E-Paper
Advertisement

Shahid Afridi On PSL: ఛీ..ఛీ పింక్ బంతులు వాడ‌టం ఏంట్రా…PSL కంటే గ‌ల్లీ క్రికెట్ న‌యం, కేబుల్ టీవీ ప్ర‌సారాల కంటే దారుణం

Shahid Afridi On PSL: ఛీ..ఛీ పింక్ బంతులు వాడ‌టం ఏంట్రా…PSL కంటే గ‌ల్లీ క్రికెట్ న‌యం, కేబుల్ టీవీ ప్ర‌సారాల కంటే దారుణం
Advertisement

Shahid Afridi On PSL:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament)  గురువారం ప్రారంభమైంది. ప్రేక్షకులు లేకుండానే జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ మొదటి మ్యాచ్ లోనే ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. లాహోర్ ఖలందర్స్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్‌మెన్ ( Lahore Qalandars vs  Hyderabad Kingsmen)  మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో పింక్ బాల్ ( Pink Ball ) ప్రత్యక్షమైంది. జెర్సీలకు రంగు అంటడంతో బంతి పింక్ కలర్ లోకి మారిపోయింది. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ( SHAHID AFRIDI ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టి20 క్రికెట్ లీగ్ లో పింక్ బంతులు వాడడం ఏంటి ? కొంచమైనా బుద్ధి ఉందా ? అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై చాలా సీరియస్ అయ్యారు. ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ( PSL 2026) మూసుకోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Tanveer Ahmed On PSL: ఛీ..ఛీ నిజంగా పాకిస్తాన్ బికారి దేశమే..కెప్టెన్స్‌ ప్రెస్ మీట్ ను పెళ్లి పందిరిగా మార్చారు క‌ద‌రా

PSL కంటే గ‌ల్లీ క్రికెట్ న‌యం – షాహిద్ ఆఫ్రీది

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న తొలి మ్యాచ్ లాహోర్ ఖలందర్స్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్‌మెన్ జరిగింది. అయితే ఈ సందర్భంగా హైదరాబాద్ కింగ్స్ మెన్ జట్టు మొదట బౌలింగ్ చేసింది. అయితే వాళ్లు ధరించిన పింక్ జెర్సీ రంగు తెల్లని బంతికి అంటింది. నాణ్యత లేని జెర్సీలు ధరించిన నేపథ్యంలో ఆ కలర్ బంతులకు అంటింది. ఈ తరంలోని తెల్లటి బంతులు కాస్త పింక్ కలర్ లోకి మారిపోయాయి. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ పైన క్రికెట్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఇదే అంశంపై తాజాగా షాహిద్ ఆఫ్రీది కూడా స్పందించారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ తొలి మ్యాచ్ తనను నిరాశకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రేక్షకులు లేకుండా టోర్నమెంట్ నిర్వహించడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ టీవీల్లో చూసేందుకు క్వాలిటీగా మ్యాచ్ రావాలి.. కానీ తొలి మ్యాచ్ చెత్తగా కనిపించింది. కేబుల్ టీవీలో మ్యాచ్ చూసినట్లుగా అనిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాహోర్ ఖలందర్స్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్‌మెన్ తొలి మ్యాచ్ లో ఎలాంటి పస కనిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మ్యాచ్ మధ్యలో పింక్ బంతులు ఎందుకు వాడారో అర్థం కాలేదని చురకలు అంటించారు. అలా రంగులు పోయే జెర్సీలు ధరించే ముందు ఆలోచించాలి కదా అంటూ నిలదీశారు. దీనిపై ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పింక్ బంతులు వాడడం వల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరువు అంతర్జాతీయంగా పోయిందని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా లోపాలపై అలర్ట్ కావాలని కోరారు.

Advertisement

 

 

Also Read: IPL 2026 2nd Phase Schedule: ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..ఆ ఈవెంట్ ర‌ద్దు, ఫైన‌ల్స్ ఎప్పుడంటే

 

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×