E-Paper
Advertisement

Prestige Electro Duo: గ్యాస్ స్టవ్‌కు పోటీగా డబుల్ ఇండక్షన్.. ఎల్‌పీజీ కొరత‌ను వాడేసుకుంటున్న ప్రెస్టీజ్ కంపెనీ!

Prestige Electro Duo: గ్యాస్ స్టవ్‌కు పోటీగా డబుల్ ఇండక్షన్.. ఎల్‌పీజీ కొరత‌ను వాడేసుకుంటున్న ప్రెస్టీజ్ కంపెనీ!
Advertisement

పిల్లల లంచ్ బాక్స్ కోసమో.. ఆఫీసుకి వెళ్లేవాళ్ల కోసమో హడావిడిగా వంట చేస్తున్నప్పుడు మధ్యలో గ్యాస్ అయిపోతే ఎంత చిరాకు వస్తుంది కదా! అందుకే ఇప్పుడు చాలామంది ఇండక్షన్ స్టవ్‌లను ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. కానీ, ఈ స్టవ్‌లతో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే.. దీనిపై ఒక పాత్ర మాత్రమే పెట్టే వీలుంది. ఇప్పుడీ సమస్యకు చెక్ పెడుతూ మార్కెట్లోకి వచ్చేసింది ఈ ‘ప్రెస్టీజ్ ఎలక్ట్రో డ్యూయో’. ఇది అచ్చం గ్యాస్ స్టవ్ లాంటిదే. అంటే.. రెండు బర్నర్లు ఉన్నట్లుగా దీనికి ఒక వైపు ఇండక్షన్ ఉంటుంది. ఇంకో వైపు ఇన్‌ఫ్రారెడ్ ఉంటుంది. దీనివల్ల రెండు పాత్రలు పెట్టుకుని ఒకేసారి వంటను వేగంగా పూర్తి చేయొచ్చు.

ఒకేసారి రెండు వంటలు:

మరో విశేషం ఏమిటంటే.. ఈ ప్రెస్టీజ్ ఎలక్ట్రో డ్యూయోపై ఇలాంటి గిన్నెలే పెట్టాలనే రూల్ ఏం లేదు. ఇందులో ఇండక్షన్, ఇన్‌ఫ్రారెడ్ అనే రెండు ఆప్షన్లు ఉండటం వల్ల ఒకవైపు ఇండక్షన్ పాత్రలను వాడుతూనే, మరోవైపు మన ఇంట్లో ఉండే సాధారణ పాత్రలను కూడా వాడుకోవచ్చు. అల్యూమినియం దగ్గరి నుంచి మట్టి పాత్రల వరకూ అన్ని రకాల గిన్నెలనూ దీనిపై పెట్టేయొచ్చు. దీంతో కొత్త పాత్రలు కొనే బాధ తప్పుతుంది. ఎంచక్కా మన వంటింట్లో ఉండే ఏ గిన్నెనైనా వంట కోసం వాడేయొచ్చన్నమాట. ఈ ఆప్షన్ నిజంగా చాలా బాగుంది కదా.

Advertisement

Also Read: బెస్ట్ ఇండక్షన్ అంటే ఏయే ఫీచర్లు ఉండాలి? ఎలాంటి పాత్రలు వాడాలి? పూర్తి వివరాలివే!

పాత్ర ఏదైనా.. వంట అదుర్స్:

చాలామంది ఇండక్షన్ స్టవ్ కొన్న తర్వాత కొత్త గిన్నెలు కొనాల్సి వస్తుందని వెనకడుగు వేస్తారు. కానీ ఈ ఎలక్ట్రో డ్యూయో ఉంటే ఆ టెన్షన్ అక్కర్లేదు. మీ దగ్గర ఉన్న అల్యూమినియం గిన్నెలు, స్టీల్ పాత్రలు, చివరికి మట్టి పాత్రలు కూడా ఇన్‌ఫ్రారెడ్ సైడ్‌పై వాడుకోవచ్చు. దీంతో ఎలాంటి ఖర్చు లేకుండానే మన వంటగదిలో ఉన్న పాత పాత్రలనే వంటకు వాడేయొచ్చు. పాత్ర ఏదైనా సరే.. వంట మాత్రం పక్కాగా అవుతుంది.

