E-Paper
Advertisement

Big Tv Kissik Talks: ఏడో తరగతిలోనే లైంగిక వేధింపులు.. క్యాస్టింగ్ కౌచ్ పై శ్రీ సత్య కామెంట్స్!

Big Tv Kissik Talks: ఏడో తరగతిలోనే లైంగిక వేధింపులు.. క్యాస్టింగ్ కౌచ్ పై శ్రీ సత్య కామెంట్స్!
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ప్రతివారం ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలు పాల్గొంటూ వారికి సంబంధించిన విషయాల గురించి మాత్రమే కాకుండా ప్రతి సమాజంలో జరుగుతున్న అంశాల గురించి మాట్లాడుతూ వారి అభిప్రాయాలను తెలియజేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎక్కువగా పిల్లల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి అంశాల గురించి ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తావిస్తూ అవగాహన కల్పిస్తున్నారనే చెప్పాలి.

శ్రీ సత్యకు తప్పని క్యాస్టింగ్ కౌచ్..

ఇకపోతే ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా నటి శ్రీ సత్య(Sri Satya) పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా చిన్నపిల్లల పట్ల లైంక వేధింపుల గురించి అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్(Casting Couch) గురించి ఈమెకు ప్రశ్నలు ఎదురవడంతో శ్రీ సత్య తన అభిప్రాయాలను తెలియజేస్తూ అలాగే తనకు జరిగిన సంఘటనలు గురించి కూడా ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది కాస్టింగ్ కౌచ్ బాధితులు తమ బాధను మొత్తం బయట పెట్టుకున్నారు.

ఇప్పటికీ ఫోన్ కాల్స్ వస్తుంటాయి..

Advertisement

ఈ నేపథ్యంలోనే శ్రీ సత్య కూడా ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను తెలియజేశారు. సినిమా ఇండస్ట్రీలో నేను కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నానని శ్రీ సత్య తెలిపారు. ఇప్పటికీ కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తాయని, అయితే ఎవరు కూడా ఈ విషయం గురించి నేరుగా అడగకుండా పరోక్షంగా అడుగుతుంటారని తెలిపారు. ఇండస్ట్రీలో తనుకు ఎదురైనా చేదు అనుభవాల గురించి కూడా తెలిపారు. తాను సినిమా అవకాశాల కోసం ఆడిషన్ చేసి ఫోటోషూట్లు చేసిన తర్వాత కూడా నన్ను సినిమాల నుంచి తప్పించారని తెలిపారు. ఇక కొన్ని షోలలో మేకప్ రూమ్ లో వెళ్లి మేకప్ వేసుకుంటున్నప్పుడు కూడా నా బ్యాగ్ తీసి బయటకు పడేసి ఎవరితో పడితే వాళ్లతో ఎందుకు షేర్ చేసుకుంటాం అంటూ అవమానించారని తెలిపారు.

Advertisement

ప్రస్తుతం సమాజంలో చిన్న పిల్లల పట్ల చాలామంది లైంగికంగా ఇబ్బంది పెడుతున్నారు. వాటిపై మీ అభిప్రాయం ఏంటంటే ప్రశ్న ఎదురవడంతో అది చాలా చండాలమని తెలిపారు. ఇప్పుడు చాలామంది అమ్మాయిల వస్త్రధారణ గురించి మాట్లాడుతున్నారు మరి చిన్న పిల్ల ఎలాంటి డ్రెస్ వేసుకుంటుంది అంటూ ఈమె కొంతమందికి కౌంటర్ ఇచ్చేలాగా మాట్లాడారు. మీ చిన్నప్పుడు ఇలాంటి సంఘటనలను విన్నారా అనే ప్రశ్న ఎదురవడంతో నన్నే చిన్నప్పుడు ఇబ్బందులు పెట్టారని తెలిపారు. నేను ఏడో తరగతిలో చదువుతున్నప్పుడు రోడ్డుమీద వెళ్తుంటే నడుము గిల్లి వెళ్లిపోయారు. అక్కడ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు కూడా ముందుకు వచ్చి ఆపలేకపోయారు అంటూ తనకు జరిగిన చేదు సంఘటనల గురించి ఈ సందర్భంగా బయటపెట్టారు.

Also Read: Big Tv Kissik Talks: పెళ్లి తర్వాత చేయాల్సినవి పెళ్లికి ముందే అవుతున్నాయి.. లివింగ్ రిలేషన్ పై శ్రీ సత్య హాట్ కామెంట్స్!

Related News

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Big Stories

Advertisement
×