
Aishwarya Rajesh (Source: Instragram)
ఐశ్వర్య రాజేష్ .. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయం తెలుగు, తమిళ్ భాషల్లో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.

Aishwarya Rajesh (Source: Instragram)
ఈమె ఎవరో కాదు దివంగత సినీ నటుడు రాజేష్ కూతురు. సీనియర్ నటి లక్ష్మికి స్వయాన మేనకోడలు కూడా.. రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటించిన రాంబంటు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆకట్టుకుంది.

Aishwarya Rajesh (Source: Instragram)
ఇక టీనేజ్ కి వచ్చాక మళ్ళీ రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ పోషిస్తూ వచ్చిన కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా.. రాజేంద్రప్రసాద్ కూతురిగా వెండితెరకు పరిచయమైంది ఐశ్వర్య రాజేష్.

Aishwarya Rajesh (Source: Instragram)
ఇక తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తమిళంలోనే వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ఐశ్వర్య .. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Aishwarya Rajesh (Source: Instragram)
ప్రస్తుతం అడపదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఐశ్వర్య రాజేష్.. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా అందాలు ఆరబోస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

Aishwarya Rajesh (Source: Instragram)
అందులో భాగంగానే చీర కట్టుకొని నడుము అందాలతో గ్లామర్ టచ్ ఇచ్చింది ఐశ్వర్య రాజేష్. ఈ తెలుగు అమ్మాయి అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.