Best Smoothie Blenders: ఈరోజుల్లో చాలా మంది ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఫిట్‌నెస్, డైట్, వెయిట్ లాస్ కోసం స్మూతీలు, ఫ్రూట్ జ్యూస్‌లు, ప్రోటీన్ షేక్స్ వంటి డ్రింక్స్ రోజూ తీసుకుంటున్నారు. ఇవి త్వరగా తయారు చేయడానికి మంచి స్మూతీ బ్లెండర్ అవసరం అవుతుంది. మంచి బ్లెండర్ ఉంటే ఐస్, ఫ్రోజెన్ ఫ్రూట్స్, నట్స్ లాంటి కఠినమైన పదార్థాలను కూడా సింపుల్‌గా గ్రైండ్ చేయవచ్చు. మార్కెట్లో ఎన్నో మోడల్స్ ఉన్నప్పటికీ.. వాటి పనితీరు, కరెంట్ వాడకం, ధర వంటి అంశాల ఆధారంగా టాప్ 5 బెస్ట్ స్మూతీ బ్లెండర్లు ఏవి ? వాటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. Ninja Professional Plus Blender with Auto‑iQ BN701:
ఈ బ్లెండర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండే మోడల్. 1400W మోటార్ వల్ల ఐస్, ఫ్రూట్స్ కూడా సులభంగా గ్రైండ్ అవుతాయి. ఇందులో ఉన్న Auto-IQ టెక్నాలజీ వల్ల ఒక బటన్ నొక్కితే సరిపోతుంది, బ్లెండింగ్ ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. దీనికిపెద్ద జార్ ఉండటం వల్ల ఫ్యామిలీకి సరిపడా స్మూతీలు ఒకేసారి తయారు చేయవచ్చు.
2. NutriBullet Pro 900 Blender:
NutriBullet Pro 900 చిన్న సైజ్‌లో ఉండే పర్సనల్ స్మూతీ బ్లెండర్. 900W పవర్ మోటార్ ఉండటం వల్ల ఫ్రూట్స్, నట్స్, ఐస్ వంటి వాటిని కూడా ఇది సులభంగా గ్రైండ్ చేస్తుంది. కాంపాక్ట్ డిజైన్ ఉండటం వల్ల చిన్న కిచెన్లలో కూడా ఈజీగా ఉపయోగించవచ్చు. ట్రావెల్ కప్‌తో రావడం వల్ల స్మూతీని బయటకు తీసుకెళ్లడం కూడా సౌకర్యంగా ఉంటుంది.
3. Kuvings Nutri Blender Pro 1000W:
Kuvings Nutri Blender Pro ఎక్కువ పవర్‌తో పని చేసే ప్రీమియం బ్లెండర్. 1000W మోటార్ , స్ట్రాంగ్ స్టీల్ బ్లేడ్స్ ఉండటం వల్ల స్మూతీలు చాలా స్మూత్ టెక్స్చర్‌తో తయారవుతాయి. రెండు జార్లు ఉండటం వల్ల ఒకేసారి వేర్వేరు జ్యూస్‌లు తయారు చేయవచ్చు. రోజూ హెల్తీ డ్రింక్స్ తీసుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్..
4. Lifelong Regalia Nutri Mixer/Grinder/Blender:
Lifelong Regalia బడ్జెట్‌లో బాగా పనిచేసే బ్లెండర్. ఇది స్మూతీలు, జ్యూసులు మాత్రమే కాకుండా మసాలా గ్రైండింగ్‌కు కూడా ఉపయోగపడుతుంది. సింపుల్ డిజైన్ , మంచి పవర్ మోటార్ ఉండటం వల్ల స్టూడెంట్స్ లేదా చిన్న కుటుంబాలకు ఇది బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. అంతే కాకుండా ఇది తక్కువ ధరలో ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది.
Also Read: ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ భలే స్మార్ట్.. ఒకేసారి అన్నం, పప్పు, కూర వండేయొచ్చు
5. Pigeon Pure Grinder Juicer:
Pigeon Pure బ్లెండర్ తక్కువ ధరలో లభించే స్మూతీ మేకర్. కాంపాక్ట్ డిజైన్ , సింపుల్ గా ఉండటం వల్ల మొదటిసారి బ్లెండర్ కొనేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. తక్కువ కరెంట్ వాడకంతోనే ఫ్రూట్ జ్యూస్, స్మూతీలు సులభంగా తయారు చేయవచ్చు.
మంచి స్మూతీ బ్లెండర్ కొనేటప్పుడు చూడాల్సిన అంశాలు:
స్మూతీ బ్లెండర్ కొనేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలు గమనించాలి. ముందుగా మోటార్ పవర్ కనీసం 500W పైగా ఉండాలి. అప్పుడు ఫ్రోజెన్ ఫ్రూట్స్ , ఐస్ కూడా సులభంగా గ్రైండ్ అవుతాయి. స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ ఉండటం మంచిది. కుటుంబ సభ్యులను బట్టి సరైన జార్ కెపాసిటీ ఉండాలి. అలాగే క్లీన్ చేయడం సులువుగా ఉండే అంతే కాకుండా వారంటీ ఉన్న మంచి బ్లెండర్లు ఎంచుకోవడం ముఖ్యం.
Also Read: గ్యాస్ కంటే చౌకగా ఇండక్షన్‌పై వంట.. గంట వాడితే ఎంత ఖర్చవుతుందంటే ?