E-Paper
Advertisement

Best Laptop Under 50000: ఏంటీ ? i7 ల్యాప్‌టాప్ రూ. 50 వేలకేనా? అది కూడా 16GB ర్యామ్‌తో! నమ్మడం కష్టమే..

Best Laptop Under 50000: ఏంటీ ? i7 ల్యాప్‌టాప్ రూ. 50 వేలకేనా? అది కూడా 16GB ర్యామ్‌తో! నమ్మడం కష్టమే..
Advertisement

Best Laptop Under 50000: ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? అదీ కూడా రూ. 50వేలలోపు i7 ప్రాసెసర్, 16GB RAMతో అంటే… కొంచెం కష్టమే కానీ అసాధ్యం కాదు. ఈ బడ్జెట్‌లో హై పెర్ఫార్మెన్స్ మోడళ్లు తక్కువగా ఉన్నా.. సరైంది ఎంచుకుంటే మీ పనులు చాలా ఈజీగా, స్మూత్‌గా పూర్తవుతాయి. చదువు, ఆఫీస్ వర్క్, మల్టీటాస్కింగ్ ఇలా అన్నింటికీ ఉపయోగపడే కొన్ని మంచి ఆప్షన్లు మార్కెట్‌లో ఉన్నాయి. ఇప్పుడు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న టాప్ 5 ల్యాప్‌ టాప్‌లను గురించి సింపుల్‌గా తెలుసుకుందాం.

రూ. 50,000 లోపు i7 + 16GB RAM ఉన్న 5 బెస్ట్ ల్యాప్‌టాప్ మోడల్స్ :
ప్రస్తుతం రూ.50,000 లోపు i7 ప్రాసెసర్, 16GB RAM కలిగిన ల్యాప్‌టాప్‌లు తక్కువగా ఉన్నప్పటికీ.. కొన్ని బ్రాండ్లు చాలా బాగా పనిచేసే మోడళ్లను అందిస్తున్నాయి. ఇవి ముఖ్యంగా.. స్టూడెంట్స్, ఆఫీస్ యూజర్లు, మల్టీటాస్కింగ్ కోసం అనుకూలంగా ఉంటాయి.

Advertisement

1. Infinix InBook Y2 Plus:
ఈ ల్యాప్‌టాప్ 11 జెనరేషన్ i7 ప్రాసెసర్‌తో వస్తుంది. 16GB RAM, 512GB స్టోరేజ్ అవకాశం ఉండటం వల్ల వేగంగా పని చేస్తుంది.మంచి డిజైన్, బ్యాటరీ దీని ప్రత్యేకత.స్టూడెంట్స్ అయితే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.ధర సుమారు రూ. 45,000 ఉంటుంది.

2. MSI Modern 14:
ఈ మోడల్ 12 జెనరేషన్ i7 ప్రాసెసర్‌తో ఉంటుంది. తక్కువ బరువు ఉండటం వల్ల దీనిని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. ఉద్యోగులకు ఇది బెస్ట్. ధర సుమారు రూ.48,000 వరకు ఉంటుంది.

Advertisement

3. Wings Nuvobook Pro:
ఈ ల్యాప్‌టాప్ తక్కువ ధరలో మంచి ఫీచర్లను అందిస్తుంది. రోజువారీ పనులు, ఆన్‌లైన్ క్లాసులు, బ్రౌజింగ్ వంటి వాటికి బెస్ట్ అని చెప్పొచ్చు.ధర సుమారు రూ. 43,000 ఉంటుంది.

4. Acer TravelMate Series:
ఈ మోడళ్లు బిజినెస్ కోసం చాలా బాగా ఉపయోగపడతాయి. ఎక్కువసేపు పని చేసే వారికి ఇది ఉపయోగకరం.ధర రూ. 37,000 వరకు ఉంటుంది.

5. Tecno Megabook T1:
ఈ ల్యాప్‌టాప్ 1TB స్టోరేజ్‌తో వస్తుంది. ఎక్కువ డేటా స్టోర్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్. ధర రూ. 38,000 వరకు ఉంటుంది.

Also Read: బ్లెండర్ వర్సెస్ మిక్సర్ గ్రైండర్.. మీ వంటగదికి ‘పర్ఫెక్ట్’ ఏది?

ఎలా ఎంచుకోవాలి?
ల్యాప్‌టాప్ కొనేటప్పుడు ప్రాసెసర్, మెమరీ , స్టోరేజ్, బ్యాటరీ లైఫ్ కు సంబంధించిన వివరాలను తప్ప కుండా చెక్ చేయాలి. మీరు స్టూడెంట్స్ అయినా లేదా ఆఫీస్ పనుల కోసం లాప్ టాప్ ఉపయోగించాలను కుంటే బ్యాటరీ ఎక్కువ సేపు ఉండే మోడల్ తీసుకోవడం మంచిది. ఎక్కువ సేపు పనులు చేస్తే వారం న్యూ జెనరేషన్ ప్రాసెసర్ ఉన్న మోడల్ తీసు కోవడం బెస్ట్.

రూ. 50,000 లోపు i7, 16GB RAM ఉన్న ల్యాప్‌టాప్‌లు Infinix, MSI, Dell వంటి బ్రాండ్లు బడ్జెట్‌ లో మంచి ఆప్షన్లు అందిస్తున్నాయి. మీ అవసరాన్ని బట్టి సరైన ల్యాప్‌ టాప్ ఎంచుకోండి మరి.

Also Read: తక్కువ బడ్జెట్‌లో టాప్ సెక్యూరిటీ.. రూ. 1500 లోపే బుల్లి కెమెరా, వెంటనే కొనేయండి

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×