E-Paper
Advertisement

Samsung Galaxy A36 ధర ఇంతలా తగ్గిందా? మే నెలలోనే బెస్ట్ ఆఫర్ ఇదే!

Samsung Galaxy A36 ధర ఇంతలా తగ్గిందా? మే నెలలోనే బెస్ట్ ఆఫర్ ఇదే!
Advertisement

Galaxy A36 5G Price Drop: తక్కువ బడ్జెట్‌లో మంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్న వారికి అది కూడా శాంసంగ్ వంటి బ్రాండెడ్ మొబైల్ కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి మే నెల లక్కీ అనే చెప్పాలి. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ అదిరిపోయే ఆఫర్ తెచ్చింది. గతేడాది మార్కెట్లోకి వచ్చిన గెGalaxy A36 5G ఇప్పుడు ఎవరూ ఊహించని తక్కువ ధరకు లభిస్తోంది. దీంతో ప్రీమియం ఫీచర్లు ఉన్న ఫోన్‌ను బడ్జెట్ ధరలో దక్కించుకోవాలనుకునే మధ్యతరగతి వారికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి.

ఆఫర్ వివరాలు ఇలా..

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ శాంసంగ్ ఫోన్ మీద ఏకంగా రూ.5,920 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ మొదట్లో విడుదలైనప్పుడు దీని ధర రూ.32,999గా ఉండేది. కానీ ఇప్పుడు రకరకాల బ్యాంక్ ఆఫర్లు, ఫ్లాట్ డిస్కౌంట్లు అన్నీ కలుపుకుంటే కేవలం రూ.27,000 లోపే దీన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే మీ వద్ద యాక్సిస్ బ్యాంక్ లేదా హెచ్‌డిఎఫ్‌సి కార్డులు గనుక ఉంటే.. అదనంగా మరికొంత తగ్గింపు కూడా పొందొచ్చు. పైగా నెలవారీ వాయిదాలు (EMI) కట్టుకునే సదుపాయం కూడా ఉంది.

Advertisement

Also Read: షోరూమ్‌లో AC నచ్చిందని వెంటనే కొనేయొద్దు.. ముందు ఈ 5 విషయాలు చెక్ చేసుకున్నాకే ముందుకెళ్లండి!

50 మెగాపిక్సల్ కెమెరా..

ఈ ఫోన్ ఫీచర్ల గురించి చెప్పుకోవాలంటే.. దీని 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే కళ్లకు చాలా ఇంపుగా ఉంటుంది. తద్వారా సినిమాలు చూసినా, గేమ్స్ ఆడినా ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. ఇక ఫొటోల విషయానికి వస్తే.. 50MP మెయిన్ కెమెరాలో OIS ఫీచర్ ఉంది. దీంతో నడుస్తూ ఫొటోలు తీసినా లేదా వీడియోలు తీసినా అవి షేక్ అవ్వకుండా చాలా క్లారిటీగా వస్తాయి. ఇక 5,000mAh బ్యాటరీ ఉండటం వల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హాయిగా వాడుకోవచ్చు.

ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్:

Advertisement

ఈ ఫోన్‌లో వాడిన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ వల్ల ఫోన్ హ్యాంగ్ అవ్వదు. ఎన్ని యాప్స్ వాడినా స్పీడ్‌గా పనిచేస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ఫోన్‌కు నాలుగేళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, ఆరేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ హామీ ఇస్తోంది. దీంతో ఒక్కసారి ఈ ఫోన్ కొంటే వచ్చే ఐదేళ్ల వరకు సాఫ్ట్‌వేర్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా లేటెస్ట్ ఫీచర్లను వాడుకోవచ్చన్నమాట.

సొంతం చేసుకోండిలా..

ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న బ్యాంక్ ఆఫర్లను చూసి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ వద్ద పాత ఫోన్ ఉండి.. అది మంచి కండిషన్‌లో ఉంటే.. దానిని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ధరను ఇంకాస్త తగ్గించుకోవచ్చు. మొత్తం వివరాలు చూసుకున్నాక ఆర్డర్ పెడితే చాలు.. కొద్ది రోజుల్లోనే సరికొత్త 5G ఫోన్ మీ చేతికి వచ్చేస్తుంది.

Also Read: షాకింగ్ అప్డేట్.. వాట్సప్‌లో ఇక పెయిడ్ సర్వీస్, ఆ 6 ఫీచర్లు కావాలంటే డబ్బులు కట్టాల్సిందే!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

Big Stories

Advertisement
×