్‌డౌన్, ఓవర్‌హీట్ ప్రొటెక్షన్, చైల్డ్ సేఫ్టీ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దీని కాంపాక్ట్ డిజైన్ వల్ల ఎక్కడైనా తీసుకెళ్లడం సులభం.
ధర: సుమారు రూ.1700 – రూ.1900