E-Paper
Advertisement

రూ. 40వేలలోపే లగ్జరీ లుక్..ఆఫర్‌లో బెస్ట్ ఫ్రిజ్‌లు

రూ. 40వేలలోపే లగ్జరీ లుక్..ఆఫర్‌లో బెస్ట్ ఫ్రిజ్‌లు
Advertisement

Best refrigerators under 40000: ఇప్పుడు మాడ్యులర్ కిచెన్‌ల ట్రెండ్‌లో ఫ్రిజ్ కేవలం కూరగాయలు, వస్తువులు స్టోర్ చేసుకునే బాక్స్ మాత్రమే కాదు, ఇంటీరియర్‌ను హైలైట్ చేసే.. మేజర్ స్టైల్ ఎలిమెంట్! మార్కెట్లో లగ్జరీ బ్రాండ్ల హవా నడుస్తున్నప్పటికీ.. లక్షలు ఖర్చు పెట్టాల్సిన పనే లేదు. సరిగ్గా రూ. 40వేల బడ్జెట్‌లోనే ఇంటర్నేషనల్ లుక్స్, అడ్వాన్స్‌డ్ హై-ఎండ్ ఫీచర్లతో.. దర్జాగా ఉండే.. టాప్-గ్రేడ్ రిఫ్రిజిరేటర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ, మల్టీ-కన్వర్టిబుల్ మోడ్స్ , ప్రీమియం మెటాలిక్ ఫినిషింగ్‌తో ప్రస్తుతం మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాప్ 5 బడ్జెట్ లగ్జరీ ఫ్రిజ్‌ల పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం!

మీ ఇల్లు మోడ్రన్‌గా కనిపించాలన్నా, సరుకులు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలన్నా సరైన ఫ్రిజ్ ఉండాలి. అధిక ధర పెట్టకుండానే.. ప్రీమియం లగ్జరీ ఫీల్ అందించే రూ. 40,000 బడ్జెట్ మోడల్స్ ఇవే…

1. Samsung 322L Convertible 5-in-1:

Advertisement

సామ్‌సంగ్ బ్రాండ్ అనగానే ముందుగా.. గుర్తొచ్చేది వాళ్ల ప్రీమియం ఫినిషింగ్, నమ్మకమైన క్వాలిటీ. ఎలిగెంట్ ఇనాక్స్ ఫినిషింగ్‌తో లగ్జరీ లుక్ ఇస్తుంది. ఫింగర్‌ప్రింట్ రెసిస్టెంట్ కోటింగ్ వల్ల ఫ్రిజ్ ఎప్పుడూ కొత్తదానిలా మెరిసి పోతుంది. ఇందులో.. 5-ఇన్-1 కన్వర్టిబుల్ ఆప్షన్ ఉంది. మీ అవసరానికి తగ్గట్టుగా ఫ్రీజర్‌ను సాధారణ ఫ్రిజ్‌గా మార్చుకోవచ్చు. డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ వల్ల.. కరెంట్ బిల్లు చాలా తక్కువగా వస్తుంది.

పెర్ఫార్మెన్స్: పవర్ కూల్, పవర్ ఫ్రీజ్ బటన్స్ ద్వారా వేగంగా.. కూలింగ్ అందుతుంది. పెద్ద కుటుంబాలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

Advertisement

ధర: సుమారు రూ.37,990.

2.LG 288L Smart Inverter Frost Free:

ఎల్‌జీ ఒక క్రేజీ అండ్ ట్రస్టెడ్ బ్రాండ్. షైనీ స్టీల్ ,గ్లాసీ ఫినిషింగ్ వల్ల కిచెన్‌కు గ్రాండ్ అప్పియరెన్స్ వస్తుంది. దీనిలోని డోర్ కూలింగ్ ప్లస్ టెక్నాలజీ వల్ల ఫ్రిజ్ డోర్ వైపు ఉన్న బాటిల్స్‌కు కూడా సమానంగా కూలింగ్ అందుతుంది. స్మార్ట్ డయాగ్నోసిస్ ఫీచర్ ద్వారా ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఫోన్ ద్వారానే గుర్తించొచ్చు.

పెర్ఫార్మెన్స్: కూలింగ్ ఒకే రకంగా ఉంటూ కూరగాయలు, పండ్లు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటాయి. సౌండ్ చాలా తక్కువగా రావడం దీని ప్రత్యేకత.

ధర: సుమారు రూ.37,900.

