E-Paper
Advertisement

Blender Vs Mixer Grinder: బ్లెండర్ వర్సెస్ మిక్సర్ గ్రైండర్.. మీ వంటగదికి ‘పర్ఫెక్ట్’ ఏది?

Blender Vs Mixer Grinder: బ్లెండర్ వర్సెస్ మిక్సర్ గ్రైండర్.. మీ వంటగదికి ‘పర్ఫెక్ట్’ ఏది?
Advertisement

Blender Vs Mixer Grinder: ప్రతి ఇంట్లో తప్పకుండా అవసరం అయ్యే వాటిలో ముఖ్యమైనవి బ్లెండర్, మిక్సర్ గ్రైండర్. ఇవి కేవలం వంట పనులను ఈజీ చేయడమే కాదు. మీ కుకింగ్ స్టైల్‌ను కూడా లెవల్ అప్ చేస్తాయి. ఇదిలా ఉంటే.. సరైన అప్లయన్స్ ఎంచుకుంటే.. టైమ్ సేవ్ అవుతుంది. అంతే కాకుండా ఎఫర్ట్ తగ్గుతుంది.  అయితే ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటి? ఏది మీ డైలీ యూజ్‌కి బెస్ట్? చాలా మందికి ఈ రెండింటికీ మధ్య తేడాలు ఏంటో తెలియదు ? దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లెండర్ vs మిక్సర్ గ్రైండర్: మీ వంటగదికి ఏది సరైంది?
వంటగదిలో వేగంగా పని చేయాలంటే.. సరైన వస్తువులను తీసుకోవడం చాలా ముఖ్యమైంది. బ్లెండర్ , మిక్సర్ గ్రైండర్ రెండూ కూడా ఎక్కువగా ఉపయోగించే పరికరాలు. కానీ ఈ రెండు వస్తువులు వేర్వేరు అవసరాలకు అనుగుణంగా తయారు చేసారు.

Advertisement

బ్లెండర్ అంటే ఏంటి?
బ్లెండర్ ప్రధానంగా లిక్విడ్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. జ్యూస్‌లు, స్మూతీలు, మిల్క్‌షేక్స్, సూప్స్ వంటి వాటికి ఇది బెస్ట్. బ్లెండర్‌లో ఉన్న బ్లేడ్‌లు ఎక్కువ వేగంతో తిరిగి పదార్థాలను మెత్తగా మిశ్రమంగా మార్చుతాయి.

మిక్సర్ గ్రైండర్ అంటే ఏంటి?
మిక్సర్ గ్రైండర్ అనేది అన్ని రకాల పనులకు ఉపయోగపడుతుంది. ఇది గ్రైండింగ్, మిక్సింగ్, పేస్టులు తయారు చేయడం వంటి వాటికి సహాయ పడుతుంది. మసాలాలు, పప్పులు, చట్నీలు, దోస పిండి వంటి గట్టి పదార్థాలను సులభంగా దీంతో గ్రైండ్ చేయవచ్చు.

Advertisement

ప్రధాన తేడాలు:

1. వాడకం:
బ్లెండర్ జ్యూస్‌‌ల వంటి వాటికి అనుకూలం కాగా.. మిక్సర్ గ్రైండర్ గట్టి , పొడి పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది.

2. శక్తి (పవర్):
మిక్సర్ గ్రైండర్ సాధారణంగా.. ఎక్కువ పవర్ కలిగి ఉంటుంది. ఇది కఠినమైన పదార్థాలను కూడా సులభంగా గ్రైండ్ చేస్తుంది.

3. జార్ రకాలు:
బ్లెండర్‌లో సాధారణంగా ఒకటి లేదా రెండు జార్లు ఉంటాయి. మిక్సర్ గ్రైండర్‌లో మాత్రం వేర్వేరు అవసరాలకు అనుగుణంగా మూడు లేదా అంతకంటే ఎక్కువ జార్లు ఉంటాయి.

4. ధర:
బ్లెండర్ సాధారణంగా తక్కువ ధరలో లభిస్తుంది. మిక్సర్ గ్రైండర్ కొంచెం ఖరీదైనదైనా.. ఎక్కువ ఫంక్షన్లను అందిస్తుంది.

5. వాడుకలో సౌలభ్యం:
బ్లెండర్ ఉపయోగించడం సులభం. కానీ మిక్సర్ గ్రైండర్ కొంచెం కఠినమైన పదార్థాలను కూడా సింపుల్‌గా మిక్సీ చేయగలదు.

బ్లెండర్ ప్రయోజనాలు:
1. స్మూతీలు, జ్యూస్‌లకు బెస్ట్
2. తక్కువ శబ్దంతో పని చేస్తుంది.
3. క్లీనింగ్ సీంపుల్

మిక్సర్ గ్రైండర్ ప్రయోజనాలు:

* గట్టి పదార్థాలను గ్రైండ్ చేయగలదు.
* వివిధ వంటకాలకు అనుకూలం.

Also Read: ఈ క్యూట్ డిష్‌వాషర్ ఉంటే.. పనిమనిషితో అవసరమే ఉండదు!

మీ అవసరానికి ఏది సరైంది?
మీరు రోజూ జ్యూస్‌లు, స్మూతీలు ఎక్కువగా తయారు చేస్తే.. బ్లెండర్ సరిపోతుంది. కానీ మీరు మసాలాలు, పిండి, చట్నీలు వంటి వివిధ రకాల వంటకాలు చేస్తే మిక్సర్ గ్రైండర్ బెస్ట్ ఆప్షన్.

బ్లెండర్, మిక్సర్ గ్రైండర్ రెండూ వంటగదిలో అవసరమైన వస్తువులు. మీ వంట అలవాట్లు, అవసరాలు, బడ్జెట్ ఆధారంగా సరైంది ఎంచుకోవడం మంచిది. సరైన ఎంపికతో మీ వంట మరింత సులభంగా, వేగంగా మారుతుంది.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×