E-Paper
Advertisement

50 డిగ్రీల ఎండలోనైనా హాయిగా గుర్రుపెట్టి నిద్రపోవచ్చు.. ఈ Silent Sleep Split ACలు ఉంటే!

50 డిగ్రీల ఎండలోనైనా హాయిగా గుర్రుపెట్టి నిద్రపోవచ్చు.. ఈ Silent Sleep Split ACలు ఉంటే!
Advertisement

Silent Sleep Split ACs: సాధారణంగా వేసవి మొదలైందంటే ఎండలు ఎక్కువగా ఉండటం వలన చాలామంది బయట తిరగకుండా వేడి సెగలకు భయపడి ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. ఈ క్రమంలో పగటిపూట ఉక్కపోతతో ఎలాగోలా నెట్టుకొచ్చినా, రాత్రిపూట మాత్రం ప్రశాంతంగా నిద్రపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ కొన్ని కూలర్లు, ఏసీలు చేసే ఆ డబ డబ శబ్దాల వల్ల నిద్ర పట్టక, మరుసటి రోజు ఆఫీసులోనో, పనిలోనో ఏకాగ్రత పూర్తిగా దెబ్బతింటుంది.

అందుకే.. కొత్తగా ఏసీలు కొనేటప్పుడు కేవలం కూలింగ్ మాత్రమే కాకుండా.. సౌండ్ లేకుండా సైలెంట్‌గా రన్ అయ్యే ఏసీలను ఎంపిక చేసుకోవాలి. మీరు కూడా మంచి సైలెంట్ ఏసీ గనుక కొనాలని ప్లాన్ చేస్తుంటూ.. LG, Daikin, Haier వంటి బ్రాండ్లు ఇప్పుడు సూపర్ సైలెంట్ టెక్నాలజీతో ఏసీలను తీసుకొచ్చాయి. ఇవి గదిని నిశ్శబ్దంగా, చల్లగా ఉంచుతూ కరెంట్ బిల్లును కూడా తగ్గిస్తాయి. ఆ ఏసీలేవో ఇప్పుడు చూసేద్దాం రండి..

ఎల్‌జీ స్మార్ట్ ఇన్వర్టర్ ఏసీ:

Advertisement

LG అనగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది నమ్మకం. ఈ 5-స్టార్ ఏసీలోని విరాట్ మోడ్ ఎండలు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కూలింగ్‌ను అమాంతం పెంచేస్తుంది. దీనిలో ఉండే ఓషన్ బ్లాక్ ప్రొటెక్షన్ వల్ల ఏసీ గొట్టాలు త్వరగా పాడవకుండా, తుప్పు పట్టకుండా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇది కేవలం 31 డెసిబుల్స్ శబ్దంతోనే పనిచేస్తుంది. అంటే.. గదిలో ఏసీ ఆన్‌లో ఉన్నట్టు కూడా కూడా తెలీనంత నిశ్శబ్దంగా ఉంటుందన్నమాట.

హైయర్ హెక్సా ఇన్వర్టర్ ఏసీ:

మీడియం సైజు గదులకు హైయర్ ఏసీ మంచి ఆప్షన్. దీనిలో ఉండే సూపర్ క్వైట్ ఫీచర్ శబ్దం రాకుండా చూసుకుంటుంది. దీంతో రాత్రిపూట ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా నిద్రపోవచ్చు. మరో మంచి విషయం ఏంటంటే.. ఈ ఏసీ జస్ట్ 10 సెకన్లలోనే గదిని చల్లబరచడం మొదలుపెడుతుంది. అలాగే లోపల ఉండే గాలిని శుభ్రం చేయడానికి ఇందులో ప్రత్యేకమైన ఫిల్టర్లు కూడా ఉన్నాయి.

డైకిన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ:

Advertisement

బడ్జెట్‌లో బెస్ట్ ఏసీ కావాలనుకునే వారికి డైకిన్ ఎప్పుడూ ఫేవరెట్. 32 డెసిబుల్స్ శబ్దంతో పనిచేసే ఈ ఏసీ గాలిని గదిలో అన్ని మూలలకూ సమానంగా పంపుతుంది. బయట 50 డిగ్రీల ఎండ ఉన్నా సరే.. లోపల మాత్రం కాశ్మీర్ లాంటి చల్లదనాన్ని అందిస్తుంది. దీనికి వాడే ప్రత్యేకమైన కోటింగ్ వల్ల మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది.

Also Read: Samsung Galaxy A36 ధర ఇంతలా తగ్గిందా? మే నెలలోనే బెస్ట్ ఆఫర్ ఇదే!

హిటాచీ ఎక్స్‌పాండబుల్ ఏసీ:

హిటాచీ ఏసీలో ఉండే వేవ్ బ్లేడ్ డిజైన్ గాలి వచ్చేటప్పుడు వచ్చే శబ్దాన్ని బాగా తగ్గిస్తుంది. 34 డెసిబుల్స్ శబ్దంతో పనిచేసే ఈ ఏసీతో చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. దీనిలో ఉండే ఫ్రాస్ట్ వాష్ టెక్నాలజీ ఏసీ లోపల దుమ్ము పేరుకుపోకుండా సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటుంది. దీనివల్ల మనకు వచ్చే గాలి ఎప్పుడూ తాజాగా, ఎలాంటి వాసన లేకుండా ఉంటుంది.

వోల్టాస్ వెక్ట్రా ఇన్వర్టర్ ఏసీ:

మన స్వదేశీ బ్రాండ్ అయిన వోల్టాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఏసీలో 4 రకాల మోడ్స్ ఉంటాయి. దీంతో మన అవసరాన్ని బట్టి కూలింగ్‌ను మార్చుకోవచ్చు. ఇది 38 డెసిబుల్స్ శబ్దంతో పనిచేస్తుంది. కరెంట్ బిల్లు తక్కువ రావడమే కాకుండా.. పర్యావరణానికి మేలు చేసే గ్యాస్‌ను దీనిలో వాడుతున్నారు. తక్కువ ధరలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఏసీ కావాలంటే వోల్టాస్ బెస్ట్.

Also Read: షోరూమ్‌లో AC నచ్చిందని వెంటనే కొనేయొద్దు.. ముందు ఈ 5 విషయాలు చెక్ చేసుకున్నాకే ముందుకెళ్లండి!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×