3.Whirlpool Protton 300L Triple Door:

మూడు డోర్ల ఫ్రిజ్ వాడటం ఒక రాయల్ ఫీలింగ్‌ను ఇస్తుంది. రూ. 40,000 బడ్జెట్‌లో ఇది ఒక బెస్ట్ ఆప్షన్. విభిన్నమైన ట్రిపుల్ డోర్ స్టైల్‌తో లగ్జరీ మోడల్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది. మూడు ప్రత్యేక విభాగాల (ఫ్రీజర్, ఫ్రిజ్, వెజిటబుల్ డోర్) వల్ల ఒక వాసన మరొక దానికి పట్టదు. ఇందులో.. ఉన్న జెయోలైట్ టెక్నాలజీ కూరగాయలు త్వరగా పాడవకుండా చూస్తుంది.

పెర్ఫార్మెన్స్: యాక్టివ్ డియోడరైజర్ వల్ల ఫ్రిజ్ లోపల.. ఎప్పుడూ మంచి సువాసన ఉంటుంది. కూలింగ్ కేటాయింపు చాలా సిస్టమాటిక్‌గా ఉంటుంది.

ధర: సుమారు రూ.29,590.

4.Haier 300L Bottom Mount Convertible:

సాధారణంగా ఫ్రీజర్ పైన ఉంటుంది. కానీ ఈ మోడల్‌లో ఫ్రీజర్ కింద ఉంటుంది. గ్రాఫైట్ బ్లాక్, స్లీక్ మెటాలిక్ లుక్ మీ వంటింటిని సరి కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. బిఎమ్‌ఆర్ మోడల్ కావడం వల్ల పదే పదే వంగాల్సిన అవసరం ఉండదు. కూరగాయల సెక్షన్ పైన అందుబాటులో ఉంటుంది. ఇందులో 8-ఇన్-1 కన్వర్టిబుల్ మోడ్స్ ఉన్నాయి.

పెర్ఫార్మెన్స్: ట్విన్ ఇన్వర్టర్ టెక్నాలజీతో కరెంట్ ఆదా అవ్వడమే కాక, కరెంట్ పోయినప్పుడు కూలింగ్ చాలా సేపు అలాగే ఉంటుంది.

ధర: సుమారు రూ.33,990.

5.Godrej Eon Vogue 280L:

స్వదేశీ బ్రాండ్ గోద్రేజ్ మోడ్రన్ టచ్‌తో తీసుకొచ్చిన అద్భుతమైన సీరీస్ ఇది. నార్మల్ కలర్స్ కాకుండా వింటేజ్ అండ్ మోడ్రన్ వుడ్/ప్రీమియం ఫినిషింగ్‌లతో.. మార్కెట్‌లో విభిన్నంగా కనిపిస్తుంది. మైక్రో బ్లాక్ టెక్నాలజీ వల్ల బ్యాక్టీరియా.. చేరకుండా ఆహారం సేఫ్ గా ఉంటుంది. నానో షీల్డ్ టెక్నాలజీ ద్వారా.. పండ్లు, కూరగాయలు 95% పైగా విటమిన్లను కోల్పోకుండా ఉంటాయి.

పెర్ఫార్మెన్స్: ఇన్వర్టర్ కంప్రెసర్ సహాయంతో .. నిశ్శబ్దంగా పనిచేస్తూనే.. సూపర్ కూలింగ్ అందిస్తుంది.

ధర: సుమారు రూ. 35,990.

Also Read: ఈ సౌండ్ బార్ ఉంటే..ఇల్లు డిస్కో టెక్ అవడం గ్యారంటీ!

ఈ ఫ్రిజ్‌లు ఎందుకు కొనాలి?

ప్రీమియం లుక్స్: మీ కిచెన్‌కు ఆధునిక, లగ్జరీ లుక్‌ను అందిస్తాయి.

కరెంట్ సేవింగ్: టెస్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీల వల్ల.. కరెంట్ బిల్లు భయం ఉండదు.

ఫ్లెక్సిబిలిటీ: కన్వర్టిబుల్ ఆప్షన్ల వల్ల పండగలు, ఫంక్షన్ల సమయంలో.. స్టోరేజ్ టెన్షన్ ఉండదు.

తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ స్టైల్,లేటెస్ట్ టెక్నాలజీ కోరుకునే వారికి ఈ రెఫ్రిజిరేటర్లు పర్ఫెక్ట్ ఛాయిస్!

Related News

విదేశాలకు వెళ్తున్నారా? రోమింగ్ బిల్లుల బెంగ వదిలేసి, ఇలా eSIM వాడేయండి!

కేవలం రూ.17 వేలకే హైయర్ ఫ్రిజ్.. అమెజాన్ సేల్‌లో కస్టమర్లకు పండగలాంటి ఆఫర్లు!

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

Big Stories

Advertisement
×