బ్యాచిలర్స్‌కు బెస్ట్ ఆప్షన్:

Advertisement

ఈ కుక్‌టాప్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, వంట కూడా అంతే వేగంగా చేస్తుంది. ఇండక్షన్ భాగం నీటిని వేడి చేయడానికి లేదా త్వరగా వంట పూర్తి చేయడానికి పనికొస్తే, ఇన్‌ఫ్రారెడ్ భాగం చపాతీలు కాల్చడానికి, గ్రిల్లింగ్ లాంటి పనులకు అద్భుతంగా సెట్ అవుతుంది. కంట్రోల్స్ కూడా చాలా సింపుల్‌గా ఎవరికైనా అర్థమయ్యేలా ఉంటాయి. అందుకే ఇది బ్యాచిలర్స్ నుంచి బిగ్ ఫ్యామిలీస్ వరకు అందరికీ ఉపయోగపడే స్మార్ట్ గ్యాడ్జెట్ అని చెప్పొచ్చు.

ధరెంత, ఎక్కడ కొనాలి?

మరి ఇంత కంఫర్ట్ ఇచ్చే ఈ ప్రెస్టీజ్ ఎలక్ట్రో డ్యూయో ధర ఎంత ఉంటుంది అనే కదా మీ డౌట్? సాధారణంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ స్టోర్లలో దీని ధర సుమారు రూ.5,000 నుంచి రూ. 6,500 మధ్యలో అందుబాటులో ఉంటుంది. ఆఫర్లను బట్టి ఈ ధరలో మార్పులు ఉండవచ్చు. మీరు నేరుగా ప్రెస్టీజ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో లేదా మీకు దగ్గరలో ఉన్న గ్యాడ్జెట్ షోరూమ్‌లలో కూడా దీన్ని చెక్ చేయవచ్చు. ప్రస్తుతం దీనికి ఉన్న డిమాండ్ వల్ల స్టాక్ అయిపోయింది. త్వరలోనే రీస్టాక్ చేసే అవకాశాలున్నాయి. ఇదంతా చూస్తుంటే గ్యాస్ స్టవ్ తరహాలోనే రోజువారీ వంటలో ఇండక్షన్ భాగమైపోయేలా ఉంది. అయితే, విద్యుత్ కొరత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాత్రం ఈ స్టవ్ వాడటం కొంచెం ఇబ్బందితో కూడుకున్న విషయమే.

Also Read: అమెజాన్‌లో వాయిస్‌ సెర్చ్ ఫీచర్లతో బెస్ట్ 4K టీవీలు.. చిటికెలో మీకు నచ్చిన కంటెంట్!

ముఖ్యమైన గమనిక:

ప్రస్తుతం ఇండియాలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత కారణంగా.. సోషల్ మీడియాలో ఇలాంటి స్టవ్స్ ప్రత్యక్షం అవుతున్నాయి. అలాగే వాటిని కొనుగోలు చేసుకొనేందుకు లింక్స్ కూడా ఇస్తున్నారు. అయితే, మీరు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ లింక్స్, వాళ్లు చూపించే వీడియోలు ఫేక్ కూడా కావచ్చు. వాటిని నమ్మి క్లిక్ చేసి డబ్బులు చెల్లిస్తే.. మోసపోతారు. ప్రొడక్ట్ మీ ఇంటికి వచ్చి.. పనిచేస్తుందో లేదో చెక్ చేసుకొనే వరకు ఎలాంటి చెల్లింపులు చేయొద్దు. ఈ కథనం ముఖ్య ఉద్దేశం.. పాఠకులకు ఒక మంచి ప్రొడక్ట్ పరిచయం చెయ్యడమే. కాబట్టి.. సోషల్ మీడియాలో ట్రెండింగులో ఉన్న ఈ స్టవ్స్ వివరాలను మీకు చెబుతున్నాం. ఆయా సంస్థలతో బిగ్ టీవీ లైవ్ వెబ్ సైట్‌కు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి.. వీటిని కొనుగోలు చేసేప్పుడు జాగ్రత్తలు పాటించాలని మనవి.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే OPPO Enco Buds3 Pro..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న Thomson 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×