E-Paper
Advertisement

హోండా నుంచి క్రేజీ సబ్ 4మీ ఎస్‌యూవీ.. టాటా నెక్సాన్‌ కు గట్టి పోటీ తప్పదా?

హోండా నుంచి క్రేజీ సబ్ 4మీ ఎస్‌యూవీ.. టాటా నెక్సాన్‌ కు గట్టి పోటీ తప్పదా?
Advertisement

HondaNew SUV For Indian Market:  భారతీయ మార్కెట్ కోసం హోండా మరోసారి కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ పై దృష్టి పెట్టింది. ఈ మేరకు కొత్త సబ్-4 మీటర్ ఎస్‌యూవీని తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త మోడల్ 2028లో మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. WR-V నిలిపివేసిన తర్వాత ఖాళీగా ఉన్న హోండా కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఈ కారు అడుగు పెట్టనుంది.

మార్చి 2023 నుంచి WR-V డిస్ కంటిన్యూ!   

మార్చి 2023లో WR-V ఉత్పత్తి ఆపిన తర్వాత, హోండా నుంచి చిన్న ఎస్‌యూవీ వస్తుందనే ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు కంపెనీ స్వయంగా కొత్త మోడల్‌పై కీలక ప్రకటన చేయడంతో ఆసక్తి నెలకొంది. ఈ కొత్త ఎస్‌యూవీ భారతీయ వినియోగదారుల అవసరాలు, రోడ్డు పరిస్థితులు, బడ్జెట్‌ ను దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తామని హోండా తెలిపింది. భారత మార్కెట్‌కు సరిపోయే ప్రత్యేక స్పెసిఫికేషన్లతో ఈ వాహనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వివరించింది. అంతర్జాతీయ మోడళ్లను నేరుగా తీసుకురావడం కంటే, భారతీయ కస్టమర్ల అభిరుచులకు సరిపోయేలా డిజైన్ చేస్తామని వెల్లడించింది.

ఏ మోడల్స్ కు పోటీ ఇస్తుందంటే?

Advertisement

ఈ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ హోండా అమేజ్ తర్వాత కంపెనీ లైనప్‌ లో రెండో సబ్ 4 మీటర్ మోడల్ అవుతుంది. మార్కెట్లో  టాటా నెక్సాన్, మహీంద్రా XUV 3XO, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ లాంటి పాపులర్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌ లో పోటీ ఎక్కువగా ఉండటంతో, హోండా కొత్త మోడల్‌పై ఆసక్తి పెరుగుతోంది.

హోండా సిటీ ఫేస్‌ లిఫ్ట్ ఫోటోలు లీక్!

అటు హోండా సిటీ ఫేస్‌ లిఫ్ట్ ఫోటోలు కూడా అధికారిక ఆవిష్కరణకు ముందే లీక్ అయింది. మే 22న దీనిని అధికారికంగా విడుదల చేయనున్నారు. లీక్ అయిన ఫోటోల ద్వారా కొత్త డిజైన్‌ లో వచ్చిన మార్పులు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త సిటీ ఫేస్‌ లిఫ్ట్‌ లో ముందు భాగం పూర్తిగా కొత్తగా కనిపిస్తోంది. కొత్త LED హెడ్‌ ల్యాంప్స్, హనీకోంబ్ స్టైల్ గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్, కొత్త ఎయిర్ ఇన్‌లెట్స్  మరింత ప్రీమియం లుక్ ఇస్తున్నాయి. కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

ఇంటీరియర్‌ లో కూడా కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత 8 అంగుళాల స్క్రీన్ బదులుగా పెద్ద ఫ్రీస్టాండింగ్ ఇన్ఫోటైన్‌ మెంట్ డిస్‌ప్లే ఇవ్వవచ్చని సమాచారం. అలాగే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, 360 డిగ్రీ కెమెరా లాంటి ఫీచర్లు కూడా జోడించే అవకాశం ఉంది. ఇంజిన్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగుతుందని భావిస్తున్నారు. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదంటే CVT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉండవచ్చు. అలాగే హైబ్రిడ్ e:HEV వెర్షన్ కూడా వస్తుందని భావిస్తున్నారు.

ధర ఎంత ఉంటుందంటే?

ధర విషయానికి వస్తే, కొత్త సిటీ ఫేస్‌ లిఫ్ట్ ప్రస్తుత మోడల్ కంటే కొద్దిగా ఎక్కువ ధర ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం సిటీ ధరలు రూ.12 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సెడాన్ మార్కెట్లో హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా, వోక్స్‌వ్యాగన్ విర్టస్ వంటి కార్లతో పోటీ పడుతోంది.

Read Also: కియా కేరెన్స్ క్లావిస్ వచ్చేసింది, ధర జస్ట్ రూ. 12 లక్షలే!

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×